అన్వేషించండి

Healthy Heart: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ పద్ధతిలో వంట చేయండి

గుండెని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాలు నిండిన ఆహారం మాత్రమే కాదు వంట చేసే విధానం కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మధ్య కాలంలో పేపర్ ఓపెన్ చేస్తే చాలు నిలబడుతూ, మాట్లాడుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న వారి మరణ వార్తలే దర్శనమిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు ఎక్కువగా గుండెని ప్రమాదంలో పడేస్తున్నాయి. శరీరంలోని ప్రధాన అవయవం గుండె. కానీ దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. గుండెని సంరక్షించుకోవాలంటే ప్రధానంగా చేయాల్సిన పని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం, కంటి నిండా నిద్రపోవడం. ఇవే కాదు మనం ఆహార పదార్థాలు వండుకుని తినే విధానం కూడా గుండెని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని ఆహారాల్లో నిపుణులు సిఫార్సు చేసిన దానికంటే చాలా తక్కువ పరిమాణంలో తీసుకునేది కూరగాయలు, పండ్లు. ఇలా చేయడం వల్ల గుండె ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెకి అనుకూలమైన ఆహారంలో ఈ ఆహారాలు రోజుకి కనీసం ఐదు సేర్వింగ్స్ ఉండాలని ఒక నివేదిక చెబుతోంది. మనం తీసుకునే పదార్థాలు వండుకునే విధానం, రుచి, రంగు, జీర్ణశక్తి, శోషణ, పోషక విలువలపరంగా గుండెని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. బాగా కాగిన నూనెలో వేయించిన ఆహారం తీసుకోవడం, నూనె ఎక్కువ వేసి వేపుళ్ళు చేసుకుని తినడం గుండెకి మాత్రమే కాదు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. వండే కూరగాయాల్లో కాస్త నీళ్ళు పోసి ఆవిరితో ఉడికించి తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవే కాదు మరికొన్ని విధానాలు కూడా గుండెని పదిలంగా ఉంచుతాయి.

తక్కువగా ఉడికించాలి: వంట పద్ధతి ఎలా ఉన్నప్పటికీ అతిగా ఉడికించడం ఎప్పుడూ మంచిది కాదు. అలా చేయడం వల్ల ఆహారంలోని పోషకాలతో పాటు వాటి రంగు, రుచి కూడా పోతుంది. తక్కువగా ఉడికించుకోవడం కోసం ప్రెజర్ కుక్కర్ లేదా మైక్రోవేవ్ లో వంట చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. తక్కువ సమయంలో త్వరగా వంట పూర్తవుతుంది.

నీరు తప్పనిసరి: నీళ్ళు పోసుకుని వంట చేసుకుంటే మంచిది కదా అని అతిగా పొయ్యకూడదు. తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే నీటిలో కరిగే పోషకాలు బయటకి పోతాయి. అలాగే వండేటప్పుడు బేకింగ్ సోడా జోడించడం మానుకోండి. ఇది వేస్తే మంచి రంగు వస్తుంది కానీ అందులోని విటమిన్ సి కంటెంట్ తగ్గిపోతుంది.

అధిక ఉష్ణోగ్రత వద్దు: గ్రిల్లింగ్, బేకింగ్, బాయిలింగ్, ఫ్రైయింగ్ వంటి వేడి పద్ధతులు వద్దు. 180 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వంట చేయడం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులతో సంబంధం ఉన్న యాక్రిలామైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద మాంసం/పనీర్/ దుంపలు కాల్చడం వల్ల శరీరానికి హాని చేసే రసాయనాలు వెలువడతాయి.

కుకింగ్ ఆయిల్: వంట నూనెలు గుండెకి చాలా ముఖ్యం. ఏది ఆరోగ్యానిక్ ఉత్తమమైందో తెలుసుకోవాలి. మల్టీ సోర్స్ కుకింగ్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. బేకింగ్, వేయించడం వంటి అధిక ఉష్ణోగ్రత వంట పద్ధతులకు ఇది మంచిది.

ఇదే కాదు అధికంగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు మితంగా తీసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్, అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ట్ మాంసాలు తీసుకోకపోవడమే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఓట్స్ Vs గోధుమరవ్వ: వీటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Embed widget