News
News
X

Weight Loss Diet: ఓట్స్ Vs గోధుమరవ్వ: వీటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారు

బరువు తగ్గడం కోసం మీకు ఈ రెండు ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

FOLLOW US: 
Share:

రువు తగ్గాలని అనుకునే వాళ్ళు ముందుగా ఎంచుకునేది ఓట్స్, వీలైనంత వరకు ఓట్స్ చేసిన పదార్థాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. కానీ ఇదే కాదు మీకు దాలియా కూడా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. దాలియా అంటే మరేదో కాదు గోధుమ రవ్వ. ఇవి రెండు బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఎంపికలే. కానీ వీటిలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా పని చేస్తుందో తెలుసా?

పోషకాలు

గోధుమరవ్వ భారతీయ గృహాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. పిల్లలు గోధుమ రవ్వతో చేసిన్ ఉప్మా అంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. మధుమేహులకు ఎంతో మంచి ఆహార ఎంపిక. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు B, E, మెగ్నీషియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇక ఓట్స్ లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోనూ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇనుము, జింక్, విటమిన్ B వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.

ఈ రెండూ బరువు తగ్గడంలో ఎలా సహాయపడతాయి?

బరువు తగ్గడంలో దాలియా, ఓట్స్ రెండూ ప్రభావవంతంగా పని చేస్తాయి. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కావాలనుకుంటే దాలియా మంచి ఎంపిక. ఫైబర్ అధికంగా ఉన్నందున జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అతిగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ జీఐ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే భయం కూడా లేదు. అతిగా తినాలనే కోరికని అణచి వేస్తుంది.

కొవ్వు కరిగించాలనుకునే వాళ్ళకు ఓట్స్ ఉత్తమ ఎంపిక. ఇందులోని ఫైబర్ పొట్ట నిండినట్టు అనిపించేలా చేస్తుంది. ప్రోటీన్ కంటెంట్ కండరాలు బలోపేతం చేస్తుంది. కేలరీలను బర్న్ చేస్తాయి. చురుకుగా వ్యాయామం చేయనప్పుడు కూడా మీ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఓట్స్ లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చివరిగా..

బరువు తగ్గడం విషయానికి వస్తే వ్యక్తి అవసరాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుకుంటూనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలని అనుకుంటే దాలియా తినండి. కొవ్వు కరిగించుకోవాలంటే ఓట్స్ తినొచ్చు. రెండు సమతుల్యమైన ఆరోగ్యకరమైన ఎంపికలే. కొద్దిగా భిన్నమైన ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ బరువు తగ్గించే లక్ష్యాన్ని మాత్రం చేరుకునేలా సహాయపడతాయి. ఇవి మాత్రమే కాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆహారంలో మార్పులు చేసుకోవడం, జీవినశైలిలో మార్పులు వంటివి కూడా ముఖ్యమే. అప్పుడే మీరు అనుకున్నట్టుగా బరువు తగ్గుతారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఈ ఏటీఎంలో డబ్బులు కాదు నోరూరించే వేడి వేడి బిర్యానీ వస్తుంది- భారత్ లోనే తొలి బిర్యానీ ఏటీఎం!

Published at : 16 Mar 2023 07:51 AM (IST) Tags: Oats Weight Loss Food Oats Benefits Weight Loss Dalia Oats Vs Dalia Benefits Of Dalia

సంబంధిత కథనాలు

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?

సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?