Biryani ATM: ఈ ఏటీఎంలో డబ్బులు కాదు నోరూరించే వేడి వేడి బిర్యానీ వస్తుంది- భారత్ లోనే తొలి బిర్యానీ ఏటీఎం!
అవును మీరు విన్నది నిజమే..! ఇక్కడ ఏటీఎం మిషన్లో ఎంతో రుచికరమైన బిర్యానీ వచ్చేస్తుంది. అది ఎక్కడ ఉందో తెలుసా?
ఏటీఎం అంటే డబ్బులు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఏటీఎం మిషన్ లో మాత్రం నోరూరించే బిర్యానీ వస్తుంది. అది ఎక్కడో కాదు తమిళనాడులోని చెన్నైలో. భారత్ లోనే మొట్టమొదటి బిర్యానీ వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేశారు. కస్టమర్ ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే తాజా బిర్యానీ మీ ముందుకు వచ్చే'స్తుంది. ఏటీఎం మెషీన్ మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. డబ్బులు ఆర్డర్ చేసుకోవడానికి ఎలాగైతే ఆప్షన్స్ ఎంచుకుంటామో అలాగే మీకు ఎటువంటి బిర్యానీ కావాలో స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని ఎంచుకుని డబ్బులు చెల్లిస్తే చాలు బిర్యానీ ప్యాకెట్ బయటకి వచ్చేస్తుంది.
చెన్నైకి చెందిన బాయ్ వీటూ కళ్యాణం(బీవీకే బిర్యాని) పేరుతో వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేశారు. కొలత్తూర్ ప్రాంతంలో ఈ వెండింగ్ మెషీన్ ఉంది. భారత్ లోనే తొలి బిర్యానీ వెండింగ్ మెషీన్ ఇది. వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ సర్వ్ చేయడం దీని స్పెషాలిటీ. కస్టమర్లని ఆకర్షించేందుకు సదరు కంపెనీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 32 అంగుళాలతో ఒక మెషీన్ అమర్చారు. కస్టమర్ ఆర్డర్ ఇవ్వడానికి ముందుగా మెనూ చూపిస్తుంది. పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చు. ఇక్కడ మటన్ మినీ బిర్యానీ రూ.345.
డబ్బులు కట్టిన తర్వాత బిర్యానీ ప్యాకేజ్ ఆటోమేటెడ్ మెషీన్ కింద ఉన్న షెల్ఫ్ కిందకి వచ్చే ముందు స్క్రీన్ పై కౌంట్ డౌన్ టైమర్ పడుతుంది. అది ఇచ్చిన గడువు లోపు వేడి వేడి ఫ్రెష్ బిర్యానీ మీకు అందించేస్తుంది. భారత్ లోనే తొలి బిర్యానీ వెండింగ్ మెషీన్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది ఈ సరికొత్త ప్రయోగాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొంతమంది మాత్రం బిర్యానీ నాణ్యత ఎలా ఉంటుందోనని సందేహిస్తున్నారు. ఎటిఎం నుంచి బిర్యానీ ఎలా వస్తుందో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీద ఓసారి లుక్కేయండి..
చెన్నైలో 2020 లో BVK బిర్యానీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చెన్నై అంతటా కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అందించే స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో 30 నిమిషాల్లో డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామని సదరు కంపెనీ చెబుతోంది. బిర్యానీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అత్యధికులు ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. ఫుడ్ డెలివరీ యాప్ లో ప్రతి నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్ లు వస్తున్నాయని స్విగ్గీ వెల్లడించింది. ఇక తమ యాప్ లో నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని జొమాటో తెలిపింది.
Also read: జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు అసలు చేయొద్దు, చాలా ప్రమాదం
View this post on Instagram