News
News
వీడియోలు ఆటలు
X

Ginger, Garlic: సమ్మర్‌లో అల్లం, వెల్లుల్లి తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

అల్లం, వెల్లులి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే అవి వేడి గాలులకు ఎండిపోతాయి. కానీ ఈ టిప్స్ పాటించారంటే కనీసం ఆరు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

అల్లం, వెల్లుల్లి లేకుండా ఏ వంట గది ఉండదు. ఇవి వేసవి కాలంలో చాలా ముఖ్యమైనవి. వంటల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ వేసవిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అల్లం సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి, తేమ గాలుల సమయంలో ఇది చాలా ముఖ్యమైనది. అల్లం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇక వెల్లుల్లి రక్తపోటుని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో నిర్జలీకరణం వల్ల రక్తపోటు స్థాయిలు పెరిగిపోతాయి. అటువంటి సమయంలో ఇది చక్కగా పని చేస్తుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్ గుణాలు కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ వేసవి వేడికి అల్లం, వెల్లుల్లిని నిల్వ చేయడం కష్టం. ఎందుకంటే అవి వేడి గాలులకు త్వరగా ఎండిపోతాయి. అందుకే తక్కువగా కొనుగోలు చేసి పెట్టుకుంటారు. కానీ ఇక మీదట ఆ కష్ట లేకుండా ఉండాలంటే మీరు ఇలా చేసి చూడండి. కనీసం 6 నెలల పాటు అల్లం, వెల్లుల్లి నిల్వ చేసుకోవచ్చు.

అల్లం నిల్వ చేసే చిట్కా

⦿ పొట్టు తీయని అల్లం ఎయిర్ టైట్ బ్యాగ్ లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. గాలి చొరబడని బ్యాగ్ వల్ల అల్లంకి తేమ, ఆక్సిజన్ అందవు. చెడిపోకుండా ఉంటాయి. ఇలా చేస్తే రిఫ్రిజిరేటర్ లో రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.

⦿ ఒకసారి కట్ చేసిన లేదంటే తొక్క తీసిన అల్లం నిల్వ ఉండదు ఎండిపోతుందని పడేస్తారు. కానీ వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసుకుని ఫ్రిజ్ ల పెట్టుకోవచ్చు. ఒక వారం వరకు నిల్వ ఉంటుంది.

⦿ ఇక మూడో పద్ధతిగా అల్లం ముక్కలు ముక్కలుగా చేసుకుని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేస్తే అల్లం చెడిపోకుండా రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.

వెల్లుల్లి నిల్వ చేసే పద్ధతులు

⦿ సరిగా నిల్వ చేస్తే వెల్లుల్లి ఆరు నెలల వరకు చెడిపోకుండా ఉంటుంది. వెల్లుల్లి మొలకలు లేకుండా చూసి ఎండ తగాలని చీకటి ప్రదేశంలో పెట్టుకోవాలి. తక్కువ కాంతి తగలడం వల్ల చెడిపోవడం తగ్గుతుంది.

⦿ వెల్లుల్లిని రెబ్బలుగా ఒలిచి లేదా కట్ చేసి ఉంటే వాటిని ఉపయోగించకుండా ఉన్నారా? వాటిని విసిరేసే బదులు గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఇలా చేస్తే వెల్లుల్లి రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. అయితే వాటిని తరిగి నిల్వ చేయడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది.

⦿ ఫ్రిజ్ లో ఎవరూ వెల్లుల్లి పెట్టుకోరు. ఎందుకంటే దాని ఘాటైన వాసన ఫ్రిజ్ అంతా వ్యాపిస్తుందని దూరం పెడతారు. కానీ సరైన పద్ధతిలో వెల్లుల్లిని ఫ్రిజ్ లో ఉంచితే తాజాగా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: అమ్మాయిలూ ఇది విన్నారా? టాయిలెట్ సీట్ కంటే మీ మేకప్ బ్రష్ మీదే బ్యాక్టీరియా ఎక్కువట!

Published at : 18 Apr 2023 06:00 AM (IST) Tags: Garlic Ginger Garlic Benefits Ginger Benefits Kichen Hacks

సంబంధిత కథనాలు

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Odisha Train Accident: రైల్వే ప్రమాదాలకు సీబీఐకి సంబంధం ఏంటి? సేఫ్‌టీ గురించి వాళ్లకేం తెలుస్తుంది - ప్రధానికి ఖర్గే లేఖ

Odisha Train Accident: రైల్వే ప్రమాదాలకు సీబీఐకి సంబంధం ఏంటి? సేఫ్‌టీ గురించి వాళ్లకేం తెలుస్తుంది - ప్రధానికి ఖర్గే లేఖ

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!