Homes For Employees: మీరు దేవుడు సామి.. ఉద్యోగులకు కానుకగా ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు
ఉద్యోగుల శ్రమను దోచుకొనే కంపెనీలున్న ఈ రోజుల్లో.. ఇలా ఉచితంగా ఇళ్లను ఇచ్చే సంస్థలు కూడా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఊహించారా?
కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా ఉద్యోగుల శ్రమను దోచేస్తుంటాయో తెలిసిందే. ఏడాదంతా గొడ్డులా పనిచేసినా.. కనీస ప్రోత్సాహలు ఇచ్చేందుకు కూడా కొన్ని సంస్థలకు చేతులు రావు. దీంతో ఉద్యోగులు సంస్థలు మారుతూనే ఉంటారు. అయితే, మీరు ఇలాంటి సంస్థలో చేరితే.. వేరే సంస్థలోకి మారాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే.. ఈ సంస్థ తమ ఉద్యోగులకు బోనస్‌గా ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ వంటి నగరాల్లో ఇంటి అద్దెలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. కనీసం ఇల్లు కొనుగోలు చేద్దామన్నా.. డబ్బులు సరిపోవు. మహా నగరాల్లో ఇళ్లు సామాన్యుడికి అందని ద్రాక్షే. ఈ రియల్ బూమ్‌ను నియంత్రించే దమ్ము.. ధైర్యం.. ప్రభుత్వాలకు కూడా లేదు. తక్కువ విలువ చేసే ఇళ్లను కోట్లకు విక్రయిస్తున్నా.. కమీషన్లు మరిగిన నేతలు మిన్నకుంటున్నారు. దీంతో చిన్న చిన్న ఉద్యోగులకు నీడ కరువవుతోంది. ఇక సంస్థల విషయానికి వస్తే.. సేవలు చేయించుకోవడమే గానీ.. తమ ఉద్యోగికి జీతాలు పెంచాలనే ఆలోచన కూడా ఉండదు.
అయితే.. ఫ్లొరిడాలోని ఆల్టమోంటే స్ప్రింగ్స్ సంస్థ ఆ టైపు కాదు. ఉద్యోగుల కష్టాలను ముందే తెలుసుకుంది. చిన్న చిన్న బోనస్‌లు వారికి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయేగానీ.. వారి అవసరాలు తీర్చలేవని గుర్తించిన ‘మెకానికల్ వన్’ అనే సంస్థ సీఈవో జాసన్ జేమ్స్.. తమ సంస్థలో బోనస్‌గా ఉద్యోగులకు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. ‘మెకానికల్ వన్’ సంస్థ కొత్తగా డెవలప్ చేసే ఇళ్లకు ఎయిర్ కండిషనింగ్, ప్లంబింగ్ సేవలను అందిస్తుంది.
‘‘మనం మన ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకుంటే.. వారు సంస్థ బాగోగులు చూసుకుంటారు. సొంత సంస్థగా సేవలు అందిస్తారు. అందుకే.. మా సంస్థలో ఉద్యోగుల కోసం మూడు పడక గదులు, రెండు బాత్రూమ్‌లు కలిగిన ఇళ్లను నిర్మించేందుకు రెండు స్థలాలను కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.3.74 కోట్లు కేటాయించామని తెలిపారు. వాస్తవానికి.. తమ ఉద్యోగులకు బోనస్‌గా కారు లేదా విహారయాత్రల ప్యాకేజీలను కానుకగా ఇద్దామని అనుకున్నానని తెలిపారు. అయితే, వాటికంటే ముఖ్యమైనది సొంత ఇల్లు అని, అంతకంటే గొప్ప కానుక మరేది ఉండదని అన్నారు. ప్రస్తుతం రెండు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను సిద్ధం చేస్తున్నామని, ఎవరైతే మంచి పనితీరు కనబరుస్తారో వారికి ఆ ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు.
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
‘‘మా ఉద్యోగుల్లో చాలామందికి ఇళ్లు ఉన్నాయి. వారిలో కొంతమంది అద్దెకు ఉంటున్నారు. అలాంటివారికి ఇది సువర్ణ అవకాశం. ఈ ఇళ్ల కోసం వారు ఎలాంటి లోన్ చెల్లించక్కర్లేదు. కంపెనీకి డబ్బులు కూడా కట్టక్కర్లేదు’’ అని తెలిపారు. ఈ బోనస్‌కు అర్హత సాధించాలంటే ఉద్యోగి కనీసం ఏడాది పనిచేయాలి. అలాగే ఏదైనా స్వచ్ఛంద సంస్థతో కలిసి 20 గంటలు సామాజిక సేవలు అందించాలి. కంపెనీ ఆధ్వర్యంలో జరిగే ఆర్థిక క్రమశిక్షణ కార్యక్రమంలో పాల్గోవాలి. ఉద్యోగులు సొంత ఇళ్లను పొందాలనే లక్ష్యంగా మరింత చురుగ్గా పనిచేస్తారు. అయితే, ఈ సంస్థ ఈ ఏడాది జులై నెలలో 100 మంది ఉద్యోగులతో కొత్తగా సేవలను ప్రారంభించింది. ఇటీవల జరిగిన సమావేశంలో జేమ్స్ ఈ ప్లాన్ గురించి ప్రకటించారు. ఈ ఆఫర్‌ను పొందాలంటే.. మరో ఏడు నెలలు ఆగాల్సిందే.
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి