అన్వేషించండి

Flax Seeds: సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే అవిసె గింజలు, రోజూ గుప్పెడు తిన్నా చాలు

ఆహారంలో అవిసెగింజలు వాడడం చాలా తక్కువ. వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే అందరూ తింటారు.

పెళ్లయ్యాక పిల్లల కోసం ఎదురుచూస్తుంటారు కొత్త జంటలు. వారిలో కొంతమందికి గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేకపోయినా త్వరగా గర్భం ధరించరు. అలాంటివారు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే ఆహారం తినడం చాలా అవసరం. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా గర్భం రావడం ఆలస్యమవుతుంది. అవిసె గింజలను వేయించుకుని రోజూ గుప్పెడు తింటే చాలా మంచిది. వాటితో చేసుకునే వంటలు కూడా చాలా ఉన్నాయి. వాటిని చేసుకుని తిన్నా మంచిదే. 

అవిసెగింజల్లో అద్భుతమైన ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి హార్లోన్లను సమతుల్యం చేయడానికి, శక్తి ఉత్పత్తికి సాయపడుతుంది. అవిసె గింజల్లో ఉండే నూనె పేగులకు సాంత్వన కలిగిస్తుంది. జీర్ణక్రియకు,పోషకాల శోషణకు తోడ్పడుతుంది. మీరు తిన్న ఆహారంలో పోషకాలన్నీ రక్తంలో కలిసేట్టు చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పెద్ద పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

స్త్రీలు తరచూ అవిసెగింజలు తినడం వల్ల అండాశయంలో రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. అలాగే పురుషులు తింటే వృషణాలలో రక్తం చురుకుగా ప్రవహిస్తుంది. ఇద్దరిలోనూ సంతానోత్సత్తి సామర్ధ్యం పెరుగుతుంది. అయితే అధికంగా ఆడవారి ఆరోగ్యానికే ఇవి అవసరం. అండోత్సర్గము (ఒవులేషన్)ను ప్రోత్సహిస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎలాంటి గుండె సంబంద వ్యాధుల ప్రమాదం రాకుండా అడ్డుకుంటాయి. 

 హెచ్చరిక
గర్భం ధరించకముందే అవిసెగింజలు లేదు అవిసెగింజ నూనెను ఆహారం రూపంలో తీసుకోవచ్చు. ఓసారి గర్భం వచ్చినట్టు తేలాక వాటిని దూరం పెట్టడం మంచిది. వీటి వల్ల గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశం ఉందని చెబుతారు. 

అవిసె గింజలు తినాలనిపించపోతే వాటితో  కొన్ని రకాల వంటలు చేసుకుని తినవచ్చు. అవిసె గింజల లడ్డూ, అవిసె మొలకలు, అవిసె డ్రింక్, మునగాకు అవిసె గింజల పొడి లాంటివి చేసుకోవచ్చు. అవిసె గింజల్ని రాత్రి నానబెడితే ఉదయానికి మొలకలు వస్తాయి. వాటిని తింటే చాలా మంచిది. అలాగే అవిసెగింజల్ని నీటిలో నానబెట్టి, ఆ నీళ్లను వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: విటమిన్ ట్యాబ్లెట్లు మింగుతున్నారా? అవి అకాలమరణాన్ని ఆపలేవంటున్న కొత్త అధ్యయనం

Also read: ఈ ఆహారాలకు ఎక్స్‌పైరీ డేటే లేదు, ఎన్నాళ్లయినా వాడుకోవచ్చు

టాప్ హెడ్ లైన్స్

Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
AP Local Body Elections: పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
Embed widget