Healthy Laddus Recipe for Winter : గుండె జబ్బులను దూరం చేసి.. మధుమేహాన్ని అదుపులో ఉంచే లడ్డూల రెసిపీ ఇదే
Tasty Immunity Laddu : బరువు తగ్గడం నుంచి.. గుండె జబ్బులు దూరం చేయడం వరకు.. ఇమ్మ్యూనిటీ పొందడం నుంచి.. చర్మ, జుట్టు సంరక్షణవరకు ప్రయోజనాలు అందించే ఓ లడ్డూ రెసిపీ ఇదే.
Flaxseed Laddus Recipe : చలికాలంలో రోగనిరోధక శక్తి (Winter Immunity Care) చాలా అవసరం. అయితే ఆరోగ్యాన్నిచ్చే ఫుడ్స్ ఎక్కువ టేస్ట్గా ఉండవు. అయితే ఓ లడ్డూ మీకు ఇమ్యూనిటితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. దీనికోసం మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కిచెన్లో గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం సమయాన్ని వెచ్చించి.. మీరు టేస్టీ ఇమ్యూనిటీ లడ్డూల(Tasty Immunity Laddu)ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.
ఇంతకీ ఆ లడ్డూ ఏంటి అనుకుంటున్నారా? అదే అవిసె గింజల లడ్డూ. ఇది పోషకాహారానికి పవర్హౌస్. కాబట్టి చలికాలంలో దీనిని మీ రోటీన్లో చేర్చుకుంటే.. పిల్లల నుంచి పెద్దలవరకు అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు పొందుతారు. మరి ఈ హెల్తీ లడ్డూను ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
అవిసె గింజలు - 4 టేబుల్ స్పూన్లు
బెల్లం - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 100 గ్రాములు
బాదం - 100 గ్రాములు
ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్
యాలకూల పొడి - అర టీస్పూన్
నెయ్యి - లడ్డూలు చుట్టేందుకు సరిపడా
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి రోస్ట్ చేయండి. చివర్లో అవిసె గింజలు వేసి.. వేగాక తీసేయండి. వాటిని పూర్తిగా చల్లార్చనిచ్చి.. మిక్సిలో వేయాలి. వాటిని పూర్తిగా పొడిగా కాకుండా.. కాస్త ముక్కలుగా ఉండేలా మిక్సి చేసుకోవాలి. దానిలో బెల్లం, యాలకుల పొడి వేసి మరో మిక్సీ చేయండి. ఈ మిశ్రమాన్ని నెయ్యి సహాయంతో లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే హెల్తీ, టేస్టీ లడ్డూలు రెడీ.
ఈ లడ్డూలు చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలా ఆరోగ్యప్రయోజనాలు పొందుతారు. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. హృదయ సంబంధ వ్యాధులను దరిచేరనీయవు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. పైగా దీనిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించి.. శరీరంలోని మలినాలను, టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. దీనిని రెగ్యూలర్గా తీసుకుంటే మలబద్ధకం పూర్తిగా తగ్గుతుంది.
పోషకాలకు పవర్హౌస్ అయిన ఈ లడ్డు రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. దీనిలోని ఒమేగా 3, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఆరోగ్యకరమైన చర్మాన్ని, జుట్టును అందిస్తాయి. ముఖ్యంగా మధుమేహాన్ని దూరం చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. శరీరానికి అన్ని పోషణలు అందిస్తూనే బరువును ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గేందుకు ఈ లడ్డూలు బెస్ట్ ఆప్షన్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూను మీ డైట్లో కచ్చితంగా చేర్చుకోవచ్చు.
Also Read : చలికాలంలో బిర్యానీ ఆకుల కషాయం తాగితే ఎంత మంచిదో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.