News
News
X

సాఫ్ట్ డ్రింక్స్ పురుషులకు మంచివేనా? సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతాయా?

కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నపుడు వృషణాలు, అంగపరిమాణంలో మార్పు స్పష్టంగా కనిపించిందట. అయితే ఇంకా ప్రయోగం ఎలుకల మీద చేసినపుడు కనిపించిన ఫలితాలను మాత్రమే వెల్లడి చేశారు. అవేమిటో చూద్దాం.

FOLLOW US: 
Share:

ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ ముఖ్యంగా ఫిజీ డ్రింక్స్(carbonated drinks) తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఎన్నెన్నో పరిశోధనలు, వాటి ఫలితాల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ చైనాలో జరిగిన కొత్త ప్రయోగాలు ఇప్పటి వరకు చెప్పిన వాటిలో కొన్నింటికి భిన్నమైన ఫలితాల గురించి చర్చకు తెరలేపింది. కొన్ని రకాల డ్రింక్స్ వల్ల పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఆశ్చర్య కరమైన ప్రభావాన్ని చూపించిందట. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నపుడు వృషణాలు, అంగపరిమాణంలో మార్పు స్పష్టంగా కనిపించిందట. అయితే ఇంకా ప్రయోగం ఎలుకల మీద చేసినపుడు కనిపించిన ఫలితాలను మాత్రమే వెల్లడి చేశారు. అవేమిటో చూద్దాం.

పాపులర్ ఫిజి డింక్ప్ తీసుకోవడం వల్ల వృషణాల పరిమాణం పెరగడంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులకు కారణం అవుతున్నాయనే విషయం కొత్త పరిశోధనల్లో వెల్లడైంది. కోకాకోలా, పెప్పీ వంటి డ్రింక్స్ తీసుకున్నపుడు టెస్టోస్టిరాన్ పెరిగిందని, మగ ఎలుకల్లో జననేంద్రియ పరిమాణం పెరిగిందని చైనా పరిశోధకులు కనుగొన్నారు. తాజా వివరాలు గత పరిశోధనా ఫలితాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఫిజీ డ్రింక్స్ టెస్టోస్టెరాన్ స్థాయిల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్టు ఇది వరకు ఉన్న పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రతికూల ఫలితాలే ఎక్కువ

టెస్టోస్టెరాన్ పెరగడం వరకు ఓకే కానీ ఈ డ్రింక్స్ వల్ల స్థూలకాయం, డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుందని కూడా నిపుణుల హెచ్చిరిస్తున్నారు. అంతేకాదు ఈ డ్రింక్స్ స్త్రీల పునరుత్పత్తి మీద ప్రతి కూల ప్రభావాన్ని కూడా చూపుతున్నాయట. ఇది వరకు జరిగిన ప్రయోగాల్లో ఈ డ్రింక్స్ వల్ల ఆడ ఎలుకల్లో అండాశయాల పరిమాణం తగ్గించడం అండాల సంఖ్య తగ్గినట్టు కూడా గుర్తించారట.

15 రోజుల పాటు 100 ఎలుకల మీద రెండు ఫిజీ డ్రింక్స్ ప్రభావాలను ఈ తాజా పరిశోధన పరిశీలించింది. వివరాలు జర్న్ యాక్టా ఎండోక్రినాల్ లో ప్రచురించారు. కొన్ని ఎలుకలను కోక్ తో మరి కొన్నింటిని పెప్సీతో బోనుల్లో పెట్టారు. మరో ఎలుకల సమూహానికి కేవలం స్వచ్ఛమైన నీటిని ఇచ్చారు. మంచి నీటి సమూహంలో ఎలుకల కంటే పెప్సీ, కోక్ తాగిన ఎలుకల వృషణాల పరిణామం చాలా పెరిగినట్టు గుర్తించారట.  

పెరుగుతున్న పరిమాణం?

మరో అధ్యయనంలో పురుషుల అంగపరిమాణం గడచిన 30 సంవత్సరాలలో సగటున 25 శాతం వరకు పెరిగినట్లు తేలింది. 1922 నుంచి 2021 వరకు స్థంభించిన అంగ పరిమాణం 4.8 నుంచి 6 అంగుళాలకు పెరిగినట్టు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అయితే, ఈ మార్పు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్లా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. స్టాన్ పోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం వరల్డ్ జర్నల్ ఆఫ్ మెన్ హెల్త్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సరైన పోషకాహారం లేకపోవడం, పెద్దగా శారీరక శ్రమ లేని జీవిన విధానం వల్ల కూడా అంగపరిమాణం పెరగవచ్చు. ఇదంతా సంతానోత్పత్తి మీద ప్రతికూల పరిణామాలకు కారణం కూడా కావచ్చు అని హెచ్చరించారు. చూశారుగా, ఇవన్నీ పరిశోధనలు మాత్రమే. ఒక్కో అధ్యయనం ఒక్కో ఫలితాన్ని చెబుతోంది. కాబట్టి, ఏదీ పూర్తిగా నమ్మొద్దు. కూల్ డ్రింక్స్ వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ. బీ కేర్ ఫుల్.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 26 Feb 2023 10:55 AM (IST) Tags: Soft Drinks fizzy drinks testicle size penis size

సంబంధిత కథనాలు

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

టాప్ స్టోరీస్

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?