Avoid After Meals: భోజనం తర్వాత ఈ పనులు చేశారో ఇక మీ ఆరోగ్యం మటాష్!
అన్నం తిన్న వెంటనే పడక ఎక్కేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. అది ఎంత ప్రమాదమో తెలిస్తే ఇక మీదట మీరు అసలు అలాంటి పని చేయరు.
భోజనం చేశాక చాలా మందికి పడుకునే అలవాటు ఉంటుంది. మరికొంతమంది సిగరెట్ తాగడానికి ఇష్టపడతారు. ఇంకొంత మంది వెంటనే స్నానం చేయడానికి బయల్దేరిపోతారు. కానీ ఈ అలవాట్లు అన్నీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని అలవాట్లు జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే భోజనం చేసిన తర్వాత మీరు కూడా ఇలా చేస్తుంటే వెంటనే మానేయండి. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిద్ర వద్దు
భోజనం చేసిన తర్వాత నిద్రపోతే హాయిగా ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహార అణువులు విచ్చిన్నం చేయడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆహారం అరగకపోగా ఇబ్బంది పెడుతుంది. అందుకే భారీగా భోజనం చేసిన వెంటనే నిద్రకు దూరంగా ఉండటం మంచిది.
ధూమపానం వద్దు
తిన్న వెంటనే కొందరు సిగరెట్ తాగేస్తారు. కానీ అది ఆరోగ్యాన్ని, జీవక్రియను నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం భోజనం తర్వాత ధూమపానం చేయడం అంటే 10 సిగరెట్లు ఒకేసారి తాగడంతో సమానం. అంటే అది ఎంత హానికరమో మీరే ఆలోచించుకోండి.
స్నానం చేయడం
జీర్ణక్రియ ప్రక్రియని ఆలస్యం చేస్తుంది. అందుకే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం మంచి అలవాటు కాదని ఇంట్లో వాళ్ళు చెబుతూ ఉంటారు. స్నానం చేయడం వల్ల పొట్ట చుట్టు జరిగే రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్నానం చేసే సమయంలో శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
పండ్లు తినొద్దు
అన్నం తిన్న వెంటనే ఏదో ఒక పండు తినడం చాలా మందికి ఉన్న అలవాటు. పండ్లు ఆరోగ్యకరమైనవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ భోజనం చేసిన వెంటనే వాటిని తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. పండ్లు తినడానికి ఉత్తమ సమయం భోజనానికి రెండు గంటల ముందు లేదా తిన్న రెండు గంటల తర్వాత తింటే ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయకపోగా మంచి చేస్తుంది. ఇది జీవక్రియను పెంచడంలోను సహాయపడుతుంది. పోషకాలను గ్రహించడంలో కూడా మెరుగ్గా పని చేస్తుంది.
టీ వద్దే వద్దు
టీ సాధారణంగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అందులోని టీలోను కెఫీన్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. భోజనం చేసిన వెంటనే ఒక కప్పు టీ తీసుకోవడం వల్ల ఆహార అణువులు విచ్చిన్నానికి ఆటంకం ఏర్పడుతుంది. ఆహారంలోని ప్రోటీన్ కంటెంట్ అజీర్ణానికి కారణమవుతుంది. అంతే కాదు భోజనం తర్వాత టీ తాగితే ఐరన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే తిన్న తర్వాత పొరపాటున కూడా టీ తాగొద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చర్మానికి హాని చేసే ఆహారాలు ఇవే