By: ABP Desam | Updated at : 26 Sep 2023 07:18 PM (IST)
Image Credit: Pixabay
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న చేప నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కానీ కొంతమందికి అసలు ఒమేగా 3 కొవ్వులు అంతే ఏంటి అనేది సరిగా తెలియదు. వీటిని సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటారు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు బహుళ అసంతృప్త కొవ్వు అమాలు. ఆహారం ద్వారా వీటిని తీసుకోవడం చాలా అవసరం. ఇవి సహజంగా శరీరంలో తయారు కాలేవు. అందుకే దీన్ని ఆహారం ద్వారా మాత్రమే పొందగలుగుతాం. ఇవి ప్రధానంగా మూడు రకాల ఆహారాల్లో లభిస్తాయి.
ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ((ALA): ఆకుపచ్చ కూరలు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా గింజలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపిస్తుంది.
ఐకోసపెంటనోయిక్ యాసిడ్ (EPA): ఇది సీ ఫుడ్, గుడ్లు, తల్లి పాలలో మాత్రమే లభిస్తుంది. మూడోది docosahexaenoic యాసిడ్ (DHA). ఇది కూడా సముద్ర ఆహారాల ద్వారా పొందవచ్చు.
ఒమేగా 3 ఆమ్లాలు కణాల నిర్మాణానికి కీలకం. గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థ పని చేయడంలో సహాయపడతాయి. చేపలు తీసుకోవడం వల్ల ఈ ఆమ్లాలు శరీరానికి అందుతాయి.
ఒమేగా 3 కొవ్వులు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని చేపలు తినే వ్యక్తుల మీద చేసిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే చేప నూనె వల్ల అవే ప్రయోజనాలు పొందటం కష్టం. దీని మీద రెండు గ్రూపుల మీద పరిశోధన చేస్తాయి. ఒక బృందానికి చేపలు, మరొక బృందానికి చేప నూనెతో కూడిన సప్లిమెంట్లు ఇచ్చారు. చేపలు లేదా చేప నూనె సప్లిమెంట్లు తీసుకున్నప్పుడు శరీరంలో EPA, DHA స్థాయిలు అదే విధంగా పెరుగుతాయని కనుగొన్నారు.
చేపల్లో ప్రోటీన్, విటమిన్లు ఏ, డి, అయోడిన్, సెలీనియం వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం నుంచి కూడా ఈ ఆమ్లాలు పొందవచ్చు.
గుండె వ్యాధులు తగ్గుతాయి
హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చేపల నూనె తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలలో మార్పు ఏమి ఉండదు. నేషనల్ హార్ట్ ఫౌండేషన్ ఆధారంగా గుండె ఆరోగ్యం కోసం ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉండే చేపలను తినాలని సిఫార్సు చేస్తున్నారు. ట్యూనా, సాల్మన్, ట్రేవల్లీ, మాకేరల్, స్నూక్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వులు ఎక్కువ రుచిగా ఉంటాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొవ్వు రకం గుండె వైఫల్యం లేదా అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వారికి చేప నూనె ప్రయోజనకరంగా ఉంటుందని ఫౌండేషన్ చెబుతోంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు చేప నూనె మాత్రం సిఫారసు చేయబడదు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వ్యాధి తీవ్రతని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. చేపలు తినడం కూడా మంచిదే. చేపలు తింటే EPA , DHA స్థాయి ఎక్కువగా ఉంటుంది. అయితే తరచుగా చేపల నుండి మాత్రమే ఆ మొత్తాన్ని తీసుకోవడం కష్టం. ఆర్థరైటిస్ వాపును తగ్గించుకోవడానికి రోజుకి 2.7 గ్రాముల EPA, DHA ని తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి క్యాప్స్యుల్ లో ఇవి ఉంటాయి. రోజుకి తొమ్మిది నునహీ 14 క్యాప్స్యుల్స్ అవసరం అవుతాయి. ఇది సుమారు 130 గ్రాముల కాల్చిన సాల్మన్ లేదా మాకేరాల చేపల నుంచి పొందవచ్చు.
ఎపిడేమిలాజికల్ అధ్యయనాల ప్రకారం డీహెచ్ఏ తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. సప్లిమెంట్లు, చేపల ద్వారా పొందే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వల్ల విభిన్నమైన ఫలితాలు చూపించాయి. చిత్త వైకల్యం ఉన్నవారికి ఒమేగా 3 కొవ్వు సప్లిమెంట్లు అందించడం వల్ల ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. కానీ తేలికపాటి అభిజ్ఞా పనితీరు బలహీనంగా ఉన్న వారికి ఇచ్చినప్పుడు పరిస్థితి మెరుగుపడింది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు
Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి
Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?
Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి
Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>