News
News
X

పిల్లలకు జ్వరం వచ్చే ముందు కనిపించే లక్షణాలేమిటీ? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?

కొద్దిగా శరీరం వెచ్చగా అనిపిస్తే చాలు వామ్మో జ్వరం వచ్చేసిందని డాక్టర్ దగ్గరకి పరిగెత్తేస్తారు చాలా మంది. అసలు జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వైద్యులని సంప్రదించాలో తెలుసా?

FOLLOW US: 

వానాకాలం వచ్చిందంటే దోమల స్వైర విహారం చేస్తాయి. వాటి వల్ల వైరల్ ఫీవర్స్ వచ్చి అందరినీ ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు కరోనా వల్ల కూడా పదే పదే జ్వరాలు వస్తున్నాయ్. అయితే పిల్లల్లో ఎంత టెంపరేచర్ ఉంటే జ్వరం వచ్చినట్టు? ఎప్పుడు వైద్యులని సంప్రదించాలి అనేది అందరికీ ఉండే అనుమానమే. ఇది ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే సీజన్. అందుకే పిల్లల విషయంలో అసలు అశ్రద్ధ వహించకూడదు. వాళ్ళ శరీరం ఏ మాత్రం వేడిగా అనిపించినా, వాళ్ళు నీరసంగా కనిపించినా వెంటనే జ్వరం వచ్చిందో లేదో తెలుసుకోవాలి. ఇంతక ముందు అయితే ఫీవర్ చెక్ చేయాలంటే హాస్పిటల్స్ లో మాత్రమే ధర్మామీటర్స్ ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవి అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్ ధర్మామీటర్ ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవడం మంచిది.

జ్వరం వచ్చిందని తెలిసేది ఎలా? 

మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు. వయస్సు రీత్యా శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. 100.4 డిగ్రీల టెంపరేచర్ వస్తే జ్వరం వచ్చిందని అర్థం. ఒక్కో సారి శరీర ఉష్ణోగ్రత 100 లోపు ఉన్నా కూడా వణుకురావడం, తలనొప్పి, త్రివర అలసటగా అనిపిస్తే అది జ్వరం వస్తుంది అనేందుకు సంకేతంగా భావించాలి. చిన్న పిల్లల్లో అయితే ఆరిచేతులు, అరికాళ్లు వెచ్చగా ఉండటం, కళ్ళు ఎర్రగా మారిపోవడా, ఛాతీ, వీపు వేడిగా ఉన్నా ఫీవర్ వచ్చే ముందు లక్షణాలు. హై టెంపరేచర్ కనిపించగానే వైద్యుల దగ్గరకి పరుగు తీస్తారు కొందరు. సాధారణంగా వచ్చిన జ్వరం అయితే మూడు లేదా నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. అటువంటి సమయంలో శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఎక్కువగా ద్రవ పదార్థాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. బయట తిరగకుండా ఇంట్లోనూ ఉంటూ బాగా విశ్రాంతి తీసుకోవాలి.

ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా గాని జ్వరం తగ్గకుండా తరచూ వస్తుంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉండి. విపరితమైనా దాహం వేయడం, మూత్రం తక్కువగా రావడం, తిమ్మిర్లు, విపరీతమైన నీరసంగా ఉండి బలహీనంగా అనిపించినా సమయాల్లో నిర్లక్ష్యంగా వహించకుండా వెంటనే వైద్యులని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

పిల్లల్లో కనిపించే లక్షణాలు 

పిల్లల్లో అయితే దద్దుర్లు రావడం, సరిగా తినకపోవడం, మూత్రం పోయకుండా ఉండటం, కళ్ళు ఎర్రగా మారిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అటువంటి సమయంలో పారాసిటమాల్ వేసిన ఎటువంటి ఫలితం కనిపించదు. మూడు నెలల్లోపు పిల్లల్లో జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. అలాగే ఆరు నెలల్లోపు పిల్లలకి 102 డిగ్రీల జ్వరం వస్తే ఎమాత్రం ఆలస్యం చెయ్యకూడదు. తగ్గిపోతుందిలే అని అనుకుంటే అది పసి పిల్లలకి చాలా ప్రమాదంగా మారుతుంది.

వ్యక్తిగత శుభ్రం అవసరం 

ప్రస్తుతం ఒమిక్రాన్ అంటూ కరోనా కొత్త వేరియంట్ భయపెడుతుంది. ఇదే కాదు నిత్యం ఏదో ఒక వైరస్ వల్ల ఫీవర్ సమస్య వస్తూనే ఉంటుంది. ఒమిక్రాన్ లక్షణాలు కూడా జ్వరం రావడమే. మీకు కనుక అది వస్తే ఐదు రోజుల పాటు బయట వ్యక్తులకి దూరంగా ఉండాలి. ఒక వేళ మీకు తెలిసిన వారికి వస్తే వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ బారి నుంచి రక్షణ పొందాలంటే బయటకి వెళ్లొచ్చిన ప్రతి సారి చేతులు శుభ్రం చేసుకోవాలి. చేతులు కడుక్కోకుండా వాటిని కళ్ళు, ముక్కు, నోటి దగ్గర అసలు పెట్టుకోకూడదు. అలా చెయ్యడం వల్ల మన చేతుల మీద ఉండే బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి రోగాలను వ్యాప్తి చేస్తుంది. అందుకే అందరూ బయటకి వెళ్ళే సమయంలో తప్పని సరిగా మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి.  

Also read: స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Also read: ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే

Published at : 20 Aug 2022 11:48 AM (IST) Tags: Fever Symptoms Fever Symptoms In Adults Fever Symptoms Children Precautions Of Fever

సంబంధిత కథనాలు

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

World’s Smallest Snake: ప్రపంచంలోనే అతి చిన్న పాము, దీన్ని వానపాము అని ముట్టుకుంటే..

World’s Smallest Snake: ప్రపంచంలోనే అతి చిన్న పాము, దీన్ని వానపాము అని ముట్టుకుంటే..

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ