అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Stomach Cancer: కడుపు క్యాన్సర్.. 50 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వస్తుంది. స్త్రీలతో పోల్చితే పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. జీవనశైలి కారణంగా పురుషులు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.

Stomach Cancer: ప్రపంచ వ్యాప్తంగానే కాదు భారతదేశంలోనూ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ కేసులు ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇది కడుపులో అభివృద్ధి చెందుతుంది. ప్రారంభ లక్షణాలు అస్పష్టంగా ఉండటంతో దీనిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. 

క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు కడుపులోని ఇతర భాగాలకు సమీపంలో అవయవాలన్నింటికి వ్యాపిస్తుంది. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. మనదేశంలో కడుపు క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

కడుపు క్యాన్సర్ కేసులు మన దేశంలో ఎందుకు పెరుగుతున్నాయి?

చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యు పరమైన కారణాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినడం వల్ల మనదేశంలో కడుపు క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రత్యేకమైన ఆహార పద్ధతులు, ముఖ్యంగా మసాలా ఫుడ్స్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో కూడా కడుపు క్యాన్సర్ రోగులు పెరుగుతున్నట్లు ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. 

కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50ఏళ్లకు పైబడిన వారిలో వస్తుంది. స్త్రీలతో పోల్చితే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి కారణంగా పురుషులు ఎక్కువగా ఈ కడుపు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎక్కువగా కారంగా, ఉప్పుగా ఉండే ఆహారాన్ని తినేవారు కడుపు క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. హార్మోన్ల వ్యత్యాసాలు, జన్యుపరమైన కారకాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

కడుపు క్యాన్సర్ లక్షణాలు ఏవిధంగా ఉంటాయి? 

- నిరంతరం పొత్తికడుపులో నొప్పి లేదా అసౌకర్యం, 
- బరువు తగ్గడం
- ఆకలిని కోల్పోవడం
- మింగడంలో ఇబ్బంది
- వికారం
- వాంతులు 
- మలంలో రక్తం

ఇవన్నీ కూడా కడుపు క్యాన్సర్ లక్షణాలు. అయితే ఇవి ప్రారంభం దశలో కనిపించకపోవచ్చు. అయితే మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. 

కడుపు క్యాన్సర్ లో రకాలు:

రోగనిర్దారణను బట్టి కడుపు క్యాన్సర్ కొన్ని రకాలుగా వర్గీకరించారు
- అడెనోకార్సినోమా
- లింఫోమా
- గ్యాస్ట్రోఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్స్ 

చాలా మందిలో కడుపు క్యాన్సర్ చివరి దశలో బయటపడటంతో అధిక మరణాల రేటుకు దారితీస్తుంది. ధూమపానం, ఆల్కహాల్, నైట్రేట్ లు, హెలికోబాక్టర్, పైలోరి ఇన్ఫెక్షన్ వంటి పలు ఎటియోలాజికల్ కారకాలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కారణమయ్యే కారకాలుగా నిపుణులు అంటున్నారు. ఈ తరహా క్యాన్సర్ చికిత్స కోసం శస్త్ర చికిత్స్ , కీమో థెరపీతో సహా మల్టి మోడాలిటీ చికిత్స అవసరాన్ని బట్టి వైద్యం అందిస్తున్నారు. 

నివారణ:

తాజా పండ్లు, కూరగాయలతో సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, దూమపానం, ఆల్కహాల్ మానేయడం, తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.

Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget