అన్వేషించండి

Night Sweats : రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Excessive Night Sweats : రాత్రుళ్లు అధికంగా చెమట రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే.. చెమటకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడున్నాయి. చూసేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాత్రిపూట అధిక చెమట: కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి.
  • హార్మోన్ల మార్పులు, మందులు, టీబీ, ఇన్ఫెక్షన్లు కారణం కావచ్చు.
  • గది ఉష్ణోగ్రత, దుప్పటి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
  • బరువు తగ్గడం, దగ్గు, జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

Excessive Night Sweats Causes : రాత్రుళ్లు చాలామందికి చెమట వల్ల ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇది కేవలం వేడి వల్ల మాత్రమే కాదు.. వివిధ కారణాల వస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు రాత్రుళ్లు చెమట అధికంగా రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎప్పుడు వైద్యుడిని సంప్రదిస్తే మంచిదో తెలుసుకుందాం. 

చెమటకు రెగ్యులర్ కారణాలు

చెమట ఎక్కువగా రావడానికి గది ఉష్ణోగ్రత, కప్పుకొనే దుప్పటి మందంగా ఉండడం, గాలి వెళ్లేందుకు వెంటిలేషన్ లేకపోవడం వంటి రొటీన్ కారణాలుగా ఉంటాయి. రాత్రి పడుకోముందు స్పైసీ ఫుడ్ తినడం, ఆల్కహాల్, కెఫిన్ తీసుకోవడం వల్ల కూడా చెమట్లు వస్తాయి. అయితే ఆరోగ్య సమస్య వల్ల కూడా చెమట అధికంగా వస్తుందని చెప్తున్నారు. అవేంటంటే.. 

ఆరోగ్య సమస్యలు ఉంటే.. 

మహిళల్లో మోనోపాజ్ సమయంలో చెమటలు ఎక్కువగా వస్తాయి. మోనోపాజ్ దశ ముందు, పీరియడ్స్ సమయంలో కూడా హార్మోన్ల మార్పుల వల్ల చెమటలు వస్తాయి. అలాగే పురుషుల్లో టెస్టోస్టిరాన్ తగ్గడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా చెమట ఎక్కువగా వస్తుంది.

డిప్రెషన్ మందులు, జ్వరం తగ్గించే మందులు, బీపీకోసం వాడే మెడిసన్, స్టెరాయిడ్స్, మధుమేహ మెడిసన్ కూడా చెమటకు కారణమవుతాయి. టీబీ ఉన్నవారికి రాత్రుళ్లు చెమట పట్టడం కామన్. హెచ్ఐవీ, ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, వైరల్ ఫీవర్స్ ఉన్నవారికి కూడా చెమటలు పడతాయి. యాంగ్జైటీ, ఒత్తిడి, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా స్వెట్ వస్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రూమ్ టెంపరేచర్ 18 నుంచి 22 డిగ్రీలు మధ్య ఉండేలా చూసుకోండి. తేలికగా ఉండే కాటన్ దుప్పటి వాడండి. నిద్రకు ముందు గదిలో ఫ్యాన్ లేదా ఏసీ ఆన్ చేయండి. పరుపు కూడా కాటన్ అయితే మంచిది. అలాగే నిద్రకు 2,3 గంటల ముందే డిన్నర్ చేయండి. స్పైసీ, ఆయిల్ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. ఆల్కహాల్, కెఫీన్ తాగకండి. చల్లటి నీళ్లు తాగి పడుకోండి. 

అలాగే రాత్రుళ్లు పడుకునేముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ చేయడం మంచిది. నిద్రకు ముందు వ్యాయామం అధికంగా చేయకండి. 

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

చెమట ఎక్కువగా పడుతున్నప్పుడు కొన్ని లక్షణాల గమనిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. కారణం లేకుండా బరువు తగ్గడం, రాత్రుళ్లు దగ్గు, చెమట రావడం, జ్వరం, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. వారానికి 2 లేదా 3 రాత్రులకంటే ఎక్కువగా చెమటలు వస్తున్నాయి లేదా ఎక్కువ కాలంగా ఈ సమస్య ఉంటే.. వైద్య సహాయం తీసుకోవాలి.

రాత్రుళ్లు చెమట పట్టడం అనేది చాలా సహజమైన విషయమే. కానీ అది మరీ ఎక్కువగా లేదా వివిధ లక్షణాలతో ఉన్నప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్, హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget