(Source: Poll of Polls)
National Nutrition Week 2025 : రుతుక్రమం ఆగిన తర్వాత మహిళలు తినాల్సిన ఫుడ్స్ ఇవే.. మోనోపాజ్ దశలో అస్సలు మరవకండి
Menopause Diet : పోషకాహారం పిల్లలకే కాదు పెద్దలకు కూడా మంచిదని చెప్తున్నారు. ముఖ్యంగా మోనోపాజ్ తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ఫుడ్స్ తినాలంటున్నారు.

Nutrition Week 2025 : పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే.. కలిగే లాభాలు ప్రజలకు తెలియజేసుందుకు ప్రతి సంవత్సరం ఇండియాలో నేషనల్ న్యూట్రిషియన్ వీక్ నిర్వహిస్తారు. పోషకార లోపంతో పిల్లల నుంచి పెద్దలకు కలిగే ఇబ్బందులను గుర్తిస్తూ.. వాటిని దూరం చేసే విధంగా ప్రజలను ప్రోత్సాహించాలని 1982లో ఇండియాలో దీనిని ప్రారంభించారు. అయితే ఈ స్పెషల్ వీక్ సందర్భంగా మోనోపాజ్ తర్వాత మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఏ ఫుడ్స్ తింటే మంచిదో చెప్తున్నారు పోషకాహార నిపుణులు ముగ్ధ ప్రధాన్.
మోనోపాజ్‌లో కలిగే ఇబ్బందులివే
మహిళల్లో పీరియడ్స్ ఎంతకామనో.. ఓ వయసు వచ్చాక అవి ఆగిపోవడం కూడా అంతే కామన్. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత మహిళల్లో చాలా మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో శరీరంలో వేడి పెరగడం, హార్మోన్ల మార్పులు, కోపం రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే చాలా మంది మహిళలు మోనోపాజ్ తర్వాత తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారట. మూడ్ స్వింగ్స్, చికాకు, ఆందోళనతో ఇబ్బంది పడతారట. హార్మోన్ల మార్పులు వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అయితే ఈ సమయంలో సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
మూడ్స్వింగ్స్కి కారణం అదే
మోనోపాజ్ దశలో అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలలో బ్లడ్ షుగర్ ఒకటి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిల్లోని హెచ్చుతగ్గులు మూడ్ స్వింగ్స్‌ను పెంచుతాయి. ఇది షుగర్ ఉండేవారికే కాదు. లేనివారిని కూడా ప్రభావితం చేస్తాయి. షుగర్ క్రేవింగ్స్ మూడ్ స్వింగ్స్‌కి కారణమవుతాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు టీ, కాఫీ లేదా స్వీట్ స్నాక్స్ తీసుకునే బదులుగా.. ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్‌లు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. బ్రేక్‌ఫాస్ట్ డేలో భాగంగా ఉడికించిన గుడ్డు లేదా గుప్పెడు నట్స్ తీసుకుంటే మంచిది. ఇవి షుగర్ క్రేవింగ్స్ తగ్గించి ఆందోళన, చికాకు తగ్గుతాయి.
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. బిగుసుకుపోయిన కండరాలను సడలిస్తుంది. నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. సాల్మన్, వాల్‌నట్‌లు లేదా అవిసె గింజలు తీసుకుంటే మంచిది. ఒమేగా-3 ఫ్యాట్స్ కూడా ఆరోగ్యానికి మంచివే. ఇవి వేడిని తగ్గించి.. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గట్ హెల్త్
గట్-మెదడు మధ్య సంబంధాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. మంచి అనుభూతిని కలిగించే సెరోటోనిన్ హార్మోన్ మన పేగులో తయారవుతుంది. పెరుగు, మజ్జిగ లేదా మంచి-నాణ్యత గల ప్రోబయోటిక్ సప్లిమెంట్ తీసుకుంటే అది విడుదల అవుతుంది. ప్రోబయోటిక్-రిచ్ ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో జత చేసి తీసుకుంటే గట్ హెల్త్ మెరుగవుతుంది. ఇది పూర్తి జీర్ణక్రియకు, మానసిక శ్రేయస్సుకు మద్ధతు ఇస్తుంది.
హైడ్రేషన్
హైడ్రేషన్, మైండ్‌ఫుల్ ఈటింగ్పై కచ్చితంగా ఫోకస్ చేయాలి. నీటిని శరీరానికి అందించడం ఎంత ముఖ్యమో.. శరీరానికి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నామో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. డీహైడ్రేషన్ చికాకును తగ్గిస్తుంది. అలాగే భోజనం చేసేప్పుడు మెల్లిగా నమిలి తినాల్సి ఉంటుంది. గబగబా తినడం మానేయాలని సూచిస్తున్నారు.
పీరియడ్స్ తర్వాత వీటిని రెగ్యులర్‌గా ఫాలో అయితే మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిదని చెప్తున్నారు. వైద్యులు, నిపుణుల సలహాలు తీసుకుంటే మరీ మంచిది.






















