అన్వేషించండి

More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

Excessive Drinking : మందు తాగితే కిక్ ఎక్కాలి. కానీ కొందరికి ఎంత తాగినా కిక్ ఎక్కదు. ఇలా జరగడం మంచిదా? చెడ్డదా? అసలు మందు కిక్​ ఇవ్వకపోవడానికి కారణాలేంటి?

Hidden Dangers of Excessive Drinking : అరేయ్ మావా నేను ఎంత తాగినా మందు కిక్​ ఎక్కట్లేదురా అని కొందరు బాధపడితే.. నేను ఎంత తాగినా ఇలా స్టడీగా ఉండగలను అని మరికొందరు గర్వంగా చెప్పుకుంటారు. ఈ రెండిటీలోనూ కామన్ విషయమేమిటంటే.. వీరు మందు ఎక్కువ తాగడమే. ఆల్కహాల్​ని వివిధ అకేషన్లలోనూ.. రీజన్ ఉన్నా లేకుండా తాగుతూ ఉంటారు. ఆల్కహాల్​ తాగడానికి ఉన్న ప్రధాన రీజన్​ ఏమైనా ఉందంటే అది కిక్​ ఎక్కడమే. ఇంతకీ కిక్​ ఎక్కడం మంచిదా? కిక్​ ఎక్కపోవడం మంచిదా? నిపుణుల అభిప్రాయమేంటి?

హాబీగా తాగితే..

మేటర్​ ఏంటి అంటే మందు ఎంత తాగినా కిక్ ఎక్కదు. చూశావా నేను ఎంత స్ట్రాంగో అనుకుంటారు. ఇదేమి గొప్ప విషయం కాదంటున్నారు నిపుణులు. దీనిని డేజంర్​ బెల్​గా చెప్తున్నారు. ఆల్కహాల్​ అనేది ఓ టాక్సిక్ సబ్​స్టాన్స్. దానిని మొదట్లో తీసుకుంటున్నప్పుడు కచ్చితంగా కిక్ ఎక్కుతుంది. దానివల్ల మత్తు వస్తుంది. కొందరికి టాక్సిన్ ఎక్కువైతుందిరా అనే చెప్పేలా వాంతులు కూడా అయ్యేలా బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది. ఈ పీరియడ్​ని మందు హాబీగా ఉండే రోజులని చెప్పవచ్చు. 

అలవాటుగా మారిపోతే..

హాబీగా ఎప్పుడో ఓసారి మందు తీసుకుంటే.. బ్రెయిన్ రియాక్షన్ ఇలా ఉంటే.. కంటిన్యూగా మందును తీసుకున్నప్పుడు ఎలా మారుతుందో చూద్దాం. మందును అలవాటుగా మార్చుకున్నప్పుడు బ్రెయిన్ ఇలాంటి రియాక్షన్స్ ఇవ్వడం మానేస్తుంది. మందు అలవాటుగా మారినప్పుడు బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వదు. దీనివల్ల ఎంత తాగినా కిక్ రాదు. అదేదో గొప్ప విషయంలాగా నాకు స్టామినా చాలా ఎక్కువ అనుకుంటారు. కట్ చేస్తే ఇలా కిక్ ఎక్కకపోవడమనేది ఓ డేంజర్​ బెల్​గా చెప్తున్నారు నిపుణులు. 

ఎక్కువ తాగేస్తే..

మందు ఎంత తాగినా కిక్ రావట్లేదని.. ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. వీటికి మీ బ్రెయిన్ రియాక్ట్ కాకపోయినా మీ బాడీలోని ఇతర భాగాలకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కిక్ రావట్లేదని బీర్ల కౌంట్​ను, పెగ్​ల కౌంట్​ను పెంచేవారు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్రెయిన్​కి ఎక్కువ మందు తీసుకోవడమనేది అలవాటుగా మారి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందట. దీనివల్ల కొద్ది రోజుల్లో బ్రెయిన్​లో ఉండే చాలా న్యూరాన్లు చచ్చిపోతాయట. 

బ్రెయిన్ రియాక్షన్స్ 

మనం ఏ పని చేయాలన్నా.. బ్రెయిన్​లోని న్యూరాన్లే వాటిని చేస్తూ ఉంటాయి. కానీ మందు ఎక్కువ తాగినప్పుడు అవి చనిపోతాయి కాబట్టి.. మీరు చేయాలన్నా.. మీ బ్రెయిన్ వాటికి రియాక్షన్స్ ఇవ్వడం మానేస్తుంది. ఇలా న్యూరాన్లు చనిపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సరిగ్గా ఆలోచించలేము. పని చేయలేము. కొన్నాళ్లకి మన పని మనం కూడా చేసుకోలేము. బ్రెయిన్​లో సమాచారమున్నా.. దానిని ఇతర భాగాలకు చేరవేర్చే న్యూరాన్లు ఉండవు. అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

అది రావడం పక్కా..

ఈ సమస్య పీక్స్​కి వెళ్లినప్పుడు మానసికంగా డెల్యూషన్స్ పెరుగుతాయి. నిజం నిజంలా అనిపించదు. అబద్ధాలతో ఓ కొత్త ప్రపంచం బ్రెయిన్​లో మొదలవుతుంది. రియాలిటీలో చెప్పుకోవాలంటే.. పిచ్చి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇవే కాకుండా లోపలి నుంచి శరీర భాగాలకు కూడా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే.. మీరు ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదంటే అర్థం మీ బ్రెయిన్ మీకు సంకేతాలు ఇవ్వడం మానేసిందని అర్థం. అంతేకానీ మీ స్టామినా పెరిగిందని అర్థం కాదు. 

Also Read : సెలబ్రెటీలు పవర్​లిఫ్టింగ్ చేసేది ఇందుకే.. బెనిఫిట్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget