Beauty Tips: ముఖంపై ముడతలు పడుతున్నాయా? ఈ ఫేషియల్ ట్రై చేయండి, అందంగా మెరిసిపోతారు!
వృద్ధాప్య సంకేతాలు దూరం చేసేందుకు ఇలా చేశారంటే యవ్వనంగా కనిపిస్తారు.
వృద్ధాప్య సంకేతాలతో పోరాడేందుకు అందరూ ప్రయత్నిస్తారు. వాటిని పోగొట్టేందుకు మార్కెట్లో దొరికే వాటితో ఎన్నో సౌందర్య ఉత్పత్తులు ఉంటాయి. మరి కొంతమంది తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం శస్త్ర చికిత్సలు చేయించుకుంటారు. ఇంజెక్షన్ ద్వారా అందాన్ని పొందటం కంటే సాధారణ పద్ధతులతో చర్మాన్ని మెరుగుపరచడం మేలని బ్యూటీషియన్స్ అంటున్నారు. ఇందుకు మెడికల్ ఫేషియల్ చక్కని ఎంపికని చెబుతున్నారు.
సాధారణ ఫేషియల్‌కు, మెడికల్ ఫేషియల్ తేడా ఏంటీ?
సాంప్రదాయ ఫేషియల్ చర్మాన్ని శుభ్రపరచడానికి లేదా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువ మంది వీటినే చేయించుకుంటూ ఉంటారు. మెడికల్ ఫేషియల్ దీని పూర్తి భిన్నంగా ఉంటుంది. చర్మం మీద ఉన్న మచ్చలు, ఇతర సమస్యల్ని పరిష్కరించడానికి ఫార్మాస్యూటికల్ గ్రేడ్ రసాయనాలను ఉపయోగిస్తారు. సాధారణ ఫేషియల్ కంటే అదనపు ప్రయోజనాలని దీని ద్వారా పొందుతారు.
ఆరోగ్యకరమైన, మృదువైన నిగనిగలాడే, మెరిసే హైడ్రేట్ స్కిన్ గా మారేందుకు అవసరమైన ప్రొడక్ట్స్ ని వైద్యులు ఉపయోగిస్తారు. ఈ ఫేషియల్ ట్రీట్‌మెంట్ చర్మాన్ని ఉత్తేజపరచడం, మృతకణాలను తొలగించడం, టాన్‌ని పోగొట్టడం, చర్మానికి అవసరమైన విటమిన్లు, సహజ పువ్వుల పదార్దాలను నింపుతుంది. చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. మెడికల్ ఫేషియల్ అనేది సహజ పదార్ధాలను ఉపయోగించి చర్మవ్యాధి నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించబడే ప్రక్రియ. పిగ్మెంటేషన్ వంటి చర్మ రుగ్మతలని మెడికల్ ఫేషియల్ ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు.
మెడికల్ ఫేషియల్ వీటికి చెయ్యొచ్చు
☀ పొడి బారిన చర్మం
☀ వదులుగా ఉండే చర్మం
☀ మొటిమల సమస్య
☀ జిడ్డు చర్మం
☀ విపరీతమైన ముడతలు
☀ బూడిద రంగు చర్మం
మెడికల్ ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది చేసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం 50 నిమిషాల్లో పూర్తవుతుంది. కేవలం ఒకే ఒక గంటలో ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చేయించుకోవడం వల్ల చర్మం మృదువుగా మెరుస్తూ యవ్వనంగా కనిపిస్తారు. సెలూన్ ఫేషియల్స్ స్వల్పకలయిక ప్రభావాన్ని చూపిస్తాయి. చర్మం తాత్కాలిక రూపాన్ని కొద్ది రోజులు మారుస్తాయి.
సైడ్ ఎఫెక్ట్స్
కాస్మోటిక్ ట్రీట్మెంట్ కోసం కొంతమంది ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. గాయాలు, మచ్చలు పోగొట్టేందుకు చికిత్స చేసిన తర్వాత ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. కానీ ఈ ఫేషియల్ వల్ల ప్రయోజనాలు అధికంగానే ఉంటాయని సౌందర్య నిపుణులు చెప్పుకొచ్చారు.
మెడికల్ ఫేషియల్స్ పలు రకాలుగా ఉంటాయి. మెసోథెరపీ, మైక్రోడెర్మాబ్రేషన్, హైడ్రాఫేషియల్, డెర్మా రోలర్, పీల్స్ వంటి పద్ధతుల్లో ఉంటుంది. చర్మ పొరలోకి విటమిన్లను ఇంజెక్ట్ చేయడానికి మైక్రోనెడిల్ ఉపయోగించబడుతుంది. మైక్రోడెర్మాబ్రేషన్ హైటెక్ మెషీన్‌తో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. హైడ్రా ఫేషియల్ అనేది హైడ్రాడెర్మాబ్రేషన్‌ను సూచిస్తుంది. ఎక్స్‌ఫోలియేషన్, యాంటీఆక్సిడెంట్ ను అందిస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది. పీల్ సాధారణంగా మీ చర్మంలోని మృతకణాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. కెమికల్ పీల్స్ శరీరంలోని ఇతర భాగాలపై కనిపించే మచ్చలు, గుర్తుల రూపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Also read: వెన్ను నొప్పి వేధిస్తోందా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు
Also Read: అల్లం, వెల్లులి మిశ్రమం అంత పవర్‌ఫుల్లా? ఈ రోగాలన్నీ హాంఫట్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.