News
News
X

అల్లం, వెల్లులి మిశ్రమం అంత పవర్‌ఫుల్లా? ఈ రోగాలన్నీ హాంఫట్!

అల్లం, వెల్లుల్లి అంటే మసాలా కూరల్లో వేసుకోవడానికే అనుకుంటారు. కానీ వాటి వల్ల బోలెడు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

FOLLOW US: 

నాన్ వెజ్ వంటకాలు చేయాలంటే అల్లం, వెల్లుల్లి లేకుండా వాటికి రుచే రాదు. భారతీయులు తమ గృహాల్లో తప్పకుండా వీటిని వినియోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక వ్యాధులని నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అనారోగ్యాలు దరి చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి వంటలకి అదనపు రుచి ఇవ్వడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలని కూడా ఇస్తాయి. అంతే కాదు దోమలని తరిమి కొట్టడానికి వెల్లుల్లి సూపర్ గా పనిచేస్తుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

అల్లం, వెల్లుల్లి రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు.  LDL కొలెస్ట్రాల్ స్థాయిలను 10-15 శాతం వరకు తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

మధుమేహం ఉన్నవారికి మంచిది

మధుమేహులు వెల్లులి తమ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మేలు చేస్తుంది. అల్లం, వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెరను గుర్తించే అణువు హిమోగ్లోబిన్ A1c (HbA1c) స్థాయిలను తగ్గించడానికి కూడా పని చేస్తాయి. ప్రతి రోజు ఉదయం వేడి వేడి అన్నంలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కాసేపు ఉంచుకొని తర్వాత వాటిని తింటే మధుమేహులకి చాలా మేలు.

రోగనిరోధక శక్తి పెంచుతుంది

ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

News Reels

జ్ఞాపకశక్తి పెంచుతుంది

ఇవి మెదడుకి మేలు చేస్తాయి. అవి జ్ఞాపకశక్తిని పెంచడంలో మెరుగ్గా పని చేస్తాయి. అభిజ్ఞా క్షీణతను నిరోధించడంలో సహాయపడే నరాల కణాలను కాపాడేందుకు సహకరిస్తాయి

అల్లం వెల్లుల్లి సూప్

ఈ రెండింటితో కలిపి సూప్ చేసుకుని తాగితే అన్నీ రోగాలకు ఔషధంగా పని చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్ళు దీని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మహిళలు వారానికి ఒక సారైనా ఈ సూప్ తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.

బరువు తగ్గేందుకు

వెల్లుల్లిలో సల్ఫర్ గుణాలు అధికంగా ఉన్నాయి. బరువు తగ్గేందుకు బాగా పని చేస్తాయి. వెల్లుల్లి నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులతో పోరాడేందుకు సమర్థవంతంగా పని చేస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6లు రోగనిరోధక శక్తిని పెంచి, సీజన్ వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తాయి. 

దోమలకు చెక్

దోమలను తరిమి కొట్టడంలో వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. వెల్లుల్లి నీళ్ళు స్ప్రే చేస్తే ఆ వాసనకి అవి పారిపోతాయి. వెల్లుల్లి వాసన దోమలకి అసలు నచ్చదు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: బ్రౌన్ షుగర్ Vs వైట్ షుగర్? ఆరోగ్యానికి ఏది మంచిది?

Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

Published at : 10 Oct 2022 01:20 PM (IST) Tags: Garlic Ginger Garlic Benefits Ginger Galric Benefits Ginger Garlic Soup Ginger-garlic Health Benefits

సంబంధిత కథనాలు

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

PVP ED Office : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

PVP ED Office  : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !