News
News
X

Foods for Sleep: రాత్రి పూట ఈ ఆహారాలు తింటే హాయిగా నిద్ర పట్టేయడం ఖాయం

రాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడేవారికి కొన్ని ఆహారాల తినడం వల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది.

FOLLOW US: 
 
మీరే తింటారో అదే మీ నిద్రను నిర్ణయిస్తుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. కొన్ని రకాల ఆహారాలు రాత్రి బాగా నిద్రపట్టేలా చేస్తే, మరొకొన్ని మాత్రం నిద్రను రాకుండా అడ్డుకుంటాయి. ప్రస్తుత కథనంలో నిద్ర పట్టేందుకు ఎలాంటి ఆహారాలు రాత్రి పూట తినాలో తెలుసుకుందాం. 

అన్నం
బియ్యంతో వండిన వంటకాలు, బంగాళాదుంపలు వంటి తక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కలిగి ఆహారాలు రాత్రిపూట తినాలి. ఇవి నిద్రా సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇవి సెరోటోనిన్, మెలటోనినన్ వంటి హార్మోన్లను ప్రేరేపిస్తాయి. వీటి వల్ల నిద్ర ముంచుకొస్తుంది. రాత్రిపూట తరచూ తెలివి రాకుండా ఉంటుంది. 

మాంసాహారం
మాంసాహారం శరీరంలో ప్రొటీన్ స్థాయిలను పెంచెందేకు సహకరిస్తుంది. వీటిని కాస్త తిన్నా కూడా పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. మాంసాహారంలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన న్యూరో ట్రాన్స్మీటర్లను రిపేర్ చేస్తాయి. అందుకే మాంసాహారం తిన్నాక హాయిగా నిద్రపడుతుంది. 

బోన్ సూప్ 
చికెన్, మటన్ ఎముకలతో చేసే సూప్ చాలా ఆరోగ్యకరం. ఇందులో ఉండే గ్లైసిన్, అమైనో ఆమ్లాలు మెదడు ప్రశాంతంగా ఉండేలా చూస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూస్తాయి. నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. 

News Reels

గసగసాలు, జాజికాయ
వంటల్లో గసగసాలు, జాజికాయల్ని భాగం చేసుకోవాలి. ఇవి నిద్ర సమస్యలను దూరం చేసేందుకు సహకరిస్తాయి. ఆయుర్వేదంలోని చాలా ఔషధాల తయారీలో కూడా వీటిని వాడతారు. వీటిని రాత్రి పై వండే వంటల్లో కలిపితే మంచిది. ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గించి చక్కటి నిద్రను అందిస్తాయి. 

నిద్రను డిస్టర్బ్ చేసేవి ఇవే
నిద్రనే తెప్పించేవే కాదు, నాశనం చేసేవి కూడా ఉంటాయి. ధూమపానం, మద్యపానం వంటివి నిద్ర సైకిల్ ను చాలా డిస్టర్బ్ చేస్తాయి. అలాగే  రాత్రి పూట అధిక కారం వేసిన ఆహారాలను తినకూడదు. ఉప్పు అధికంగా వేసే ఆహారాలై చిప్స్ వంటివి కూడా దూరం పెట్టాలి. రాత్రిపూట జంక్ ఫుడ్ ను ముట్ట కూడదు. అధిక ప్రాసెస్ చేసిన ఆహారం నిద్రను రాకుండా అడ్డుకుంటుంది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి

Also read: ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే ముందుగా చేయాల్సిన పని ఇదే

Published at : 20 Mar 2022 09:43 AM (IST) Tags: Healthy food foods for sleep Sleeping Problems Sleeping Foods

సంబంధిత కథనాలు

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

టాప్ స్టోరీస్

Telangana Trending News 2022 : కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

Telangana Trending News 2022 :  కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

కొడాలి నాని, వంగవీటి రాధ భేటీ- ఏపీ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ!

కొడాలి నాని, వంగవీటి రాధ భేటీ-  ఏపీ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ!

Duvvada Train Incident: శశికళ మృతికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

Duvvada Train Incident: శశికళ మృతికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

IND vs BAN: టీమిండియా వరుస సిరీస్ ల ఓటమి- ఆటతీరే కాదు ఇంకా ఎన్నో కారణాలు!

IND vs BAN:  టీమిండియా వరుస సిరీస్ ల ఓటమి- ఆటతీరే కాదు ఇంకా ఎన్నో కారణాలు!