Night Food: రాత్రిపూట ఇవి తింటున్నారా? ఇక మీరు నిద్రపోవడం కలే!
రాత్రి భోజనంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. రాత్రి సరిగ్గా నిద్రించకపోతే ఆ ప్రభావం తెల్లవార్లు ఉంటుంది. రాత్రిపూట తినకూడని ఆహారాలేంటో చూద్దాం.
Before Sleep Foods: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన సమతుల్య ఆహారం అందించాలి. నేటికాలంలో చాలా మంది బిజీలైఫ్ ను గడుపుతుండటంతో సమయానికి తినకపోవడం.. అర్థరాత్రి వరకు మెలకువ ఉండటంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే ఇంకొంతమంది రాత్రి భోజనం రకరకాల ఫుడ్స్ తింటుంటారు. ఫలితంగా తిన్న ఆహారం జీర్ణం కాక.. నానా అవస్థలు పడుతూ రాత్రిళ్లు మెలకువ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయే ముందు తీసుకునే ఆహారం శరీరంలో తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని పదార్థాలు నిద్రలేమికి కారణం అవుతాయి. ఇంకొన్ని అజీర్ణానికి కారణం అవుతాయి. దీంతో చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే చాలా మంది నిపుణులు రాత్రి భోజనంలో తేలికపాటి ఫుడ్స్ తీసుకోమని సూచిస్తుంటారు. రాత్రి పడుకునేముందు తినకూడని ఆ ఏడు రకాల ఆహారా పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాస్‌లు:
చాలా మంది సాస్ లను ఇష్టపడుతుంటారు. జంక్ ఫుడ్ ఇష్టపడేవారికి తప్పనిసరిగా సాస్ ఉండాల్సిందే. ఈ సాస్ లు చాలా స్పైసీగా ఉంటాయి. వీటిని రాత్రిపూట తిన్నట్లయితే శరీరంలో మంటను పెంచడంతోపాటు చికాకును కలిగిస్తుంది. గుండెలో మంట, యూసిడ్ రిఫ్లక్స్, అజీర్ణానికి కారణం అవుతాయి. అందుకే రాత్రి తినే ఆహారంలో సాస్ లను చేర్చుకోకపోవడమే ఉత్తమం.
టమోటా సూప్:
టమోటా సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ రాత్రి సమయంలో దీన్ని తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. టమాటోలో ఆమ్లం ఉంటుంది. ఇది పీహెచ్ స్థాయిలను పెంచుతుంది. గుండెలో మంట, జీర్ణక్రియకు ఆటంకం కలగడం, కడుపు లైనింగ్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సాస్ లు, సలాడ్స్ లేదా స్పాగ్ బోల్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
చాక్లెట్:
చాక్లెట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టం తింటారు. ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట నిద్రించే ముందు చాక్లెట్ తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది.
మంచినీళ్లు:
రాత్రి పడుకునేముందు చాలా మందికి మంచినీళ్లు తాగే అలవాటు ఉంటుంది. భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడం మంచిదే. కానీ పడుకునే అరగంట ముందు నీళ్లు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే నీళ్లు ఎక్కువగా తాగుతే.. అర్థరాత్రి బాత్రూమ్ కు వెళ్లాల్సి వస్తుంది. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఒకసారి నిద్రకు భంగం కలిగితే మళ్లీ నిద్రించడం కష్టంగా ఉంటుంది.
స్టీక్:
చాలా మందికి రాత్రి భోజనంలో మాంసాహారం తినే అలవాటు ఉంటుంది. రాత్రి పూట అధికప్రోటీన్ మాంసాలు, చాప్స్, బర్గర్ లు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇవి జీర్ణవ్యవస్థను 50 శాతం వరకు మందగించేలా చేస్తాయి. జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కడుపు డిస్ట్రబ్ కావడంతో రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది.
పులియబెట్టిన ఆహారం:
రాత్రి పులియబెట్టిన ఆహారం సోయా ఉత్పత్తులతో తయారు చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. డిప్పింగ్ సాస్, మిసో సూప్‌లు, టోఫు, టెరియాకి-స్టైల్ మెరినేడ్‌లు వంటి వాటిలో అధిక స్థాయిలో అమైనో ఆమ్లం టైరమైన్ ఉంటుంది.ఇవి మెదడుపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా రాత్రి మేల్కోని ఉండాల్సి వస్తుంది.
స్మూతీస్:
సాధారణ జ్యూసులకంటే రెడీమెడ్ బ్లెండెడ్ జ్యూసుల్లో అధిక చక్కెర ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. రాత్రి సమయంలో ఇలాంటి జ్యూసులకు దూరంగా ఉండటం మంచిది.
బ్రోకలీ:
కాలీఫ్లవర్, క్యాబేజీ, మొలకలు, కాలే, ఇతర బ్రాసికాస్, కోల్‌స్లా వంటి ఇతర క్రూసిఫెరస్ కూరగాయలతో పాటు కాండాలు నెమ్మదిగా జీర్ణమయ్యే ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ వీటిని రాత్రి పూట భోజనంలో చేర్చుకోకపోవడమే మంచిది.
సాసేజ్లు:
పెప్పరోని, హామ్, కోల్డ్ కట్‌లు, సాసేజ్‌లు వంటి ప్రాసెస్డ్ మాంసాలు. వీటిని రాత్రి తిన్నట్లయితే నిద్రకు భంగం కలుగుతుంది. ఇందులో అమైనో అమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని రాత్రిపూట తినకపోవడమే ఉత్తమం.
Also Read : ఓపియమ్ బర్డ్ నిజంగానే ఉందా? ఈ భయానకమైన పక్షి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.