Food in Banana Leaf: అరటి ఆకులో భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అరటాకులో భోజనం చేస్తున్నప్పుడు ఒక గొప్ప ఫీల్ ఉంటుంది. అందులో వడ్డించే ఏ వంటకమైనా అందంగా, నోరూరించేలా కనిపిస్తుంది. కడుపు నిండా తిన్నామనే సంతృప్తి లభిస్తుంది. అంతేకాదు, మీకు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
దక్షిణ భారత దేశంలో అనదిగా అరటి ఆకులో భోజనం చెయ్యడం సంప్రదాయం. అరటి ఆకులో భోజనం అనేది కేవలం సంప్రదాయమే కాదు.. శాస్త్రీయ కారణాల నుంచి జెనెటిక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అరటి ఆకును భోజనానికి ఉపయోగించడంలో కూడా రకరకాల నియమాలు ఉన్నాయి. అతిథులకు వడ్డించినప్పుడు ఆకు పైభాగంలో వడ్డించాలి. ఎవరి కోసం వారు వడ్డించుకునే సమయంలో ఆకులోని కింది భాగంలో వడ్డించుకోవాలని శాస్త్రం చెబుతోంది. పూర్వకాలంలో ప్రతి రోజూ అరటి ఆకులోనే భోజనం చేసేవారు. కానీ ఈరోజుల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అరిటాకు భోజనం చేస్తున్నారు. ఇప్పటికీ అరటి ఆకును భోజనానికి వినియోగిస్తూనే ఉన్నారు. మన పెద్దలు భోజనం కోసం అరటి ఆకును మాత్రమే ఎందుకు ఎంచుకున్నారో చూద్దాం.
అరటి ఆకు సైజ్
అరటి ఆకు సైజు చాలా పెద్దగా ఉండడం వల్ల వడ్డనకు చాలా అనువుగానూ, తినడానికి సులువుగానూ ఉంటుంది. కేరళ వారి సద్య గురించి వినే ఉంటారు. సద్య అనేది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెద్ద మొత్తంలో చాలా రకాల పదార్థాలు వడ్డిస్తారు. ఇలాంటి సందర్భంలో వడ్డించడానికి పెద్ద ప్లేట్ అవసరం అవుతుంది. అలాంటపుడు అరటాకులో వడ్డించడం చాలా సులభం అవుతుంది. ఒకే సారి అన్ని పదార్థాలు అరటాకులో వడ్డించే వీలు ఉంటుంది. అందుకే సధ్యలో అరటి ఆకును వాడుతారు.
అరటి ఆకు చాలా చవక
అరటి ఆకులు విరివిగా దొరకడం మాత్రమే కాదు, చాలా చవక కూడా. మార్కెట్ లో అమ్మకానికి కూడా దొరుకుతాయి. కిలోల చొప్పున లేదా పీస్ చొప్పున అమ్ముతారు. నిజానికి అరటి తోట ఉన్న వారేవరైనా తెలిసిన వారైతే ప్రీగానే కూడా దొరకవచ్చు కూడా.
అరటి ఆకులు వాటర్ ప్రూఫ్
సౌత్ ఇండియన్ భోజనంలో సంబార్, రసం వంటి ద్రవరూపంలో ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ. అందువల్ల అరటి ఆకులో తినడం సులభం. పదార్థాలలో ఉండే నెయ్యి, నూనె కూడా ఆకుకు అంటుకోవు. కనుక ఏం ఇబ్బంది లేకుండా భోంచెయ్యడం సాధ్య పడుతుంది. కానీ, ఆకుకు చిల్లు పడకుండా జాగ్రత్తగా తినాలి.
చక్కని సువాసన
తాజా అరటాకు మీద పలుచని మైనపు పొర సహజంగా ఉంటుంది. వేడివేడి పదార్థాలు వడ్డించినపుడు అది కరుగుతుంది. అలా కరిగినపుడు కమ్మని వాసన వెలువడుతుంది. ఇది ఆహార పదార్థాలకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ను ఇస్తుంది. ముఖ్యంగా వేడి వేడి రసం, అన్నం కలిపి అరటాకులో భోజనం చేసినప్పుడు దీన్ని గుర్తించవచ్చు. అందుకే అరటి ఆకులో భోజనం చెయ్యడం ఒక గొప్ప అనుభూతి అని అంటుంటారు.
శాస్త్రం కూడా చెప్పింది
పూర్వ కాలం నుంచి కూడా చరిత్రలో అరటి ఆకు ప్రాశస్త్యం గురించి రకరకాల సాహిత్యాల్లో వివరించారు. కేవలం సంప్రదాయాలు, పండగల్లో మాత్రమేకాదు, అలంకరణలో, భోజనాల వడ్డింపులో కూడా వాడినట్టు దాఖలాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎలాంటి క్రతువులు, పూజలు నిర్వహించుకున్నా కూడా.. అరటి ఆకులో భోజనం చెయ్యడం గురించి ప్రత్యేకంగా వివరించారు.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
గ్రీన్ టీ లాగే అరటి ఆకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలోని సూక్ష్మజీవులను హరించి వేస్తుంది. అరటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను హరిస్తాయని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అరటి ఆకు మనం తినకపోవచ్చు కానీ తాజా అరటాకులో వేడివేడి పదార్థాలు తినడం వల్ల ఇవి మన శరీరంలో చేరుతాయి.
ఇకో ప్రెండ్లీ
డిస్పోజబుల్ ప్లేట్స్ రూపంలో చాలా వరకు ప్లాస్టిక్ వాడుతారు. ఇవి డీకంపోజ్ కావడానికి సంవత్సరాల కాలం పడుతుంది. పర్యావరణానికి తీరని నష్టం వీటి వల్లే. కానీ, అరటి ఆకులు ప్రకృతి సిద్ధమైనవి. విరివిగా లభిస్తాయి కూడా.
శుభ్రమైనవి
ఇవి వాటర్ ప్రూఫ్ కావడం వల్ల కావడం వల్ల వీటి మీద ఎలాంటి రసాయనాలు చల్లినా అవి ఆకుకు అంటుకోవు. కాబట్టి వీటి వల్ల హాని తక్కువ. వడ్డించే ముందు చాలా సులభంగా వీటిని శుభ్రం చెయ్యవచ్చు. అరటి ఆకులను కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారు. కొన్న రకాల మందులను స్వల్పకాలం పాటు ప్యాక్ చెయ్యడానికి కూడా వినియోగిస్తారు.
Also Read: చలికాలంలో జామ పండు తింటే డాక్టర్‌తో పనే ఉండదు, ఎందుకంటే..