అన్వేషించండి

Black Rice: వారానికోసారైనా బ్లాక్ రైస్‌తో వండిన వంటకాలు తినండి

బ్లాక్ రైస్ ఇప్పుడు విరివిగానే దొరుకుతుంది. దీన్ని తింటే ఎంతో ఆరోగ్యం.

బ్రౌన్ రైస్, వైట్ రైస్ మాత్రమే ఇప్పుడు అధికంగా మనం తింటున్నాం. బ్రౌన్ రైస్ తినే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఆరోగ్యకరమైన బియ్యం రకాల్లో నల్ల బియ్యం కూడా ఒకటి. చూడడానికి నల్లగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడరు. కానీ వీటిని వారానికి ఒక్కసారి అయినా తినాల్సిన అవసరం ఉంది. ఈ బియ్యం లో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు, పోషకాలు అందుతాయి. ఇటలీ, చైనాలలో అధికంగా నలుపు బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. మనదేశంలో మాత్రం వీటి వాడకం తక్కువగా ఉంది. కారణం దీని నలుపు వర్ణమే. రంగును చూసి తినడం మానేస్తే ఎన్నో పోషకాలను నష్టపోతారు.  కాబట్టి కచ్చితంగా బ్లాక్ రైస్‌తో రోజుకు ఒక్కసారైనా భోజనం తినేందుకు ప్రయత్నించండి.

మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కావాలి. కాబట్టి ఈ నల్ల బియ్యాన్ని తెచ్చుకుంటే మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ బియ్యాన్ని తినడం వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. ఈ బియ్యం తినడం వల్ల బరువు కూడా పెరగరు. ఎందుకంటే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ గింజలోపల ఉండే గ్లూకోజ్ ను శరీరం శోషించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరగవు. చాలా మెల్లగా పెరుగుతాయి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది పొట్ట త్వరగా నిండేలా చేస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. తద్వారా బరువును కూడా తగ్గిస్తుంది.

ఆంథోసైనిన్స్ అని పిలిచే యాంటీఆక్సిడెంట్ లో దీనిలో అధిక స్థాయిలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ మెదుడు పనితీరుకు చాలా ముఖ్యం. ఇన్ఫ్లమేషన్ నుంచి ఇది మెదడును కాపాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఇది అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగకుండా చూసుకుంటుంది. కంటి ఆరోగ్యానికి కూడా బ్లాక్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఈ బ్లాక్ రైస్ లో కెరటనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళను కాపాడతాయి. సాధారణ వైట్ రైస్ తో ఎలాంటి వంటకాలు చేసుకోవచ్చు. బ్లాక్ రైస్ తో కూడా అవన్నీ వండుకోవచ్చు. ఇవి చూడడానికి నలుపుగా ఉన్న రుచి మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని తింటారు. 

Also read: తీపి పదార్థాలు తినే వారి కన్నా, కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు

Also read: వయసుకు తగ్గట్టు నిద్రపోవాలి, మీ వయసుకు మీరు ఎంత నిద్రపోవాలో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Appudo Ippudo Eppudo OTT: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
Embed widget