అన్వేషించండి

Spicy Foods: తీపి పదార్థాలు తినే వారి కన్నా, కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు

ఆరోగ్యానికి స్వీట్స్ కన్నా కారమే మంచిదని చెబుతున్నారు అధ్యయనకర్తలు.

కారం తినేవారు ఎక్కువ మంది పేదలే. ధనవంతులంతా కారం తక్కువ తింటారని చెప్పుకుంటారు. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు. ఎవరైతే స్వీట్స్ అధికంగా తింటారో వారి జీవితకాలం తగ్గిపోతుంది. ముఖ్యంగా గొడ్డుకారం తినేవారి జీవితకాలం పెరుగుతున్నట్టు అధ్యయనం చెబుతోంది. సాధారణ ఆహారం తినేవారితో పోలిస్తే స్పైసీ ఫుడ్స్ తినేవారు 14% అధికంగా జీవించే అవకాశం ఉందని చెబుతోంది ఈ అధ్యయనం. అలాగే వారికి క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయని కూడా చెబుతోంది అధ్యయనం.

ఈ అధ్యయనంలో భాగంగా నాలుగు లక్షల 90 వేల మందిపై పరిశోధన చేశారు. వారిలో 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ళ వయసు వరకు ఉన్నవారు పాల్గొన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో 20,000 మంది చనిపోయినట్లు తేలింది. వారిలో స్పైసీ ఫుడ్స్ తింటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. స్వీట్లు తింటున్న వారే అధికంగా మరణించినట్టు తెలిసింది. వారానికి రెండు రోజులపాటు స్పైసీ ఫుడ్స్ తింటే మరణ ప్రమాదం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది. దాదాపు ప్రతిరోజు కారం నిండిన ఆహారం తినేవారితో పోలిస్తే వారానికి ఒకసారి మాత్రమే కారం నిండిన ఆహారాలు తినేవారు 14% ఎక్కువ మరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని అధ్యయనం చెబుతోంది. అయితే ఈ అధ్యయనంలో పురుషులు, స్త్రీలు ఇద్దరూ పాల్గొన్నారు. 

స్పైసీ ఫుడ్స్ లలో మిరపకాయలు, మసాలా దినుసులు ఇతర సుగంధ ద్రవ్యాలు వంటివి ఎక్కువగా కలుపుతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టే శరీరానికి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చి రోగాల బారిన పడకుండా అవి కాపాడుతున్నట్టు అధ్యయనం వివరిస్తోంది. అలా అని మరీ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినాల్సిన అవసరం లేదు. సాధారణ స్పైసీ ఫుడ్స్ ను రోజూ తింటే చాలు. పిల్లలకు మాత్రం స్పైసీ ఫుడ్స్ తినిపించడం మంచిది కాదు. పొట్టలో మంట, వికారం వంటివి మొదలయ్యే అవకాశం ఉంది. మీరు ఏ ఎంతవరకు కారాన్ని తట్టుకోగలరో, దానికి కొంచెం తక్కువగానే తినడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పంచదారతో నిండిన ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టండి. ఆరోగ్యం దానికదే బాగవుతుంది. మన శరీరంలో సగం అవయవాలు పంచదార వల్లే పాడయ్యే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి వచ్చిందంటే శరీరంలోని ప్రధాన అవయవాలన్నింటికీ ముప్పే.  పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు కూడా త్వరగా పెరిగిపోతారు. 

Also read: నీరు తక్కువగా తాగుతున్నారా? అయితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త

Also read: వయసుకు తగ్గట్టు నిద్రపోవాలి, మీ వయసుకు మీరు ఎంత నిద్రపోవాలో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget