అన్వేషించండి

Lemon Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా? నిమ్మతొక్క వల్ల లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

నిమ్మకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దాని తొక్క వల్ల అంతకంటే ఎక్కువ ప్రయోజనాలున్నాయ్.

విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మకాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. పొద్దున్నే నిద్రలేవగానే కాఫీ, టీకి బదులుగా నిమ్మరసం తాగడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు కరిగించుకోవచ్చు. బరువు తగ్గేందుకు నిమ్మరసం సహాయపడుతుంది. నిమ్మకాయ వల్ల మాత్రమే కాదు దాని తొక్కల వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందరూ నిమ్మరసం తీసుకుని వాటి తొక్కలని బయట పడేస్తారు. కానీ దాని వల్ల ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఇంకెప్పుడు అలా చేయరు.

నిమ్మ తొక్కతో మార్మాలాడే

నిమ్మ తొక్కలని ఉపయోగించి ఎంతో టేస్టీ మార్మాలాడే తయారు చేసుకోవచ్చు. ఒక పాన్ తీసుకుని అందులో తాజా నిమ్మ తొక్కలు, కొద్దిగా నిమ్మరసం, నీళ్ళు, చక్కెర వేసి చిక్కగా వచ్చే వరకు వేడి చేసుకోవాలి. అది మెత్తగా అయ్యే దాకా బాగా ఉడికించుకోవాలి. దీన్ని బ్లెండ్ చేసి టోస్ట్ తో కలిపి తీసుకోవచ్చు. దీని రుచిని మరింత పెంచేందుకు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు.

నిమ్మతొక్క నూనె

బాదం నూనె లేదా నువ్వుల నూనెలో నిమ్మతొక్కలు ఉంచాలి. ఇది రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ప్రతిరోజు ఉ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల మచ్చలేని మెరిసే చర్మాన్ని అందించమే కాకుండా విటమిన్ సి కూడ అందుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి.

సలాడ్ డ్రెస్సింగ్ కోసం

తాజా నిమ్మ తొక్కలని తురిమి పార్చ్మెంట్ కాగితంపై ఉంచుకోవాలి. దాన్ని ఎండలో ఆరబెట్టి 2-3 నిమిషాల పాటు వేయించాలి. దీంట్లో ఆలివ్ ఆయిల్, రోజ్మెరీ ఆకులు, బ్లాక్ పెప్పర్ కార్న్స్ వేసి బాగా కలపాలి. కొన్ని నెలల పాటు ఇది నిల్వ ఉంటుంది. సలాడ్ చేసుకున్నప్పుడు డ్రెస్సింగ్ గా దీని వేసుకోవచ్చు. సలాడ్ కి మంచి సువాసన ఇస్తుంది.

నిమ్మ తొక్కతో పేస్ట్ క్లీనర్

గది సువాసన వచ్చేలా చేసి కీటకాలు తరిమికొట్టేందుకు కీటక వికర్షణగా కూడా పని చేస్తుంది. నిమ్మ తొక్కలని మెత్తగా పొడి చేసుకుని నాఫ్తలీన్ బాల్స్, డిటర్జెంట్, వెనిగర్, నిమ్మరసాన్ని కలిపి ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. గదిలో దీన్ని స్ప్రే చెయ్యడం వల్ల మంచి వాసన వస్తుంది అలాగే కీటకాలు పారిపోతాయి.

నిమ్మ తొక్క పొడి

నిమ్మతొక్కలు ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోవచ్చు. సలాడ్, కేక్స్, పులుసు కూరలు, డెజర్ట్, సూప్ లో ఈ పొడి వేసుకోవడం వల్ల తాజాదనం, రుచి వస్తుంది. ఈ పొడి చేసుకోవడానికి నిమ్మ తొక్కలు తురుముకుని ఎండబెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దీన్ని చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలి.

నిమ్మతొక్క వల్ల మరిన్ని ప్రయోజనాలు

నిమ్మతొక్కలో కాల్షియం, విటమిన్ శి, పెక్టిన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. నిమ్మ తొక్కలు నూనె కీళ్ల నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసుకుంటే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Prithviraj Sukumaran: 'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Embed widget