అన్వేషించండి

Tomato Pulao: టేస్టీ టమాటో పులావ్, పిల్లలకు బెస్ట్ ఫుడ్

టమోటాలతో చేసే వంటకాలు మంచిరుచే కాదు, టేస్టు కూడా బావుంటాయి.

టమోటాలతో సింపుల్ గా చేసే వంటకాలలో టమోటా పులావ్ ఒకటి. దీని రుచి అదిరిపోతుంది. పిల్లలకు ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. లంచ్ బాక్సుకు ఇది మంచి రెసిపీ. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ మంచి ఫుడ్ ఇది. వండడం కూడా చాలా సులువు. అరగంటలో ఇది రెడీ అయిపోతుంది.  దీన్ని తింటే ఫుల్ మీల్స్ తిన్నట్టే ఉంటుంది. అది కూడా వేడివేడిగా తింటే ఆ రుచే వేరు

కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
టమోటా ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
నెయ్యి - రెండు స్పూనులు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
నూనె - నాలుగు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
జీడిపప్పులు - ఎనిమిది
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
గరం మసాలా - ఒక స్పూను

తయారీ ఇలా
1. బియ్యం బాగా కడిగి పొడిగా వచ్చేలా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. కాస్త నూనె వేసి వండితే అన్నం పొడిగా వస్తుంది.

2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. 

3. టమాటో ముక్కలు వేసి కలపాలి. మూత పెడితే టమాటోలు బాగా మగ్గుతాయి. 

4. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అన్ని ఉడికాక గరం మసాలా పొడి వేయాలి. 

5. అందులో ఒక స్పూను నెయ్యి కూడా వేస్తే మంచి టేస్టు వేస్తుంది.  

6. అందులో వేయించిన జీడిపప్పులు, కొత్తిమీర తరుగు కూడా వేసి కలపాలి. 

7. ఇప్పుడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. 

8. స్టవ్ కట్టేసి అందులో ఉడికిన అన్నాన్ని వేసి కలపాలి. కలిపేటప్పుడు ముద్దయ్యేలా కాకుండా పొడిపొడిగా కలపాలి. 

9. అంతే టమోటా పులావ్ రెడీ అయినట్టే. 

టమోటా ప్రయోజనాలు...
1. టమోటాలు చర్మం, జుట్టుకు ఎంతో మంచివి. ఇందులో ఉండే లైకోపీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
2. మధుమేహులు టమోటాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే క్రోమియం ఉండడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 
3. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. 
4. ఇందులో ఉండే లైకోపీన్ ప్రొస్టేట్, పొట్ట, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది అడ్డుకుంటుంది. 

Also read: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు

Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
Embed widget