DIY Face Packs : గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయవచ్చు.. మొటిమలు ఉంటే మాత్రం వాటిని వేసుకోండి
Skin Care Routine : గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లను ఇంట్లో ట్రై చేయాలి. ఎలాంటి స్కిన్‌కి ఏ తరహా ఫేస్ ప్యాక్‌లు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Home Made Face Packs : అందరి స్కిన్ ఒకలా ఉండదు. కాబట్టి ఒకరికి సెట్ అయిన ఫేస్ ప్యాక్ మరొకరికి సెట్ కాదు. అందుకే తమ స్కిన్ కాంబినేషన్ తెలుసుకుని.. దానికి తగ్గట్లు ఫేస్ ప్యాక్ వేసుకోవడం, స్కిన్ కేర్ తీసుకోవడం చేసుకోవాలంటున్నారు నిపుణులు. మరి ఏ స్కిన్ వారు ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే మంచి ఫలితాలుంటాయో.. స్కిన్ ఎలా గ్లో అవుతుందో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై స్కిన్ ఉంటే..
నార్మల్, డ్రై స్కిన్ ఉంటే కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లను రెగ్యూలర్‌గా ట్రై చేయవచ్చు. అలాంటివాటిలో తేనె, యోగర్ట్ ఫేస్ట్ ప్యాక్ ఒకటి. ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ యోగర్ట్ తీసుకుని దానిలో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో లేదా.. చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
అవకాడోతో..
అరటిపండు ఒకటి తీసుకోవాలి. దానిలో సగం అవకాడో గుజ్జు వేసి.. తేనె 1 టీస్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ముఖానికి ఈ ప్యాక్ అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచి.. కడిగేయాలి. ఇది ముఖానికి మంచి హైడ్రేషన్ ఇచ్చి గ్లోని అందిస్తుంది.
ఓట్ మీల్‌తో
రెండు టేబుల్ స్పూన్ల ఓట్మీల్లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరో టీస్పూన్ తేనె వేసి కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీనిని స్క్రబ్‌లా ఉపయోగిస్తే ముఖంపై ఉన్న డర్ట్ అంతా క్లియర్ అవుతుంది.
ఆయిల్ స్కిన్ అయితే..
ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముల్తానీ మట్టిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని.. దానిలో నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది ముఖంపై ఉండే ఎక్స్ట్రా నూనెను తీసేయడంతో పాటు.. మంచి మెరుపును అందిస్తుంది.
కీరదోసతో..
కీరదోసను తురిమి.. దానిలో పావు కప్పు పుదీనా ఆకులు వేయాలి. దానిలో టీస్పూన్ పెరుగు వేసి.. ముఖానికి ప్యాక్‌గా అప్లై చేసుకోవాలి. ఇది లోపలి నుంచి స్కిన్‌కి బెనిఫిట్స్ అందిస్తుంది. మంచి గ్లో ముఖానికి అందుతుంది.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్లో అలోవెరా, తేనె వేసి ముఖానికి ప్యాక్‌గా అప్లై చేసుకోవాలి. టీ ట్రీ ఆయిల్ స్కిన్‌కి లోపలి నుంచి పోషణ అందిస్తుంది.
యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్..
వయసు పెరిగే కొద్ది ముఖంలో వయసు తాలుఖా మార్పులు కనిపిస్తాయి. ముడతలు ఎక్కువ అవుతాయి. అందుకే యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్‌ని స్కిన్ కేర్ రోటీన్లో చేర్చుకోవాలి.
పసుపుతో..
పసుపు 1 టీస్పూన్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల పైనాపిల్ జ్యూస్, 1 టీస్పూన్ తేనె వేసి ముఖానికి ప్యాక్ అప్లై చేయాలి. ఇది ముఖంపై మచ్చలు, ముడతలను దూరం చేస్తుంది.
గ్రీన్ టీతో..
గ్రీన్ టీలో 1 టేబుల్ స్పూన్ రోజా పువ్వుల పౌడర్ వేసి.. తేనెను ఒక టీస్పూన్ వేసి కలపాలి. ఈ ప్యాక్‌ను రెగ్యూలర్‌గా ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి.
బొప్పాయితో..
బొప్పాయి గుజ్జులో విటమిన్ ఈ ఆయిల్, యోగర్ట్ వేసి దానిని ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖాన్ని సాఫ్ట్‌గా చేయడంతో పాటు.. మంచి గ్లోని అందిస్తుంది. ముడతలను దూరం చేస్తుంది.
పింపుల్స్ ఉంటే..
ముఖంపై పింపుల్స్ ఉంటే కొన్ని మాస్క్‌లకు దూరంగా ఉండాలి. మరికొన్ని వాటిని మాస్క్‌లలో చేర్చుకోవాలి. లేదంటే పింపుల్స్ సమస్య ఎక్కువ అవుతుంది.
వేపాకులతో..
వేపాకుల పొడిని రెండు టేబుల్ స్పూన్స్ తీసుకుని.. దానిలో అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దానిలో ఒక టీస్పూన్ టీ ట్రీ ఆయిల్ వేసి.. పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనివల్ల యాక్టివ్ పింపుల్స్ తగ్గుతాయి. దాని తాలుఖా మచ్చలు కూడా క్రమంగా తగ్గుతాయి.
దాల్చిన చెక్కతో..
దాల్చిన చెక్క పొడిని 1 టీస్పూన్ తీసుకుని.. దానిలో నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేయాలి. టీస్పూన్ తేనెను కూడా వేసి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్‌గా అప్లై చేయాలి. దీనివల్ల పింపుల్స్ బెడద తగ్గుతుంది.
ఫేస్ ప్యాక్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసేప్పుడు ముఖాన్ని ముందుగా క్లెన్స్ చేసుకోవాలి. ముఖంపై ప్యాక్‌ని అప్లై చేయాలి. కంటికి దూరంగా ప్యాక్స్ అప్లై చేసుకోవాలి. ప్యాక్‌ను పావు గంట నుంచి 20 నిమిషాలు ఉంచుకోవాలి. గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేస్తూ.. ప్యాక్‌ని తీసేయాలి. ప్యాక్ తీసేసిన వెంటనే ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు వీటిని అప్లై చేసుకోవచ్చు.
Also Read : లైగింక జీవితంపై థైరాయిడ్ ప్రభావం.. స్త్రీలలో, మగవారిలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే