News
News
X

Earth Inner Core Slowing Down: వామ్మో, వేగం తగ్గిన భూమి ఇన్నర్ కోర్ - ముప్పు తప్పదా?

భూమి ఇన్నర్ కోర్ వేగం తగ్గింది అంట. భూమి పైన ఉన్న ఔటర్ సర్ఫేస్ (ఉపరితలం) తిరుగుతున్న వేగం కంటే భూమి ఇన్నర్ కోర్ తక్కువ స్పీడ్ తో తిరుగుతోంది పరిశోధకులు వెల్లడించారు. అసలేంటీ ఈ ఇన్నర్ కోర్, ఔటర్ కోర్?

FOLLOW US: 
Share:

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుందనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు మనం భూమి మొత్తం దాని చుట్టూ అది తిరుగుతుందని మనం భావించాం. అయితే, పరిశోధకులు మాత్రం.. భూమిలోని లేయర్స్ కూడా పరిభ్రమిస్తుంటాయని చెబుతున్నారు. అంటే, భూమి లోపలి భాగం పొరలు పొరలుగా ఉంటుందని, మనం జీవిస్తున్న భూమి ఉపరి తలం మాత్రం కొండలు, కోనలు, మైదనాలు, సముద్రాలతో నిండి ఉంటుందని పేర్కొన్నారు. భూమిపైన పైన మనకు కనిపించే భాగాన్ని (లేయర్) ఎర్త్ క్రస్ట్ అని అంటారు. ఈ ఎర్త్ క్రస్ట్ ఎక్కడి వరకూ ఉంటుందంటే.. సముద్రంలోపలికి వెళ్లిపోయి అక్కడ డ్రిల్లింగ్ చేసుకుంటూ ఓ వంద కిలోమీటర్ల వరకూ వెళ్లాం  అనుకోండి. అక్కడ వరకూ ఎర్త్ క్రస్ట్ ఉంటుందని అనుకోవచ్చు. ఈ వంద కిలోమీటర్లలోనే డైమండ్స్, కోల్, రాళ్లు, రప్పలు అన్నీ ఉంటాయి. అంటే ఇందతా గడ్డకట్టిపోయిన పదార్థం అన్నమాట.

ఇంకా ఆ వంద కిలోమీటర్లు దాటి లోపలికి వెళితే వచ్చే లేయర్ ను మాంటెల్ అంటారు. ఈ లేయల్ సుమారు 2900 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. మళ్లీ ఇందులో చాలా సబ్ డివైడ్స్ ఉంటాయి. సాధారణంగా మాంటెల్ అనుకునేది సముద్ర గర్భం నుంచి 2900 కిలోమీటర్ల లోపల ఉండే పొర అన్నమాట. ఇక్కడే సిలికాన్, ఆక్సిజన్ కాంపౌండ్స్ అన్నీ తయారవుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.

ఇంకా మాంటెల్ పొరను కూడా దాటేస్తే ఉండేది ఔటర్ కోర్. ఇది సముద్ర గర్భం నుంచి 5100 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. ఈ ఔటర్ కోర్ అంతా కూడా లిక్విడ్ ఐరన్, నికెల్‌తో నిండి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే 6378 కిలోమీటర్ల వరకూ ఉండేది ఇన్నర్ కోర్. దీని రేడియస్ సుమారు 1220 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మన భూమి ఇన్నర్ కోర్ ప్లూటో గ్రహమంత ఉంటుందన్నమాట. ఇదంతా లిక్విడ్‌లా ఉంటుంది. అది కూడా ఐరన్ లిక్విడ్. ఇక్కడ టెంపరేచర్ ఎంతుంటుందో తెలుసా? సుమారుగా 5200 డిగ్రీలు. పైన 50 డిగ్రీల ఉష్ణోగ్రతమే మనం అల్లాడిపోతాం. అలాంటిది భూమి ఇన్నర్ కోర్‌లో ఉండే టెంపరేచర్‌ను భరించగలమా? కనీసం బూడిద కూడా మిగలదు. ఇన్నర్ కోర్ ఆరంభానికి చేరుకొనేసరికే ఆవిరైపోతాం. 

ఇన్నర్ కోర్, ఔటర్ కోర్‌లు తిరిగే దిశలు వేరట!

మన భూమి ఎలా తిరుగుతుందో ఈ ఇన్నర్ కోర్ కూడా లోపల అలాగే తిరుగుతూ ఉంటుంది. ఇన్నర్ కోర్ పైన ఉన్న ఔటర్ కోర్ మాగ్నటిక్ ఫీల్డ్ వల్ల ఈ ఇన్నర్ కోర్ తిరుగుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఆ ఔటర్ కోర్ మీద మాంటెల్ గ్రావిటీ కారణంగా.. ఆ ఔటర్ కోర్ మాగ్నటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తోందట. సాధారణంగా భూమి ఊపరితలం ఏ దిశలో తిరుగుతుంటే.. అదే దిశలో ఇన్నర్ కోర్ తిరగాలి కదా. కానీ, అలా కాదు.. అది దాని ఇష్ట ప్రకారం తిరుగుతుందట. 

అసలు సమస్య ఇదేనట!

తాజాగా పరిశోధకులు ఓ షాకింగ్ విషయాన్ని కనిపెట్టారు. యాంగ్ యీ, సాంగ్ షియా డాంగ్ అని చైనాలోని పెర్కింగ్ యూనివర్సిటీ చెందిన ఇద్దరు సైంటిస్టులు నేచుర్ జియో సైన్స్ అనే జర్నల్ కి ఓ ఆర్టికల్ రాశారు. ఈ ఇన్నర్ కోర్ పైన తిరుగుతున్న భూమి కంటే స్లోగా తిరుగుతుంది అని. 2009 నుంచి ఇలా స్లోగా తిరుగుతోందని పేర్కొన్నారు. అప్పటి నుంచి వస్తున్న భూకంపాల కారణంగా గ్రాఫ్స్ గీస్తే ఇది స్పష్టమైందని తెలిపారు. అది తిరగటం మానేస్తే పైన భూమి కూడా తిరగటం మానేస్తుందా అనే కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. 

ఏం జరుగుతుంది? ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి?

ఇలా ఇన్నర్ కోర్ స్లో డౌన్ అవ్వటం... పైన భూమి తిరుగుతున్న దానికి వ్యతిరేక దిశలో జరగటం అనేది ఓ సైకిల్‌లా ప్రతీ 70 ఏళ్లకు ఓ సారి జరుగుతోంది అట. 1970కు ముందు ఈ ఇన్నర్ కోర్ అనేది భూమి వేగం కంటే ఎక్కువగా ఉండేదని, ఆ తర్వాత తగ్గిందని అంచనా వేస్తున్నారు. మళ్లీ 2040 తర్వాత అంటే 70 ఏళ్ల తర్వాత ఈ ఇన్నర్ కోర్ వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ వేగం పెరిగి తగ్గే టైంలో ప్రతీ 70 ఏళ్లకు ఓసారి ఇన్నర్ కోర్ కాసేపు ఆగిపోతుంది కూడా. దీనివల్ల ప్రజల ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. కానీ, మన టైంలో తేడాలు వస్తాయి. కొన్ని మిల్లీ సెకండ్లు తగ్గిపోతాయి. పగటి పూటలు తగ్గిపోతాయి. అయితే, ఇలా కోర్ ప్రతీ 70 ఏళ్లకు ఎందుకు వేగం పెంచుకుని తగ్గించుకుంటుందనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ రహస్యం సైంటిస్టులకు కూడా అంతు చిక్కడం లేదు. 

Also Read: యువతలో మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!

Published at : 27 Jan 2023 07:13 PM (IST) Tags: Earth inner core Inner Core Earth Inner Core Rotation

సంబంధిత కథనాలు

Cholesterol: ఈ మూడు పానీయాలు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించేస్తాయ్

Cholesterol: ఈ మూడు పానీయాలు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించేస్తాయ్

Hungry: అతిగా ఆకలి వేస్తుందా? అందుకు ఈ ఐదు సమస్యలే కారణం

Hungry: అతిగా ఆకలి వేస్తుందా? అందుకు ఈ ఐదు సమస్యలే కారణం

Mango: మామిడిపండుతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీలు - వీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు

Mango: మామిడిపండుతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీలు - వీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు

Salt: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో

Salt: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో

Milk: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?

Milk: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!