Dry Winter : ఆరోగ్యానికి పెనుప్రమాదంగా మారుతోన్న పొడి వాతావరణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Winter Dryness : చలికాలం ప్రారంభమైంది. అప్పటి నుంచి పొడి వాతావరణం.. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కాలుష్యం, తేమ తగ్గడం వల్ల ప్రజలు ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేద్దాం.

Dry Winter Triggers : చలికాలం ప్రారంభమై.. పొడి వాతావరణం పెరిగిపోయింది. దీంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. చలితో కూడిన పొడి గాలి ఇబ్బందికరంగా మారింది. గాలిలో దుమ్ము, ధూళి, ఇతర కాలుష్య కారకాలు ఎక్కవయ్యాయి. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కాలుష్యం పెరగడం, తేమ తగ్గడం వంటివి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఈ సమయంలో ఏయే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.
దగ్గు, జలుబుతో పాటు వైరల్ జ్వరాలు
వాతావరణ శాఖ ప్రకారం.. వాతావరణంలో తేమ శాతం దాదాపు 29 శాతం ఉంటుంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలలో పెద్ద వ్యత్యాసం, తేమ తగ్గడం వల్ల గాలి మరింత పొడిగా మారుతోంది. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు, వైరల్ జ్వరాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఈ చలికాలంలో పొడి వాతావరణంలో ఆస్తమా, అలర్జీలు, సైనస్, కంటి పొడిబారడం, చర్మ సంబంధిత సమస్యల కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. వైరల్ జ్వరం, గొంతు నొప్పి కారణంగా ఇప్పటికే చాలామంది ప్రభావితమయ్యారని.. మరింత మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే వైద్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్క్ ధరించాలని.. చల్లటి నీరు తాగకుండా గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులను ఉదయం చలిలో తిరగకూడదని చెప్తున్నారు. ఆస్తమా, అలర్జీ ఉన్న రోగులు తమ మందులను దగ్గర ఉంచుకోవాలని.. ఇంట్లో తేమను కంట్రోల్ చేయడానికి స్టీమర్ లేదా హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.
పొడి కాలుష్యం
వర్షాలు లేకపోవడం వల్ల గాలిలో దుమ్ము, పొగ, కాలుష్య కారకాలు నిరంతరం పెరుగుతున్నాయి. సాధారణంగా వర్షం ఈ కణాలను నేలమీదకు చేరవేస్తుంది. కాని పొడి వాతావరణం వల్ల కాలుష్యం మరింత తీవ్రమైంది. ఇది ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు, గుండె, ఊపిరితిత్తుల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రభావం వల్లనే ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జ్వరం, గొంతు సమస్యలతో బాధపడుతున్న రోగులు పెరుగుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం.. గత 10-15 రోజుల్లో దగ్గు, జలుబు కేసుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. చెడు గాలి నాణ్యత కారణంగా ఈ రోగులు మరింత వేగంగా ప్రభావితమవుతున్నారని వైద్యులు అంటున్నారు. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని దీనివల్ల పొడి చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వైద్యులు దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.






















