Oral Health: నీళ్లు తాగకపోతే పళ్లు పుచ్చిపోతాయా? దంతాలకు కలిగే నష్టాలేమిటీ?
దంత సంరక్షణ చాలా ముఖ్యం. చాక్లెట్లు, తీపి పదార్థాలు అతిగా తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయని అంటుంటారు. అవి మాత్రమే కాదు నీరు సరిగా తాగకపోయినా కూడా దంతక్షయం ఏర్పడుతుంది.
తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ గా ఉంటుంది. మానవ శరీర బరువులో 60 శాతం వరకు ఉంటుంది. ఇది నిర్జలీకరణం నుంచి కాపాడటమే కాదు నోటి పరిశుభ్రతకు చాలా అవసరం అనే విషయం చాలా కొద్ది మందికి తెలుసు. లాలాజలం నోటిలో ఉండే నీటి రూపం. ఇది ఏర్పడటం కోసం 99 శాతం నీరు అవసరం. లాలాజలం జీర్ణక్రియ ప్రక్రియని ప్రారంభించే అమైలేస్ వంటి ఎంజైమ్ లని కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ లి ఆహారంలోని కార్బోహైడ్రేట్ లని విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. ఆహారం కడుపులోకి చేరే ముందు విచ్చిన్న ప్రక్రియ ప్రారంభవమవుతుంది. లాలాజలంలో యాంటీ మైక్రోబయల లక్షణాలు కలిగి ఉండే ఇమ్యునోగ్లోబులిన్లు, లైసోజైమ్, లాక్టోఫెర్రిన్ వంటి పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సహాయపడతాయి. నోటి ఆరోగ్యానికి దోహదపడతాయి. నోటిలో వచ్చే పుండ్లు నయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
నోటి ఆరోగ్యానికి నీరు అవసరమా?
నోటి పరిశుభ్రత కోసం తగినన్ని నీటిని తీసుకోవాలని దంతవైద్యులు సిఫార్సు చేస్తారు. నోటిని తేమగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. లాలాజల ఉత్పత్తికి సహకరిస్తుంది. అలాగే నోటి కుహరాన్ని శుభ్రపరుస్తుంది. లాలాజలం దంతాల పునరుద్ధరణలో సహాయపడుతుంది. బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే ఆమ్లాలని తటస్థీకరిస్తుంది.
హైడ్రేషన్
డీహైడ్రేషన్ నోటి కణజాలం పొడిబారిపోయేలా చేస్తుంది. దాని వల్ల దుర్వాసన, దంత క్షయం, చిగుళ్ళ వ్యాధి వంటి నోటి ఆరోగ్య సమస్యల్ని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే హైడ్రేట్ గా ఉండాలి. అప్పుడే ఈ సమస్యలేవీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
యాసిడ్ న్యూట్రలైజేషన్
నోటిలోని యాసిడ్ స్థాయిలని తగ్గించడంలో నీరు సహాయపడుతుంది. ఆమ్ల వాతావరణం దంతాల మీద ఉండే ఎనమిల్‌ను క్షీణింపజేస్తుంది. దంతాలు సున్నితత్వం మారిపోతాయి. పుచ్చు పట్టే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా నీరు తీసుకోవడం వల్ల నోటిలో pH స్థాయిని కాపాడుకోవచ్చు. దంతాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
క్లెన్సింగ్ ఎఫెక్ట్
నీరు తాగడం వల్ల నోట్లో పేరుకుపోయిన ఆహార కణాలు, బ్యాక్టీరియా ఫలకాలు ఫ్లష్ చేయబడతాయి. అవి పోవడం వల్ల దంత క్షయం, చిగుళ్ళ వ్యాధి, నోటి దుర్వాసన ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు తాగకపోతే దంతాలు, చిగుళ్ళ మీద బ్యాక్టీరియా పేరుకుపోతుంది.
నోరు పొడిబారడం తగ్గుతుంది
జిరోస్టోమియా అనేది లాలాజలం ఉత్పత్తి తగ్గడం వల్ల ఏర్పడే పరిస్థితి. నిర్జలీకరణం, కొన్ని మందులు, వైద్య పరిస్థితులు వంటి కారణాల వల్ల సంభవిస్తుంది. దంత క్షయం, చిగుళ్ళ వ్యాధితో సహ దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నీరు తాగితే నోరు పొడబారిపోకుండా ఉంటుంది. నోటిని తేమగా ఉంచుతుంది.
టూత్ ఏనామిల్
ఇతర పానీయాల మాదిరిగా కాకుండా నీటిలో చక్కెర, ఆమ్లాలు ఉండవు. ఇలాంటివి ఉన్న వాటిని ఎంచుకోవడం వల్ల దంతాల ఏనామిల్ నాశనం అవుతుంది. అందుకే దంతాలు పరిరక్షించుకునేందుకు నీటిని తాగడం ఎంచుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రుచికరమైన పనస పండు కొనాలని అనుకుంటే ఇలా టెస్ట్ చేయండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial