Jackfruit: రుచికరమైన పనస పండు కొనాలని అనుకుంటే ఇలా టెస్ట్ చేయండి
పండు ఆకారాన్ని బట్టి దాని రుచి ఎలా ఉంటుందో కొంతమంది పసిగట్టేస్తారు. పనస పండు రుచికరమైనది కొనుక్కోవాలంటే దాని రుచి చూడకుండానే ఈ టెక్నిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

మార్కెట్ నుంచి పండ్లు కొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చాలా మంది మగవారికి పెళ్ళాల చేతిలో తిట్లు పడుతూ ఉంటాయి. అందుకు కారణం వాళ్ళు సరైన పండ్లు ఎంచుకొకపోవడమే. అవి పుచ్చులు ఉండటమో లేదంటే అతిగా పండటం, అసలు పండకపోవడం వంటి కారణాల వల్ల తిట్లు తింటూ ఉంటారు. అందుకే పండ్లు కొనే ముందు వాటి రుచి ఎలా ఉంటుందో పసి గట్టాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించి చూడండి. ఈ సీజన్ లో జాక్ ఫ్రూట్ అదేనండీ పనస పండు విపరీతంగా దొరుకుతుంది. కొంతమందికి ఆ వాసన గిట్టకపోయినా కూడా రుచి కోసం తెగ లాగించేస్తారు. పనస పండు కొనే ముందు అది బాగుందో లేదో చెక్ చేయాలంటే పండు కట్ చేయాలి. ఒక వేళ బాగోలేదంటే కోసిన పండు వృధా అవుతుందని షాపు వాడు అంటగట్టేస్తాడు. అందుకే పండు కోయకుండానే దాని రుచి ఎలా ఉంటుందో ఈ టిప్స్ ఫాలో అయి ఒక అంచనాకి రావచ్చు.
పరిమాణం ముఖ్యం
పనస పండు ఎప్పుడు 1.5 కేజీ ఉండేది ఎంచుకోవాలి. రకాన్ని బట్టి పరిమాణం మారుతూ ఉంటుంది. పెద్ద పండ్లు పరిణితి చెంది రుచి కలిగి ఉంటుంది. దాని ఆకృతి సరిగా లేకుండా మందంగా ఉంటే మాత్రం రుచి బాగోదని గుర్తు పెట్టుకోండి.
తొక్క చూడాలి
పనస పండు తొక్క ఆకుపచ్చ లేదా పసుపు ఆకుపచ్చ రంగు కలిగి ఉండాలి. అలా కాకుండా నిస్తేజంగా గోధుమ రంగు పాచెస్ ఉన్న పనస పండు మాత్రం కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే ఇవి బాగా పండిపోయి నాణ్యత తక్కువగా ఉండవచ్చు.
ఆకృతి తనిఖీ చేయాలి
మీ వేలికొనలతో జాక్ ఫ్రూట్ చర్మాన్ని సున్నితంగా నొక్కండి. అది గట్టిగా అనిపించాలి. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. మెత్తగా ఉంటే మాత్రం వాటిని పక్కన పెట్టేయడమే మంచిది. ఇవి బాగా పండిపోయి లేదంటే చెడిపోయినవి కావచ్చు.
వాసన
పనసపండు తాజా, తీపి సువాసన కలిగి ఉంటుంది. పండిన జాక్ ఫ్రూట్ తేలికపాటి తీపి వాసన కలిగి ఉంటుంది. బలమైన అసహ్యకరమైన లేదా పులిసిన వాసన వస్తే మాత్రం అది ఎక్కువగా పండిపోయినట్లు లేదంటే చెడిపోయినట్టు అర్థం చేసుకోవాలి.
బరువు ముఖ్యమే
పనస పండు ఎత్తుకుని దాని బరువు చెక్ చేసుకోవాలి. నాణ్యమైన జాక్ ఫ్రూట్ దాని పరిమాణానికి తగిన విధంగా బరువు ఉంటుంది. అది జ్యూసీగా బాగా గుజ్జుతో ఉన్నట్టు అర్థం
సౌండ్ చెక్
పిడికిలితో జాక్ ఫ్రూట్ సున్నితంగా నొక్కాలి. ఇది ఖాళీ ధ్వనిని ఉత్పత్తి చేస్తే అది పక్వానికి వచ్చి తినేందుకు సిద్ధంగా ఉందని సూచన. అదే తోలు మందంగా ఉంది సౌండ్ వేరుగా ఉంటే మాత్రం పండు పండలేదని తెలుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మనుషులకు బర్డ్ ఫ్లూ సోకవచ్చని ఐరాస హెచ్చరికలు- వ్యాప్తిని ఎలా నిరోధించాలి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

