By: ABP Desam | Updated at : 13 Feb 2023 07:24 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
యాలకులు మంచి సువాసన, రుచి కలిగి ఉండటమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే దీన్ని 'క్వీన్ ఆఫ్ స్పైసెస్' అని కూడా పిలుస్తారు. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు ధృడంగా మారేందుకు అవసరమైన కాల్షియం అందిస్తాయి. మరి ఇవి రెండు కలిపి తీసుకుంటే ఎటువంటి రోగం మీ దరిచేరదు. అనేక మంది రోజు నిద్రపోయే ముందు పాలు తాగి పడుకుంటారు. ఇది నిద్రని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. వాటిలో యాలకులు కూడా చేరిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపోవచ్చు.
యాలకులను ఇలాచి అని కూడా పిలుస్తారు. భారతీయ వంటలు, డెజర్ట్ లు తయారు చేయడంలో విస్తృతంగా వీటిని ఉపయోగిస్తారు. యాలకులు శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు. మంచి నిద్రని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు వీటిని తీసుకోవడం వల్ల కామ కోరికలను పెంచుతుంది. జీవక్రియ రేటుని మెరుగుపరుస్తుంది. అంతే కాదు రక్తపోటుని అదుపులో ఉంచే అద్భుతమైన గుణాలు ఇందులో ఉన్నాయి. అందుకే నిద్రపోయే ముందు ఇది తాగితే చక్కగా నిద్రపోతారు.
యాలకుల పాలు తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో 2 యాలకులు వేసి మరిగించుకోవాలి. వీటిని వడకట్టుకుని తాగడమే. అవసరమైతే కొద్దిగా తేనె వేసుకుని కూడా తాగొచ్చు.
యాలకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాల్షియం ఉండటం వల్ల ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తుంది. కీళ్ల నొప్పులు దరిచేరకుండా అడ్డుకుంటుంది. ఇందులోని విటమిన్ సి సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుంది. గొంతు నొప్పిగా అనిపించినప్పుడు కాస్త యాలకులు వేసి టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని సువాసన వల్ల మంచి మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ సేపు నోరు మూసుకుని ఉండటం వల్ల దుర్వాసన వస్తుంది. అటువంటి సమయంలో ఒక యాలకుల నోట్లో వేసుకుని నమలడం వల్ల చెడు వాసన తొలగిపోతుంది.
జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడతాయి. ఆకలి తక్కువగా ఉన్న వాళ్ళు యాలకులు తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో వెచ్చగా ఉండేందుకు శరీర ఉష్ణోగ్రత పెంచుకునేందుకు యాలకులు చక్కగా ఉపయోగపడతాయి. ఉదర సంబంధిత సమస్యలకి ఇది చక్కని పరిష్కారం. ఉబ్బరం, కడుపు మంట వాటిని త్వరగా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిక్ రోగులు వీటిని నిత్యం తీసుకుంటూ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పాలిచ్చే తల్లులు తినాల్సిన పోషకాల లడ్డూ- ఇది ఎలా తయారుచేయాలంటే
Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే
గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం
Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది
World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?
Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా