News
News
X

Thunderstorm: ఉరుములు, మెరుపుల టైంలో స్నానం చేయకూడదట, ఎందుకో తెలుసా?

మెరిసేటప్పుడు బయట ఉండకూడదు అని ఎందుకు చెప్తారో తెలుసా. అలా ఉంటే ఎంత ప్రమాదకరమో తెలియాలంటే ఇది తెలియాల్సిందే.

FOLLOW US: 

వర్షం పడేటప్పుడు లేదా పడటానికి ముందు ఒక్కోసారి భయంకరంగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి పిడుగులు కూడా పడతాయి. ఉరిమేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు అంటారు. ఎందుకంటే పిడుగులు ఎక్కువగా చెట్ల మీద పడతాయి. వాటి వల్ల మరణం సంభవిస్తుందని చెప్తారు. ఎక్కువగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఎక్కువగా ఉరుములు, మెరుపులు, టోర్నడోలు వస్తాయి. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా చెక్కతో చేసే ఇళ్ళనే నిర్మించుకుంటారు. టోర్నడోల కారణంగా వచ్చి భీకరమైన గాలికి ఎంతటి బలమైన వస్తువులైనా కొట్టుకుపోతాయి. ఉరుముల వల్ల వచ్చే మరణాలు కూడా ఫ్లోరిడా, టెక్సాస్ లోనే ఎక్కువగా ఉంటాయి. ఏడాదికి 180 మంది వ్యక్తులు పిడుగుపాటుకి గురవుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. ప్రతి సంవత్సరం పిడుగుపాటుకు గురైన వారిలో 10 శాతం మంది మరణిస్తున్నారు.

ఫ్లోరిడాలోనే ఎక్కువ ఉరుముల వర్షం ఎందుకు పడుతుందో తెలుసా?

యూఎస్ నేషనల్ వేదర్ సర్వీసెస్ ప్రకారం గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అట్లాంటిక్ మహాసముద్ర నుంచి వెచ్చని, తేమతో కూడిన గాలులు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షాన్ని పడేలా చేస్తాయి. అందుకే ఉరిమే సమయంలో నీటికి పూర్తిగా దూరంగా ఉండాలని చెప్తారు. స్నానం చేయడం, పాత్రలు కడకటం, చేతులు నీటితో శుభ్రం చేసుకోవడం చేయకూడదని చెబుతారు. 

ఉరుములు, మెరుపుల టైంలో ఇవి చెయ్యకూడదు

ప్లంబింగ్ ద్వారా మెరుపులు ప్రయాణిస్తాయి. ఇవి ప్లాస్టిక్ వస్తువుల మీద తక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, ఇంటి బాల్కనీ, కిటికీ, తలుపుల దగ్గర కూడా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మెరుపుల వల్ల వచ్చే కాంతి కంట్లో పడటం వల్ల కంటి చూపు పోతుందని కూడా చెప్తారు. మెటల్ మీద మెరుపులు, ఉరుముల ప్రభావం ఎక్కువగా పడుతుంది. అందుకే అటువంటి సమయంలో కాంక్రీటు గోడలకు అనుకుని ఉండొద్దని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాలు దూరంగా ఉంచాలి

ఇదే కాదు కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉండాలి. అవి మెరుపులని ఆకర్షించే శక్తి వాటికి ఎక్కువగా ఉంటుంది. ఫోన్ మాట్లాడటం, ఛార్జింగ్ పట్టుకోవడం కూడ చెయ్యకూడదు. మెరుపు విద్యుత్ కనెక్షన్స్, రేడియో, టెలివిజన్ సిస్టమ్‌, కాంక్రీట్ గోడలు లేదా ఫ్లోరింగ్‌లోని ఏదైనా మెటల్ వైర్లు లేదా బార్‌ల ద్వారా ప్రయాణించవచ్చు.

News Reels

ఉరుముల నుంచి రక్షణగా

గృహోపకరణాలను రక్షించడానికి  ఇంటిని మొత్తం హౌస్ సర్జ్ ప్రొటెక్టర్‌లు అమర్చుకోవచ్చు. టీవీ, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి స్టెబిలైజర్ ని ఫిట్ చేసుకోవచ్చు. మెరుపుల నుంచి ఇంటిని రక్షించుకోవడం కోసం ఎర్త్ వైర్ రాడ్‌ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అది మెరుపు ఇంట్లోని వస్తువులని చేరకుండా చేస్తుంది.

సెల్ఫీలు వద్దే వద్దు

చాలా మంది మెరుపులు వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవాలని ఉబలాటపడతారు. కానీ అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కాంక్రీటుతో తయారు చేసిన కిటికీలు, తలుపుల దగ్గర ఉండకూడదు. ముళ్ల కంచెలు, విద్యుత్ లైన్లు, గాలిమరలు, టెలిఫోన్ స్తంభాలు, చెట్లు వంటివి వాటిని  ఎత్తైన వస్తువును మెరుపులు త్వరగా తాకుతాయి. ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తే మెరుపుల ప్రమాదం నుంచి మీరు సురక్షితంగా బయటపడొచ్చు.   

Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే

Also Read: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!

Published at : 05 Oct 2022 04:06 PM (IST) Tags: Florida Rain Lightning Thunderstorm DON’T shower Avoid water

సంబంధిత కథనాలు

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

PVP ED Office : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

PVP ED Office  : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !