అన్వేషించండి

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

ఇప్పుడు కచ్చితంగా మనం బ్రేక్ ఫాస్ట్ తింటున్నాం. కానీ ఒకప్పుడు ఆ భావనే (కాన్సెప్ట్) లేదు.

కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినాలి, ప్రతిరోజూ అల్పాహారం స్కిప్ చేయడం వల్ల సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇప్పుడు రోజులో ముఖ్యమైన భోజనంగా మారిపోయింది బ్రేక్ ఫాస్ట్. కానీ ఒకప్పుడు మనదేశంలో అల్పాహారం అనే కాన్సెప్ట్ లేదు.ఇది పాశ్చాత్య దేశాల నుంచి మనకు వచ్చింది.  

ఒకప్పుడు భారతదేశంలో ఉదయం భోజనం చేయడం ఉండేది కాదు. నేరుగా మధ్యాహ్నం భోజనాన్నే తినవారు. అది కూడా ఇప్పటిలా ఒంటిగంట, రెండు గంటల సమయంలో కాకుండా పదకొండు గంటలకే తినేసే వారు. అదే అల్పాహారం, అదే మధ్యాహ్న భోజనం. అంటే అప్పట్లో రోజుకు మూడు పూటలు కాదు, రెండు పూటలే తినేవారు. అప్పట్లో జనాభాలో ప్రధానంగా రైతులే ఉండేవారు. ఉదయం పూట పొలం పనికి వెళ్లిన రైతులు,  కాసేపు పనిచేసుకున్నాక నేరుగా మధ్యాహ్న భోజనాన్ని తినేవారు. ఇదే వారికి సులువుగా ఉండేది. తలమీద పెట్టుకున్న గంపల్లో అన్నం మూటలు, కూరలు కట్టుకుని వెళ్లేవారు. 

ఎప్పుడు మొదలైంది?
ఎప్పుడైతే మన దేశానికి  విదేశీయుల రాకపోకలు పెరిగాయో, ఇక్కడ వేష భాషల్లో, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం మొదలయ్యాయి. కేవలం పొలాల్లో పనిచేసుకునే వారే కాదు, ఇతర ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చాయి. 17వ శతాబ్ధంలో కాఫీ, టీ, చాక్లెట్లు అధికంగా వినయోగించడం విదేశాల్లో మొదలైంది. ఈస్టిండియా కంపెనీ వారు భారతదేశాన్ని పాలించేటప్పుడు వారికి తగ్గట్టు ఆహారపు అలవాట్లను మార్చారు. తమకు అల్పాహారం వండి పెట్టాలని భారత వంటగాళ్లను ఆదేశించేవారు. అలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినాలన్న భావన భారతీయుల్లో మొదలైంది. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు, ముసలి వారికి ఉదయం అల్పాహారం తినడం వల్ల రోజంతా శక్తిమంతంగా అనిపించేది. దీంతో అందరూ తినడం మొదలుపెట్టారు. 19వ శతాబ్ధం నుంచే అల్పాహారం తినడం భారతీయులు మొదలుపెట్టారని అంటారు చరిత్రకారులు.

ఏం తినాలి?
ఉదయం పూట బ్రిటిష్ వారు బ్రెడ్‌, టీ,కాఫీ ఇలా లైట్‌గా తినేవారు. భారతీయులకు అప్పట్లో బ్రెడ్ రుచి అంతగా ఆకట్టుకోలేదు. చివరికి సొంతంగా అల్పాహారాలను   సృష్టించడం ప్రారంభించారు. ఉత్తరాదిలో  పోహా, పరాతా, పూరీ సబ్జీ, చోలే భాతురే, ధోక్లా, చీలా ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇక దక్షిణాదిలో అల్పాహారం అనగానే కనిపించేవి ఇడ్లీ, దోశె, వడ, ఉప్మా. వీటిని ఉదయానే తినడం రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. అందుకే 

కార్న్‌ఫ్లేక్స్, వోట్స్ 
విదేశాల నుంచి ఇప్పటికే ఎన్న రకాల బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు భారతదేశానికి ప్రయాణిస్తున్నాయి. కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ వంటివి ముఖ్యంగా ఆ జాబితాలో ఉన్నాయి. వీటిని పెద్దగా కష్టపడి వండక్కర్లేదు. చాలా సులువుగా అయిపోవడం, బరువు పెరగకపోవడం వంటి కారణాల ఇవి ప్రజాదరణ పొందాయి. 
 Also read: టమోటోల్లా కనిపిస్తున్న ఈ పండ్లను పోల్చారా? మనకు బాగా తెలిసినవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget