By: Haritha | Updated at : 06 Dec 2022 07:58 AM (IST)
రామాఫలాలు
చూడటానికి టమోటోల్లా కనిపిస్తున్నాయి కదా..కానీ టమోటోలకు వీటికి అసలు సంబంధమే లేదు. ఇవి తీయటి పండ్లు. మీకు సీతా ఫలాలు తెలుసు కదా, అలాగే వాటి జోడీ రామాఫలాల గురించి కూడా వినే ఉంటారు. మనదేశంలో ఇవి విరివిగా పండుతాయి. టమోటోల్లా కనిపిస్తున్నవి రామా ఫలాలే. ప్రతి పండులోనే అనేక రకాలు ఉన్నట్టు. రామాఫలంలో ఇదో రకం. మన దగ్గర పండే పండ్లు కాస్త సీతాఫలాన్ని పోలి ఉంటాయి. వాటిలో మరో రకం ఈ టమోటోల్లా కనిపించే రామాఫలాలు. వీటినే బుల్లక్ హార్ట్ అని కూడా పిలుస్తారు. అన్నోన్నా కుటంబానికి చెందిన పండు ఇది. సీతాఫలం కూడా అదే కుటుంనికి చెందుతుంది.
ఈ పండ్లు చాలా తీపిగా ఉంటాయి. చూడటానికి టమోటోల్లా ఉన్నా వాటికి, వీటికీ ఏం సంబంధమూ లేదు. టమోటా పొట్ట నిండా విత్తనాలే ఉంటాయి. కానీ రామాఫలంలో కేవలం మూడు నుంచి నాలుగు విత్తనాలు మాత్రమే ఉంటాయి. రామాఫలం ఎక్కడ పడితే అక్కడ పండదు. మనదేశంలోని ఉష్ణమండల ప్రాంతాల్లోనే పండుతుంది. అసోం, పశ్చిమబెంగాల్, గుజరాత్, తమిళనాడు, కేరళలో అధికంగా ఈ పండ్లు పండుతాయి.
నిండుగా విటమిన్ సి
శరీరానికి రోగనిరోధక శక్తి అత్యవసరం. రోగనిరోధక శక్తికి విటమిన్ కావాలి. రామాఫలం విటమిన్ సి నిండి ఉంటుంది. రోజుకో పండు తింటే చాలు శరీరానికి కావాల్సిన రోజువారీ విటమిన్ సిలో సగం ఇదే అందిస్తుంది. విటమిన్ సి ఇచ్చే పండ్లన్ని పుల్లగా ఉంటాయి. కానీ రామాఫలం తీయగా ఉండి, విటమిన్ సి అందిస్తుంది. ఈ పండు తింటే చర్మం, జుట్టు మెరుపును సంతరించుకుంటాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు...
మధుమేహులకు పండ్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే చక్కెర అధికంగా ఉండే పండ్లను దూరం పెట్టాలి. అందుకే అరటి పండు, మామిడి పండును అధికంగా తినవద్దని చెబుతారు. సహజంగా ఉండే చక్కెర కూడా రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. కానీ రామాఫలం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు, అదుపులో ఉంటాయి. అధికంగా ఉన్నప్పుడు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా రామాఫలాన్ని వారు ఆస్వాదించవచ్చు.
రక్తహీనతకు..
రక్తహీనతతో బాధపడుతున్నవారికి రామాఫలం ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు శరీరంలో ఇనుము స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అలాగే ఈ పండులో పుష్కలంగా ఉండే B6 గుండె సంబంధిత వ్యాధులను నివారించడంతో పాటూ, మూత్రపిండాల్లో రాళ్లను కూడా ఏర్పడకుండా అడ్డుకుంటుంది.
Also read: అరటిపండు - పాలు కాంబినేషన్ తినొద్దని చెబుతున్న ఆయుర్వేదం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Deodorant Death: డియోడరెంట్ వాసనకు ఆగిన బాలిక గుండె - ఆ స్మెల్ అంత ప్రమాదకరమా?
Earth Inner Core Slowing Down: వామ్మో, వేగం తగ్గిన భూమి ఇన్నర్ కోర్ - ముప్పు తప్పదా?
Avocado: రోజుకో అవకాడో తింటే బరువు తగ్గుతారా? గుండె జబ్బులు దరిచేరవా?
Bruxism: నిద్రలో పళ్ళు గట్టిగా కొరికేస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలు తప్పవు!
Diabetes: యువతలో మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !