(Source: ECI/ABP News/ABP Majha)
Fruits: ఈ పండ్ల పేరు ఏమిటో తెలుసా? ప్రధానమంత్రి మోడీకి ఎంతో ఇష్టమైనవి
కొన్ని రకాల పండ్లు అందరికీ లభించవు. కొన్ని ప్రాంతాల్లోనే పండుతాయి.
ప్రధానమంత్రి మోడీ ఎంతో ఇష్టపడే పండ్లలో ఇక్కడ కనిపిస్తున్న పండ్లు కూడా ఒకటి. బెర్రీ పండ్లలా కనిపించే ఇవి కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఈ అడవి పండ్లను బేబెర్రీలు అని పిలుస్తారు. అలాగే కఫల్ అని కూడా అంటారు. ఇవి పర్వతాలపై మాత్రమే పండుతాయి. అది కూడా సీజనల్‌గా మాత్రమే దొరుకుతాయి. ఈ పండ్లను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి భారత ప్రధాని నరేంద్ర మోడీకి బుట్టలో నింపి బహుమతిగా అందజేశారు. ఈ పండ్లు ప్రధాన మోడీకి ఎంతో ఇష్టమైనవి. బుట్టను అందుకున్నాక మోడీ ఈ పండ్ల తన లేఖలో రాశారు. ఉత్తరాఖండ్ సంస్కృతిలో 'కఫల్' పాతుకుపోయిందని, ఆ ప్రాంతంలోని జానపద పాటల్లో కూడా దీని ప్రస్తావన ఉందని లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటి ధర కిలో 300 రూపాయల వరకు ఉంటుంది. పర్యాటకులు ఎంతోమంది ఈ పండ్లను తినేందుకు ఇష్టపడతారు.
కొండల్లో ఉన్నవారి ఆదాయపనరుగా మారాయి కఫల్ పండ్లు. వాటిని అమ్ముకునే అక్కడ ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. వర్షాలు పడే సమయంలోనే కఫల్ పండ్లు అధికంగా పండుతాయి. ఆ వర్షాలు ఈ పండ్ల రుచిని మరింత తీపిగా మారుస్తాయని చెబుతారు. అయితే ఉత్పత్తి మాత్రం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను చాలామంది కొండ ఉప్పు, కాస్త ఆవాల నూనె వాటికి జోడించి విక్రయిస్తారు. వీటి డిమాండ్ అధికంగా ఉండడంతో అక్కడి ప్రజలు ఈ పండ్ల వల్ల లాభాలు పొందుతున్నారు.
ఈ పండ్లు కాసే చెట్లు సముద్రానికి 6000 అడుగుల ఎత్తులో కొండపైన ఉన్న ప్రాంతంలో పెరుగుతాయి. ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్న అనేక రకాల అడవుల్లో ఇవి దొరుకుతాయి. రుచి బాగుండడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తిన్న వెంటనే మంచి శక్తిని అందిస్తాయి. ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఏవైనా జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఈ పండ్లను ఎంత తిన్నా బరువు పెరగరు. అందుకే బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి ఈ పండ్లు ఉత్తమ ఎంపిక. ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలకు వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ పండ్లను రుచిచూసే రావాలి. ఈ పండ్లతో జామ్‌లు, జెల్లీలు, పచ్చళ్లు రకరకాల వంటకాలు తయారు చేస్తారు.