అన్వేషించండి

Enterovirus: చంటి పిల్లలు జాగ్రత్త, వారిపైనే కొత్త వైరస్ ప్రతాపం - ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు

ఎంట్రోవైరస్ చంటి పిల్లల ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది.

ఏదో ఒక వైరస్ విరుచుకుపడుతూ... ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు సవాలు విసురుతూనే ఉంది. ఇప్పుడు ఐరోపాలో ఎంట్రోవైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. క్రొయేషియా, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర ఐర్లాండ్ వంటి దేశాల్లో ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్లు అధికమవుతున్నాయి. వీటి పెరుగుదల చూస్తుంటే ఇతర దేశాలకు త్వరగా పాకే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ ఎంట్రోవైరస్‌ను ఎదుర్కోవడానికి అమెరికా కూడా సిద్ధపడింది. ఐరోపాలో అప్పుడే పుట్టిన పిల్లలపై ఎంట్రో వైరస్ దాడి చేస్తోంది. బ్రిటన్లో ఇప్పటికే 17 మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఫ్రాన్స్‌లో కూడా తొమ్మిది మంది ఈ ఎంట్రో వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడగా అందులో ఏడుగురు మరణించారు. అప్పుడే పుట్టిన చిన్నారులు ఈ ఎంట్రో వైరస్ ఇన్ఫెక్షన్ సోకి కొన్ని రోజులకు మరణించారు. ఇది శిశువుల పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. అప్పుడే పుట్టిన శిశువులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ వైరస్ వారిపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తోంది.

కేవలం యూరోప్ దేశాల్లోనే కాదు, అమెరికాలో కూడా పిల్లల్లో ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయి. ఆ దేశం ఇప్పటికే అప్రమత్తమయింది. ఎంట్రో వైరస్ అనేది పోలియో వైరస్, కాక్స్‌సాకీ వైరస్ వంటి వాటి వల్ల వస్తుంది. ఇది తేలికపాటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ చంటి బిడ్డల్లో, రోగనిరోధక శక్తి లేని రోగుల్లో ఇది అధిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రాణాంతకంగా మారుతుంది. 

దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే... చేతులు, పాదాలు, నోటిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అక్కడి చర్మంపై దద్దుర్లు వస్తాయి. వైరల్ మెనింజైటిస్ రావచ్చు. ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది అంటువ్యాధి, కాబట్టి త్వరగా ఇతర శిశువులకు సోకే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తులకు ఈ వైరస్ వస్తే కొన్ని రోజుల్లో తేరుకుంటారు. కానీ నవజాత శిశువుల్లో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారుతుంది. వారి వ్యాధినిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా మారుతుంది.  అందుకే ఈ ఇన్ఫెక్షన్ బారి నుండి బిడ్డలను కాపాడుకోవాలి.

మన భారతదేశంలో కూడా కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, అసోం, అండమాన్ దీవులలో ఎంట్రో వైరస్ వ్యాప్తి ఉండవచ్చని తెలుస్తోంది. కేరళలో గత ఏడాది టమోటో ఫ్లూ విపరీతంగా వ్యాప్తి చెందింది. ఈ టమోటో ఫ్లూ వచ్చిన వారిలో చర్మంపై ఎర్రటి బొబ్బలు వచ్చాయి. ఎంట్రో వైరస్ కూడా చర్మంపై దద్దుర్లతోనే కనిపిస్తుంది. కాబట్టి దద్దుర్లు కనిపిస్తే వైద్యులకు శిశువులను చూపించి, తగిన చికిత్స అందించాలి. 

Also read: సాగర కన్యతో కలిసి ఈదాలంటే ఆ బీచ్‌కు వెళ్లాల్సిందే

Also read: పచ్చిమిరపకాయలు కొనలేకపోతున్నారా? అయితే వంటల్లో వీటిని వాడండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Embed widget