అన్వేషించండి

Dry Skin in Winter : చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Winter Dry Skin Care : వాతావరణం మారినప్పుడు చర్మం బిగుసుకుపోయి.. పొడిగా మారుతుంది. కొన్నిసార్లు తెల్లని మచ్చలు కూడా కనిపిస్తాయి. మరి ఈ డ్రై స్కిన్ దూరం చేసుకోవడానికి ఏ టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాతావరణ మార్పులతో పొడిబారే చర్మానికి తేమ అవసరం.
  • కొబ్బరి నూనె, కలబంద జెల్, తేనె చర్మానికి మంచివి.
  • గోరువెచ్చని నీటితో స్నానం, నీరు పుష్కలంగా త్రాగాలి.
  • ఘాటైన సబ్బులు వాడకండి, సమస్యంటే వైద్యుడిని కలవండి.

Dry, Flaky Skin During Weather Changes : వాతావరణంలో మార్పులు మొదలవ్వగానే.. ఆరోగ్యంతో పాటు చర్మం కూడా ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు వేడి, చలి, తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారవచ్చు. దీంతో ముఖ కండరాల బిగుతుగా మారుతాయి. చేతులు, పెదవులు, కాళ్లు కూడా పగిలి.. తెల్చని పొరలాంటి మచ్చలను ఏర్పరుస్తాయి. ఇలాంటి సమయంలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఖరీదైన మాయిశ్చరైజర్లు లేదా చర్మ సంరక్షణ ఉత్పత్తులను కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులతో కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. 

కొబ్బరి నూనెతో..

పొడి చర్మాన్ని మృదువుగా చేయడానికి చాలామంది కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. స్నానం చేసిన తర్వాత లేదా పడుకునే ముందు, కొద్దిగా తడిగా ఉన్న చర్మంపై కొబ్బరి నూనెను వేసి రాసుకోవాలి. ఇది తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. 

Also Read : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా

కలబంద జెల్

కలబంద గుజ్జు కూడా చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. తాజాగా ఉండే అలొవెరా జెల్​ను ముఖానికి, చేతులకు రాసుకోవచ్చు. అలాగే క్రీమ్ రూపంలో దొరికే వాటిని కూడా చర్మానికి ఉపయోగించవచ్చు కానీ.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

తేనెతో..

తేనె కూడా చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. దానిని కొంతసేపు ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగేయండి. దీనిని కూడా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

Also Read : నయాసినమైడ్ Vs విటమిన్ C.. స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఏది బెస్ట్? మీ చర్మం కోసం ఇలా ఎంచుకోండి

స్నానం చేసిన తర్వాత..

స్నానం చేసిన వెంటనే చర్మానికి కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. స్కిన్ ఇంకా కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ రాసుకోండి. ఇది తేమను ఎక్కువ సేపు నిలుపుకోవడానికి సహాయపడుతుంది.

వేడి నీటితో స్నానం.. 

చల్లని వాతావరణంలో చాలామంది వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. కానీ బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే.. చర్మంలోని సహజ నూనెలను తొలగిపోతాయని చెప్తున్నారు నిపుణులు. దానికి బదులుగా గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చట. 

Also Read : పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి

హైడ్రేషన్ ముఖ్యం..

ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. నీటి శాతం శరీరంలో తగ్గితే చర్మం ఎక్కువగా పొడిబారిపోతుంది. అలాగే నీటితో పాటు పండ్లు, ఆకుకూరలు, నట్స్, హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఫుడ్స్ డైట్​లో చేర్చుకోవాలి. 

చేయకూడని తప్పులు ఇవే

తరచుగా ముఖం కడుక్కోవడం, చర్మాన్ని గట్టిగా రుద్దడం వంటివి మానుకోవాలి. అలాగే ముఖం కడుక్కోవడానికి ఘాటైన వాసన గల సబ్బు లేదా కఠినమైన ఫేస్ వాష్‌కు బదులుగా, తేలికపాటి క్లెన్సర్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పెదవులు పొడిబారితుంటే.. పెట్రోలియం జెల్లీని రాయండి. చేతులు, పాదాలు పొడిగానే ఉంటే.. నిద్రపోయే ముందు ఏదైనా క్రీమ్ అప్లై చేయండి. చర్మం దురద, ఎరుపు, పగుళ్లు లేదా చికాకు ఎక్కువకాలం కొనసాగితే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

Also Read : తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Bigg Boss Season 10 Today November 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చివరి కెప్టెన్‌గా లేడీ టైగర్ దేబ్జానీ! మరోసారి క్యారెక్టర్ గొడవ.. హౌస్ సపోర్ట్ మొత్తం త్రిగుణ్‌కే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చివరి కెప్టెన్‌గా లేడీ టైగర్ దేబ్జానీ! మరోసారి క్యారెక్టర్ గొడవ.. హౌస్ సపోర్ట్ మొత్తం త్రిగుణ్‌కే!
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Delimitation Bill: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
Embed widget