పానీపూరి ఇష్టమా? అయితే మీరు కచ్చితంగా ఇది చదవాలి
పానీ పూరి అందరికీ ఇష్టమే. అందుకే పానీపూరి అమ్మేవాడి చుట్టు ఎప్పుడూ జనం ఉంటూనే ఉంటారు. మోస్ట్ సెల్లింగ్ స్ట్రీట్ ఫూడ్ పానీపూరీ.
అమ్మాయిలకు పానీ పూరీకి అవినాభావ సంబంధం అని అందరూ అంటుంటారు. చాలా ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. భయ్యా మీఠే కే సాథ్ ఏక్ ఎక్ట్స్ ట్రా..అని జోకులు కూడా చాలా ఉన్నాయి. ఈ విషయంలో అమ్మాయిలు ఎక్కువ బ్లేమ్ అయ్యారు కానీ నిజానికి పానీ పూరి అందరికీ ఇష్టమే. అందుకే పానీపూరి అమ్మేవాడి చుట్టు ఎప్పుడూ జనం ఉంటూనే ఉంటారు. మోస్ట్ సెల్లింగ్ స్ట్రీట్ ఫూడ్ పానీపూరీ.కమ్మని పానీ పూరీ తినేందుకు భలే ఉంటుంది. గుర్తొస్తే చాలు తినాలన్న కోరిక కలగక మానదు. కానీ తర్వాత మన అదృష్టం బాలేకపోతే ఆసుపత్రి పాలే.
పానీపూరీ తయారీ
పానీపూరీ తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏవీ కూడా ఆరోగ్యకరమైనవి కావు. ఎలాంటి పోషక విలువలు వాటిలో ఉండవు. పూరీ తయారీకి మైదా పిండి బేకింగ్ సోడా ఉపయోగిస్తారు. వీటిని తరచుగా తీసుకుంటే బరువు పెరగడం కాయం. ఎన్నోరకాల అనారోగ్యాలు కలిగేందుకు ఈ ఒక్క కారణం చాలు. అంతేకాదు వీటితో డయాబెటిస్ బారిన కూడా పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పానీ పూరిని వేయించేందుకు ఉపయోగించే నూనె కూడా ముఖ్యమే. ఎలాంటి నూనె ఉపయోగిస్తారో తెలీదు. ఎక్కువ మరిగిన నూనె చాలా ప్రమాదకరం. ఇలాంటి నూనె శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలను పెంచుతుంది. ఇదొక జీరో న్యూట్రియెంట్స్ తో ఉన్న జంక్ ఫూడ్.
ఇన్ఫెక్షన్లు ఖాయం
సాధారణంగా పానీ పూరి అమ్మే స్థలాలు అంత శుభ్రంగా ఉండవు. పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు పానీ పూరీ ప్రిపేర్ చేసి ఇచ్చే వ్యక్తి ఎంత వరకు పరిశుభ్రత పాటిస్తాడు అనేది కూడా చాలా ముఖ్యం. అతడికి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి పానీ పూరికి ఉపయోగించే నీరు కచ్చితంగా కలుషితం అవుతుంది. అంతేకాదు ఆ నీటిని తయారు చేసే ప్రాసెస్ లో అందులో పాన్ మసాలా కలుపుతారు. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది. అంతేకాదు సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రకరకాల అనారోగ్యాలకు కారణం కావచ్చు. సోడియం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. అందువల్ల బరువు పెరుగుతారు, కిడ్నీలు ఎక్కువగా పనిచెయ్యాల్సి వస్తుంది.
అప్పట్లో తెలంగాణలో టైఫాయిడ్ ప్రబలడానికి కారణం పానీ పూరీ అనే ప్రచారం కూడా జరిగింది. టైఫాయిడ్ ఏకంగా పానీ పూరీ రోగం అని కూడా పేరు పెట్టారు. పానీ పూరితో డయేరియా వస్తుంది. అంతేకాదు శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కామెర్లు రావచ్చు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన రకరకాల సమస్యలకు పానీ పూరి కారణం అవుతుంది. జీర్ణాశయంలో పీహెచ్ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఎసిడిటి పెరుగుతుంది, ఇది ఎక్కువకాలం కొనసాగితే అల్సర్ గా మారుతుంది.
ఇలా రకరకాల అనారోగ్యాలకు పానీ పూరి కారణం కావచ్చు. రుచికి టెంఫ్ట్ అయ్యి పానీ పూరీ తింటూ పోతే ఆరోగ్యం గంగపాలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో టైఫాయిడ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం పానీపూరీ తినడం ఎంత హానికరమో వివరిస్తూ ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహించారంటే ఇదెంత అనారోగ్యకరమైన పదార్థమో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండడం అన్నిరకాలుగా మంచిదనేది నిపుణుల సలహా.