Maida Making: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? అందుకే ఇది తింటే అన్ని రోగాలు

మైదా పిండి దేనితో తయారుచేస్తారో చాలా మందికి తెలియదు, కానీ దానితో అనేక రకాల ఆహారాలు వండుకుని తినేస్తారు.

FOLLOW US: 

గోధుమల నుంచి గోధుమ పిండి వస్తుంది, రాగుల నుంచి రాగి పిండి, బియ్యం నుంచి బియ్యంపిండి, రవ్వ వస్తాయి. మరి మైదా పిండి దేనితో తయారవుతుంది? ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? ఆ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ పిండితో స్వీట్లు, కేకులు, బ్రెడ్డులు.... ఇలా అనేకం చేసుకుని తినేస్తాం. మైదా పిండిని వాడడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని ఎప్పట్నించో చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయినా దీన్ని వాడుక మాత్రం తగ్గించడం లేదు ప్రజలు. అసలు మైదా పిండి దేనితో, ఎలా తయారుచేస్తారో తెలుసుకుంటే, దాంతో వండిన వంటలు ఎందుకు తినకూడదో మీకే అర్థమవుతుంది.

మైదాపిండి తయారీ ఇలా...
గోధుమ పిండిని చేసేటప్పుడు గోధుమలను నేరుగా మిల్లులో వేసి పిండి చేస్తారు. అందులో ఎలాంటి రసాయనాలు కలపరు. బియ్యంపిండి అయినా అంతే. అందుకే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన మార్పులేవీ జరగవు. కానీ మైదా పిండిని మాత్రం మిల్లులో బాగా పోలిష్ చేసిన గోధుమల నుంచి తయారుచేస్తారు. పాలిష్ లో భాగంగా గోధుమల పైపొరలను చాలా వరకు తీసేస్తారు. పోషకాలు ఉండేదే పై పొరల్లో. అలా పైపొరలు తీసేసిన గోధుమలను పిండి ఆడతారు. ఆ పిండి గోధుమ రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా చేసేందుకు అజోడికార్బోనోమైడ్, క్లోరీన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను జోడిస్తారు. చివరలో పొటాషియం బ్రోమేట్‌ను కలుపుతారు. అప్పుడు మైదా చాలా స్మూత్ గా, తెల్లగా అవుతుంది. 

దీని ధర కూడా గోధుమ పిండి కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే హోటల్స్ లో పూరీని అధికంగా చేస్తారు. అలాగే బోండాలు వండుతారు. కొన్ని గారెలు, ఇడ్లీల్లో కూడా మైదాను మిక్స్ చేస్తున్నారు.

మైదా ఒక బూడిద
మైదా బూడిదతో సమానం. దాన్ని తినడం వల్ల కాస్త కూడా ఉపయోగం ఉండదు. ఆరోగ్యప్రయోజనలేవీ కలగవు సరికదా క్యాన్సర్ వంటి రోగాల కారకంగా కూడా మారే అవకాశం ఉంది. దీని తయారీలో వాడే బ్రోమేట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిషేధం కూడా విధించారు. చాలా కీటకాలు మైదా తిని చనిపోతాయి. అంటే ఇదెంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. మైదా పిండిని నీటిలో కలిపి గోడలకు పోస్టర్లు అతికించడానికి ఉపయోగిస్తారు.  

మైదాతో చేసే వంటలు ఇవే...
రవ్వదోసెలు, పరోటా, రుమాలీ రోటీ, కేకులు, కాజాలు, జిలేబీలు, హల్వాలు, బొబ్బట్లు, బ్రెడ్ వంటి వాటిలో మైదాతో అధికంగా చేస్తారు. వీటిని నిత్యం తినేవారి శరీరం క్రమంగా కృశించి పోతుంది. 

Also read: మీ పిల్లలు ఎత్తు పెరగాలా? రోజూ వారితో ఇవి తినిపించండి

Also read: శుత్రిహాసన్‌కు పీసీఓఎస్ సమస్య? ఈ సమస్య ఉంటే గర్భం దాల్చలేరా? చికిత్స ఉందా?

Published at : 07 Jul 2022 09:15 AM (IST) Tags: Maida Pindi Maida Flour Making Maida Diseases Danger with Maida

సంబంధిత కథనాలు

Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు

Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి

Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి

Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Heart Health: చామదుంపలో ఉండే ఈ  గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్