Kids Height: మీ పిల్లలు ఎత్తు పెరగాలా? రోజూ వారితో ఇవి తినిపించండి
పిల్లలు ఎత్తు పెరగాలని కోరుకుంటున్న తల్లిదండ్రులకు ఈ ఆహారపదార్థాలు సహకరిస్తాయి.
పిల్లలు ఎత్తు గురించి ఆందోళన చెందే తల్లిదండ్రులు ఎంతో మంది. నిజానికి పిల్లల ఎత్తు వారి తల్లిద్రండుల నుంచి వారసత్వంగా వస్తుంది. అలా అని మన వంతు ప్రయత్నం చేయకుండా వదిలేయకూడదు. సరైన పోషణ అందించే పిల్లలు మంచి ఎత్తు ఎదిగే అవకాశం ఉంది. కొన్ని రకాల ఆహారాలు ఎత్తు పెంచేందుకు సహకరిస్తాయి. పిల్లలు పెరిగే వయసులో ఈ ఆహారాలను తరచూ పెట్టడం వల్ల సహజంగానే ఎత్తు పెరిగే అవకాశం ఉంది. క్యాల్షియం, విటమిన్ డి, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు తీసుకోవడం వల్ల కీళ్లు, కణజాల పునరుత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల కాస్త ఎత్తు అధికంగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఈ పోషకాలు పుష్కలంగా ఉన్న కొన్ని ఆహారాలు ఇవన్నీ. వీటిని పెరిగే పిల్లలకు చిన్నప్పట్నించి తినిపిస్తే వారసత్వంగా వచ్చే ఎత్తు కన్నా కాస్త ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.
పెరుగు
పెరుగులో కాల్షియం, పాలకొవ్వులు, ప్రొటీన్లతో నిండి ఉంటుంది. ఇవి ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి. ఇవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పెరుగుదల, అభివృద్ధికి సహాయపడతాయి. ఒక పరిశోధన ప్రకారం ప్రొబయోటిక్స్ తీసుకోవడం ఎత్తును పెంచుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి.
బీన్స్
బీన్స్ ఎత్తు పెరగడానికి, కండరాలను బలపరచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి సహకరిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, కణజాల పునరుత్పత్తిని ప్రోత్సహించడంలో ఇవి ముందుంటాయి. ఇందులో ప్రొటీన్లు, బి విటమిన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. బీన్స్ రోజువారీ ఆహారంలో కలిపి వారికి తినిపించడం మంచిది. ఇందులో ఫైబర్, కాపర్, మెగ్నిషియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.
బాదం పప్పులు
రాత్రి బాదం పప్పులను నానబెట్టి ఉదయానే పిల్లల చేత తినిపించడం మంచిది. ఇవి తెలివితేటలను కూడా పెంచుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. బాదం అనేది మొక్కల ఆధారిత ప్రొటీన్. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి కణాలను రిపేర్ చేయడంలో, ఎముకల సాంద్రతలో మెరుగుపరచడంలో సహాయపడతాయి. బాదంలో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఇవి ఎముక పెరుగుదలకు సహాయపడుతుంది.వీటిని తరచూ తినడం ఎముకలు సాగి
పొడవు పెరుగుతారు పిల్లలు.
చికెన్
చికెన్లో ప్రొటీన్లు, విటమిన్ బి12, ఫాస్సరస్, విటమిన్ బి6, సెలీనియం వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు పటిష్టంగా అయ్యేందుకు, కణాల మరమ్మతుకు సహకరిస్తాయి. మీ పిల్లల ఎత్తు పెంచడంలో సహకరిస్తాయి. ఇందులో నీటిలో కరిగే విటమిన్ బి12 ఉండడం వల్ల ఎత్తు పెరుగుతారు.
గుడ్లు
పోషకాలు నిండుగా ఉండే ఆహారం గుడ్డు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి ముందుంటాయి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ శరీరం కాల్షియం పీల్చుకోవడాన్ని పెంచుతుంది. ఇది ఎముకలకు చాలా మంచిది. ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది.
Also read: శుత్రిహాసన్‌కు పీసీఓఎస్ సమస్య? ఈ సమస్య ఉంటే గర్భం దాల్చలేరా? చికిత్స ఉందా?