News
News
X

Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

జీడిపప్పులు తింటే కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాటి వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

FOLLOW US: 
 
రీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నట్స్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా వచ్చేది బాదం, వాల్ నట్స్. జీడిపప్పు గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ఇవి తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని అందరూ అనుకుంటారు. ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపరు. వాటిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉండటం వల్ల బరువు పెరుగుతారనే అపోహ ఉంటుంది. కానీ అందరూ అనుకునేంతగా జీడిపప్పు అనారోగ్యకరమైంది ఏమి కాదు. తగిన మోతాదులో తీసుకునే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పాలిఫెనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన చర్మాన్ని అందజేస్తుంది. శరీరంలోని అన్నీ అవయవాల పనీతిరుకే కాకుండా చర్మం, వెంట్రుకలకు కావలసిన పోషణ అందిస్తుంది. ఇదే కాదు, మగవారిలో సంతానోత్పత్తికి అవసరమైన వీర్య కణాలను వృద్ధి చేసేందుకు కూడా సహకరిస్తుంది.

కొవ్వు ఉన్నా ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది?

జీడిపప్పులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి తరచుగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ మోతాదు ప్రకారం తీసుకుంటే ఇవి గుండెకి మేలు చేస్తాయి. జీడిపప్పులోని చాలా కొవ్వులు రక్త కొలెస్ట్రాల్ పై తటస్థ ప్రభావాన్ని చూపించే స్టెరిక్ ఆమ్లం నుంచి వస్తాయి. వీటిని కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల లిపోప్రోటీన్లలో పాక్షికంగా తగ్గుతాయి. 

మహిళలకి మేలే..

జీడిపప్పు ఈస్ట్రోజెన్ స్థాయిలపై వాటి ప్రభావం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉంటే జీడిపప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇందులో  అనాకార్డిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో బాధపడే మహిళలు గర్భాశయ ఫైబ్రాయిడ్లు, PMS, పీరియడ్స్ సమయంలో అధిక నొప్పులు, కొన్ని సందర్భాల్లో రొమ్ము క్యాన్సర్ తో బాధపడే అవకాశం ఉంది. శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే సింథటిక్ రసాయనాలకు గురికావడం ద్వారా  ఈస్ట్రోజెన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.

News Reels

రోజుకు ఎన్ని తినాలి?

అనాకార్దిక్ యాసిడ్ ప్రయోజనాల మేరకు రోజుకు కనీసం 20 గ్రాముల వరకు జీడిపప్పు తినొచ్చు. విటమిన్స్ ఎ, ఇ, కే, రాగి, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక పోషకాలు ఉన్న ఈ జీడిపప్పును మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు అన్నీ పొందవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కండరాలకు అవసరమయిన కొల్లాజెన్ ని ఇది అందించి ఎముకలు ధృడంగా ఉండేలా చేస్తుంది. అదే కాదు మెదడు పనితీరుని పెంచడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగ్గా ఉండేలా చేస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వేదిస్తున్నాయా? తేనెతో ఇలా చేయండి

Also read: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది

Published at : 26 Sep 2022 05:41 PM (IST) Tags: cashew Cashew Health Benefits Cashew Benefits Cashew Uses Kaju

సంబంధిత కథనాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుంటే ఈ చిట్కాలు పాటించండి

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుంటే ఈ చిట్కాలు పాటించండి

Momos: మోమోస్ తినడం ఆరోగ్యానికి హానికరమా? డయాబెటిస్ వచ్చే ఛాన్సు పెరుగుతుందా?

Momos: మోమోస్ తినడం ఆరోగ్యానికి హానికరమా? డయాబెటిస్ వచ్చే ఛాన్సు పెరుగుతుందా?

Headache: తలనొప్పిగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవి, తింటే నొప్పి పెరిగిపోతుంది

Headache: తలనొప్పిగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవి, తింటే నొప్పి పెరిగిపోతుంది

Curd: పెరుగు భోజనానికి ముందు తింటే మంచిదా? లేక తరువాత తింటే మంచిదా?

Curd: పెరుగు భోజనానికి ముందు తింటే మంచిదా? లేక తరువాత తింటే మంచిదా?

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?