News
News
X

Honey Pack: మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వేదిస్తున్నాయా? తేనెతో ఇలా చేయండి

తేనె శరీర ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

FOLLOW US: 

చాలా మంది పంచదారకి ప్రత్యామ్నాయంగా తేనె ఉపయోగిస్తారు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగితే బరువు తగ్గుతారని అంటుంటారు. అంతే కాదు పసిపిల్లలకి నాలుక మీద తేనె రాయడం వల్ల వాళ్ళకి  త్వరగా మాటలు వస్తాయని కూడా అంటారు. తేనె, తేనెటీగల పెంపకం పరిశ్రమలని ప్రోత్సహించడానికి సెప్టెంబర్ మాసాన్ని జాతీయ తేనె నెలగా జరుపుకుంటారు. తేనె చర్మానికి, శరీరానికి గొప్ప పదార్థంగా ప్రసిద్ది చెందింది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, రక్షణగా ఉంచడంలో సహాయపడతాయి.

ప్రస్తుతం మార్కెట్లో అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి. వాటిలో కూడా తేనె ఉంటుంది. వాటిని DIY ఫేస్ ప్యాక్‌లు, ఫేస్ మాస్క్లో కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేనెలోని ఔషధ, యాంటీ మైక్రోబియల్ గుణాలు గాయాలను తక్షణమే నయం అయ్యేలాగా పని చేస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో తేనె తప్పనిసరిగా ఉంటుంది.

తేనెలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్, క్లోరిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, అయోడిన్ గుణాలు ఉన్నాయి. ఇవే కాదు మాంగనీస్, అల్యూమినియం, క్రోమియం, రాగి వంటి కూడా ఉన్నాయని నిరూపితమైంది. తేనెటీగలు తయారుచేసిన తేనెలో బి1, బి2, బి3, బి4, బి5, బి6, ఇ, సి, కె, కెరోటిన్ విటమిన్లు ఉంటాయి. ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులను నయం చెయ్యడానికి, శ్లేష్మాన్ని తగ్గించి దగ్గును కంట్రోల్ చేస్తుంది. తేనె వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడుతుంది. నేచురల్ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.

తేనె వల్ల కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది: తేనెను చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ఇది చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది.

News Reels

మొటిమలను పోగొడుతుంది: తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు రాకుండా చెయ్యడంలో సహాయపడతాయి. చర్మంపై తేనెను పూయాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా తరచూ చేయడం వల్ల మీ మొహం కాంతివంతంగా మెరిసిపోతుంది.

రంధ్రాలను శుభ్రం చేస్తుంది: చర్మానికి తేనెను రాయడం వల్ల చర్మం మీద ఉన్న రంధ్రాలు శుభ్రపడతాయి. అవి దుమ్ముతో మూసుకుపోకుండా తేనె కాపాడుతుంది. ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

ప్రకాశవంతంగా చేస్తుంది: తేనెలో ఉన్న కొన్ని సమ్మేళనాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చెయ్యడంలో సహాయపడతాయి. అంతే కాదు చర్మం పొడిబారకుండా చేస్తుంది.

సూర్యకాంతి నుంచి రక్షణగా: తేనెను అప్లై చేయడం వల్ల సూర్యకాంతి వల్ల అయిన గాయాలని నయం చేస్తుంది. తేనె, కలబందని మిక్స్ చేసి ఆ అమిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also read: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది

Also read: తల్లిదండ్రులు పిల్లలతో కలిసి టీవీ చూస్తే ఎన్ని లాభాలో, చెబుతున్న అధ్యయనం

Published at : 26 Sep 2022 02:56 PM (IST) Tags: Skin Care Tips Honey benefits Honey For Skin Honey Skin Care Tips Acne Problems

సంబంధిత కథనాలు

పానీపూరి ఇష్టమా? అయితే  మీరు కచ్చితంగా ఇది చదవాలి

పానీపూరి ఇష్టమా? అయితే మీరు కచ్చితంగా ఇది చదవాలి

బయోజెనిక్స్‌లో కొత్త ఆవిష్కారం, ఆ సమస్య ఉన్నవారి పాలిట వరమే

బయోజెనిక్స్‌లో కొత్త ఆవిష్కారం, ఆ సమస్య ఉన్నవారి పాలిట వరమే

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి, ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి,  ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

Kids: శీతాకాలంలో పిల్లలకి కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Kids: శీతాకాలంలో పిల్లలకి  కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి