News
News
X

మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తు వస్తుందా? దానికిదే కారణం

భోజనం చేశాక చాలా మందికి నిద్ర వస్తున్నట్టు అవుతుంది.

FOLLOW US: 
Share:

మధ్యాహ్న భోజనం సుష్టుగా తిన్నాక నిద్ర మత్తులో తూగుతుంటారు చాలా మంది. పనిచేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఆవలింతలు తెగ వస్తుంటాయి.తిన్న తరువాత ఎందుకింత నిద్ర మత్తు? అని ఎప్పుడైనా ఆలోచించారా? భుక్తాయాసంతో నిద్ర వస్తోంది అంటూ సర్ది చెప్పుకుంటారు చాలా మంది. నిజానికి దీనికి ఒక కారణం ఉంది. మధ్యాహ్నం మీరు ఏం తిన్నారన్న దానిపై నిద్రమత్తు వచ్చేది లేనిది ఆధార పడి ఉంటుంది. మీరు మధ్యాహ్నం అన్నం ఎక్కువగా తింటే నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చపాతీల్లాంటివి తింటే త్వరగా నిద్ర మత్తు రాదు. అన్నం తినడం వల్ల గ్లూకోజు వెంటనే రక్తంలో కలుస్తుంది. దీని వల్ల కాస్త అలసటగా అనిపిస్తుంది. ఆ అలసట వల్ల నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది.

అలాగే అన్నం సుష్టుగా భోజనం చేయడం వల్ల మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచడంతో పాటూ, మత్తు భావనను కలిగిస్తాయి. అన్నమే కాదు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఏ ఆహారాలు తిన్నా ఇలాగే ఉంటుంది. అంతేకాదు మధ్యాహ్నం సమయానికి సాధారణంగా అలసిపోయి ఉంటాం. దీనికి అన్నం తోడైతే నిద్ర ముంచుకొస్తుంది. అందులోనూ బిర్యానీల్లాంటివి తింటే నిద్ర మరీ పెరిగిపోతుంది. మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉండాలంటే కార్బోహైడ్రేట్లు తక్కువుండే ఆహారాన్ని, ప్రొటీన్ ఎక్కువుండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్ వల్ల శరీరానికి శక్తి అందుతుంది. చురుగ్గా పనిచేస్తారు. 

మధ్యాహ్నం వేళ అన్నం తిన్నాక మరీ నిద్ర ముంచుకొస్తుంటే, అది మీ పనిపై ప్రభావం చూపిస్తుంటే ఆహారంలో మార్పులు చేసుకోవడం అవసరం. లంచ్‌లో అన్నానికి బదులు జొన్నలు,సజ్జలు, క్వినోవా, ఓట్స్ వంటి వాటితో వండిన వంటకాలు తీసుకెళ్లాలి. లేదా చపాతీ తిన్నా మంచిదే. అలాగే కూరగాయలు, సలాడ్లు, పండ్లు, చికెన్, సోయా, పన్నీరు వంటి వాటితో వండినవి తినాలి. ఇవి రక్తంలో చక్కెరను అధికంగా ఒకేసారి విడుదల కానివ్వవు. శరీరంలో బద్ధకాన్ని, నిద్రమత్తును పెంచవు. 

మధ్యాహ్నం భోజనం చేశాక కదలకుండా కూర్చోవడం వల్ల కూడా శరీరం బద్ధకంగా మారుతుంది. నిద్ర మత్తుతో ఆవలింతలు వస్తాయి. కాబట్టి  తిన్నాక ఓ పదినిముషాలు నడవాలి. అన్నింటి కన్నా సింపుల్ చిట్కా లంచ్‌లో అన్నం తినాల్సి వస్తే.... పొట్ట నిండా తినకుండా, తగ్గించి తింటే మంచిది.  

Also read: పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయా? అసలెందుకు ఇవి ఏర్పడతాయి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 29 Dec 2022 04:21 PM (IST) Tags: Lunch Sleepy after lunch Sleepy feel Reasons of Sleepiness

సంబంధిత కథనాలు

Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే -  ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు

Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు

Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!

Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత

రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

టాప్ స్టోరీస్

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్