అన్వేషించండి

BirthMarks: పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయా? అసలెందుకు ఇవి ఏర్పడతాయి?

పుట్టుమచ్చలు లేని మనుషులు అరుదే. దాదాపు అందరికీ ఉంటాయివి.

బర్త్ సర్టిఫికెట్ నుంచి డిగ్రీసర్టిఫికెట్ వరకు అన్నింట్లో పుట్టుమచ్చల కోసం ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. అక్కడ శరీరంపై ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో రాయాలి. పుట్టు మచ్చలకు అంత ప్రాధాన్యత ఉంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా పుట్టు మచ్చలు అసలెందుకు ఏర్పడతాయి? అవి ఏర్పడకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టేనా?

పుట్టుకతో వస్తాయా?
పుట్టుమచ్చలు పుట్టుకతో రావాలని లేదు. ఒకట్రెండు పుట్టుకవతో రావచ్చు, రాకపోనూ వచ్చు. పుట్టిన కొన్ని రోజులు లేదా కొన్ని నెలల తరువాత అవి మెల్లగా బయటపడతాయి. కొంతమంది పిల్లల్లో రెండు మూడేళ్ల తరువాత వచ్చే అవకాశం కూడా ఉంది. పుట్టు మచ్చలు కనిపించకపోతే అదేదో ఆరోగ్య సమస్యేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. దాదాపు పదిశాతం మంది పిల్లలు పుట్టుకతోనే పుట్టుమచ్చతో పుడతారు. ఆ పుట్టుమచ్చలను హెమంగియోమా అంటారు. అవి శాశ్వతంగా ఉండాలని లేదు. పదేళ్ల వయసు దాటాకా మాయమైపోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టు మచ్చలు ఎప్పుడైనా కనుమరుగు అయ్యే అవకాశం ఉంది. 

ఎలా ఏర్పడతాయి?
పుట్టుమచ్చలు రెండు రకాలు. కొన్ని రక్తనాళాలు సరిగా ఏర్పడకుండా, ఒకదానికొకటి దగ్గరగా ఏర్పడి, అక్కడ రక్తకణాలు పేరుకుపోయినప్పుడు కొన్నిసార్లు పుట్టుమచ్చలా ఏర్పడతాయి. ఇవి నలుపుగా కాకుండా, పేలవమైన రంగులో ఉంటాయి. వీటిని వాస్కులర్ పుట్టుమచ్చలు అంటారు. ప్రతి పదిమందిలో ఒకరు ఇలా వాస్కులర్ పుట్టుమచ్చులతో పుడతారు. ఇక రెండోది పిగ్మెంటెడ్ పుట్టుమచ్చలు. అంటే శరీరంలో ఏదైనా ప్రదేశంలో వర్ణద్రవ్యం కణాలు అధికంగా పేరుకుపోతే అక్కడ నల్లటి మచ్చలా మారుతుంది. ఇవే అధికంగా అందరికీ ఉండే పుట్టుమచ్చలు. 

వారసత్వంగా...
కొన్ని పుట్టుమచ్చలు కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. తల్లికి లేదా తండ్రికి ఎక్కడ పుట్టుమచ్చ ఉందో, పిల్లలకు అక్కడే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగని అందరికీ రావాలని లేదు. కొన్ని కుటుంబాల్లోనే ఇలా జరిగే అవకాశం ఉంది.  

ఎన్నో కథలు..
పిల్లలకు పుట్టుమచ్చలు వచ్చే విషయంలో కొన్ని కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. గర్భధారణ సమయంలో తల్లి తీవ్ర భావోద్వేగానికి గురై, తన శరీరంలోని ఒక ప్రదేశాన్ని తాకినట్టు అయితే, బిడ్డకు ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ వచ్చే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి. కానీ అది కేవలం అపోహే అనే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. 
 Also read: పొడవుగా ఉన్న వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Ganguly Doosra Row: గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
Blood Pressure Risks : ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
Weight Loss Drinks : బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget