News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Edema: పాదాల వాపును తేలిగ్గా తీసుకోకండి, ఆ సమస్యలకు సంకేతం కావచ్చు

కొందరికి పాదాలలో వాపు వస్తుంది. కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోరు.

FOLLOW US: 
Share:

ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉంటే పాదాలు వాపు రావడం సహజం. కానీ కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా పాదాలలో వాపు కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతంగా చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇలా పాదాలు, కాళ్లలో వాపు  కనిపించడాన్ని ఎడెమా అని పిలుస్తారు. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు మాత్రం ప్రాణాంతకమైనవి. అందుకే పాదాల వాపును తేలిగ్గా తీసుకోకూడదని వివరిస్తున్నారు వైద్య నిపుణులు ఎలాంటి కారణం లేకుండా పాదాలు వాచాయి అంటే వాటికి ఈ కింద సమస్యలు కారణమై ఉండొచ్చు కాబట్టి వెంటనే వైద్యులను కలవాలి

కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కాళ్లు, పాదాలలో వాపు కనిపిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉంటే ముఖం కూడా ఉబ్బుతుంది. ఇది ఇలానే వదిలేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. లివర్ సమస్యలు ఉన్నవారిలో కూడా పాదాల్లో కాళ్లలో, వాపు కనిపిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల పాదాలలో నీరు చేరి ఉబ్బినట్టు అవుతాయి. కాబట్టి పాదాల వాపుకు లివర్ ఫెయిల్యూర్ కూడా ఒక కారణం అని భావించవచ్చు.

కాలంలో ఉండే సిరలు చక్కగా పనిచేయడం చాలా ముఖ్యం. ఆ సిరల్లోనుంచి రక్తప్రవాహం సరిగా కాకపోయినా నీరు నిలిచిపోయి పాదాలవాపు వస్తుంది. ఇది ఎక్కువగా కూర్చుని పని చేసేవారు, నిల్చని పనిచేసే వారిలో కనిపిస్తుంది. అలాగే ఊబకాయం ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువ. వాపును పట్టించుకోకుండా వదిలేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. చివరికి గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి కాలు, పాదాలలో వాపు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. 

గుండె సరిగా రక్తాన్ని పంపు చేయనప్పుడు కూడా ఇలాంటి పాదాల వాపు, కాళ్ళ వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బులు ఉన్నవారిలో ఇలా రెండు కాళ్లల్లో వాపు కనిపించడం సహజం. వాపు ఉన్నా, నొప్పి ఉండదు. కానీ నడుస్తున్నప్పుడు ఆయాసం వంటివి వస్తాయి. ఇలా జరిగితే వెంటనే గుండె వైద్య నిపుణులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

పాదాల వాపుతో బాధపడేవారు ఆహారంలో సోడియం తీసుకోవడం తగ్గించాలి. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల వాపు సమస్య మరింత పెరుగుతుంది. అంతర్లీన ఆరోగ్య సమస్యల వల్ల పాదాల వాపు వస్తుందని ముందే చెప్పుకున్నాం. కాబట్టి కాళ్లు, పాదాలలో వాపు కనిపిస్తే తేలికగా తీసుకోకుండా వైద్య నిపుణులను కలిసి చికిత్స తీసుకోండి. 

Also read: గర్భిణులు గ్రీన్ టీ తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?

Also read: ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నారా? అయితే వీటికి గుడ్ బై చెప్పండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 12 Sep 2023 12:03 PM (IST) Tags: Feet swelling Edema Edema side effects Leg swelling

ఇవి కూడా చూడండి

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

టాప్ స్టోరీస్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే