ఇతరుల కన్నా దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దానికి మీ రంగు కూడా కారణం కావచ్చు
దోమలు పెరిగిపోతున్నాయి. మలేరియా వంటి జ్వరాలు కూడా వ్యాప్తిస్తున్నాయి.
వానాకాలం వచ్చిందంటే చాలు దోమలు రెచ్చిపోతాయి. దోమల తమ సంతతిని పెంచుకుంటూ పోయే కాలం ఇదే. కాస్త నీరు నిల్వ ఉన్నా చాలు ఆ నీళ్లలోనే గుడ్లు పెట్టి తమ సంఖ్యను వేలల్లో పెంచుతాయి. అయితే మనుషుల గుంపు ఓ చోట ఉన్నప్పుడు అందులో ఉన్న అందరినీ దోమలు కుట్టవు. కొందరిని మాత్రమే ఎంచుకుని కుడుతుంటాయి. అంటే మీ శరీరం దోమల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తోందన్నమాట. మీ చర్మం వాసనకో, చెమటకో, అందులో సమ్మేళనాల నుంచి వాసనకో దోమలు ఆకర్షితులవుతాయి. వారినే వెళ్లి కరుస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం మీ బ్లడ్ గ్రూప్ కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అలాగే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెుతున్నారు అధ్యయనకర్తలు.
శరీరపు వాసన
శరీరం చెమట పట్టాక అందులో ఉండే కొన్ని సమ్మేళనాలు దోమల్ని ఆకర్షిస్తాయి. ఆ సమ్మేళనాలలో లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా ఉంటాయి. ఈ వాసనకు దోమలు కోరి వచ్చి కరుస్తాయి. కొందరి చర్మంపై ఉండే కొన్ని బ్యాక్టిరియాలు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు ఉన్న వ్యక్తులను దోమలు తక్కువ కరుస్తాయి. అలాగే ఒకేలాంటి కవలల నుంచి వాసనకు కూడా దోమలు ఎక్కువ ఆకర్షితమవుతాయని హార్వర్డ్ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది.
రంగు
దోమలు నలుగు రంగుకు ఆకర్షితులవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. తెల్లగా ఉన్నవారికి తక్కువ కరుస్తాయని, కాస్త ముదురు రంగులో ఉండే వారిని ఎక్కువ కుట్టే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
వేడి
మానవ శరీరాలు వేడిని కలిగి ఉంటాయి. ఆ శరీరపు వేడి దోమలను ఆకర్షిస్తాయి. సాధారణంగా వెచ్చని, తేమతో కూడిన వాతావరణంన కలిగి ఉన్న దేశాల్లోని దోమలు ఇలా శరీరపు వేడి ద్వారానే మనుషులను ఎంచుకుని కుడతాయి.
మద్యం వాసనకు
ఆల్కహాల్ అధికంగా తాగే వారిని కూడా దోమలు అధికంగా కుట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా బీర్ తాగే వారి చుట్టూ తిరుగుతాయిట దోమలు. మిమ్మల్ని ఎక్కువ కుడుతున్నాయంటే మీరు అధికంగా బీర్ తాగుతారేమో ఓసారి చెక్ చేసుకోండి.
గర్భిణీ స్త్రీలు
గర్భంతో ఉన్న మహిళలకు కూడా దోమలు అధికంగా ఆకర్షితులవుతాయి. ఎందుకంటే వారు అధిక శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంటారు. అలాగే అధికంగా కార్బన్ డైయాక్సైడ్ ను వదులుతారు. కాబట్టి దోమలు వారి చుట్టూ తిరుగుతుంటాయి.
ఎక్కువగా ఆ భాగాల్లో...
దోమలు మెత్తగా శరీర భాగాలపై కుడతాయి. దాని కొండె శరీరంలో దిగితేనే రక్తం పీల్చేగలిగేది. అలాగే చర్మ ఉష్ణోగ్రత ఎక్కడ అధికంగా ఉంటుందో అక్కడ కుడుతుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లపై అధికంగా కుడతాయి.
Also read: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో
Also read: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Also read: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.