X

Diabetes Side Effects: మీ రక్తంలో చక్కెర ఉందా? పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త.. డయాబెటిక్స్‌కు బ్యాడ్ న్యూస్!

నోటి ఇన్ఫెక్షన్లను చిన్న సమస్యగా భావించకండి. ముఖ్యంగా చిగుళ్లకు గాయాలైనా.. పుండ్లు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

FOLLOW US: 

మధుమేహం.. ఒంట్లోనే తిష్టవేసే తీయని స్లో పాయిజన్. దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ తీపి వ్యాధి ముదిరితే.. అవయవాలు కూడా పాడైపోతాయి. బయటకు ఆరోగ్యంగా కనిపించినా.. చక్కెర లోపల నుంచి చంపేస్తుంది. అందుకే, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. వారికి ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే.. డయాబెటిస్ సమస్యను మరింత పెంచేస్తుంది. చివరికి చికిత్స చేయడానికి సాధ్యం కాకుండా చేస్తుంది.

ఇటీవల అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. తీవ్రమైన చిగుళ్ల వ్యాధి (పీరియాడోంటిటిస్)తో బాధపడేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమైతే.. చిగుళ్ల వ్యాధి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ADAలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మధుమేహం బాధితులకు చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.  
 
చిగుళ్ల వ్యాధి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ వల్ల ఏర్పడుతుంది. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స పొందాలి. లేకపోతే దంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దంతాలకు సపోర్టుగా ఉండే ఎముకను ఇన్ఫెక్షన్ నాశనం చేస్తుంది. చిగుళ్ల వ్యాధి ఒక ఇన్ఫెక్షన్ కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు చిగుళ్లలో ఏర్పడే గాయాలు నయమయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల మధుమేహం ఉన్నవారికి చికిత్స చేయడం కష్టమవుతుంది. దంతాలను తొలగించడం లేదా మరేదైన నోటి సర్జరీని నిర్వహించిన తర్వాత కోలుకోడానికి ఎక్కువ సమయం పడుతుంది. 

Also Read: ఛీ.. దరిద్రుడు, కారు నడుపుతూ డ్రైవర్ పాడుపని.. మహిళకు ఊహించని చేదు అనుభవం
 
ADA అధ్యయనంలో పరీక్షించిన మధుమేహ వ్యాధిగ్రస్తులలో దాదాపు 28 శాతం మంది తమ దంతాలన్నింటినీ కోల్పోయారు. రక్తంలో ఉండే అదనపు గ్లూకోజ్ చిగుళ్ల వ్యాధి, ఇన్ఫె్క్షన్ సంభావ్యతను పెంచుతుంది. కాబట్టి.. మీ నోటిలో ఏమైనా సమస్యలు కనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి. చిగుళ్ల సమస్య ఉన్నవాళ్లు స్మోకింగ్ మానేయాలి. ఎందుకంటే ధూమపానం మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. చిగుళ్ల(గమ్) ఇన్ఫెక్షన్‌తో పోరాడటం కష్టతరం చేస్తుంది. కాబట్టి.. మీరు ఇంట్లో ఎప్పటికప్పుడు డయాబెటిక్ స్థాయిలను తెలుసుకోవాలి. కాబట్టి చిగుళ్ల సమస్యపై అప్రమత్తంగా ఉండడి. పళ్లు మొత్తం ఊడిపోయేంత ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు. 

Read also:

  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

Read also:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: డయాబెటిస్ Diabetes Gum Disease Blood Sugar Level Diabetes Gum Disease Blood Sugar Level Diabetes Mouth Diseases

సంబంధిత కథనాలు

Prostate Cancer: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Prostate Cancer: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Broken Heart: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?

Broken Heart: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?

Urine Eggs: ఈ దేశంలో గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు.. ఇందుకో కారణం ఉంది!

Urine Eggs: ఈ దేశంలో గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు.. ఇందుకో కారణం ఉంది!

Standing in Queue Job : వ్వాట్ ..యాన్ ఐడియా సర్‌జీ.. క్యూలో నిలబడితే రోజుకు రూ. 16 వేలు !

Standing in Queue Job :  వ్వాట్ ..యాన్ ఐడియా సర్‌జీ.. క్యూలో నిలబడితే రోజుకు రూ. 16 వేలు !

Longest Married Couple: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు

Longest Married Couple: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు

టాప్ స్టోరీస్

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

TS Schools  :  తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Sperm Theft : స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?

Sperm Theft :  స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?

OnePlus 9RT Amazon Sale: వన్‌ప్లస్ 9ఆర్‌టీ సేల్ ప్రారంభం.. అమెజాన్‌లో ఆఫర్లు కూడా!

OnePlus 9RT Amazon Sale: వన్‌ప్లస్ 9ఆర్‌టీ సేల్ ప్రారంభం.. అమెజాన్‌లో ఆఫర్లు కూడా!