By: ABP Desam | Updated at : 27 Aug 2023 08:52 AM (IST)
Image Credit: Pixabay
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి మొక్కల ఆధారిత ఆహారం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అందిస్తుందని అనుకుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది వెజిటేరియన్స్ కూడా వీగన్స్ గా మారిపోతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ అందిస్తుంది. అయితే మొక్కల ఆధారిత ఆహారాల వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మొక్కల ఆధారిత ఆహారాలని డైట్లో చేర్చుకోవాలి.
సూక్ష్మపోషకాల లోపం
సంతుల్యమైన మొక్కల ఆధారిత ఆహారం అనేక రకాల పోషకాలని అందించగలదు. విటమిన్ బి12, ఇనుము, జింక్, కాల్షియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మొక్కల ఆధారిత ఆహారాల్లో పుష్కలంగా లభించకపోవచ్చు. ఇవి లోపిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు డీహెచ్ఏ రూపంలో ఉండి మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది చేపలలో పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు, వాల్ నట్స్ లో ఏఎల్ ఏ రూపంలో అందుతాయి. ఇది శరీరం డీహెచ్ఏ గా మార్చగలదు. కానీ అది ఒక్కోసారి సమర్థవంతంగా ఉండకపోవచ్చు. సరిగా అందకపోతే జ్ఞాపకశక్తి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకి దారి తీయవచ్చు.
గ్యాస్, ఉబ్బరానికి కారణమవుతుంది
మొక్కల ఆధారిత ఆహారాలు ఫైబర్ మొత్తాన్ని గణనీయంగా పెంచుతాయి. ఇది గ్యాస్, ఉబ్బరానికి కారణమవుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకున్నప్పుడు హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. గ్యాస్, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
అలర్జీలు
గింజలు, సోయా, గ్లూటెన్ రహిత ధాన్యాలు వంటి కొన్ని మొక్కల ఆధారిత ఆహార పదార్థాల మీద ఎక్కువగా ఆధారపడితే కొంతమందికి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని తగ్గించేందుకు ఆహారంలో వెరైటీగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.
బరువు పెరుగుతారు
బరువు తగ్గడానికి మొక్కల ఆధారిత ఆహారం ప్రభావవంతంగా పని చేస్తుంది. కానీ ఇది బరువును కూడా పెంచుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. సంతృప్త శాఖాహార పదార్థాలు లేదా అధిక కేలరీల స్నాక్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు.
థైరాయిడ్ పనితీరుకి ఆటంకం
బ్రకోలి, కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయాల్లోని సమ్మేళనాలు థైరాయిడ్ పని తీరుని దెబ్బతీస్తాయి. వీటిని ఉడికించి తినడం వల్ల వాటి ప్రభావాలు తగ్గించుకోవచ్చు.
జీర్ణ సమస్యలు
ఒక్కసారిగా మొక్కల ఆధారిత ఆహారానికి మారితే జీర్ణ అసౌకర్యానికి దారి తీస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వల్ల వచ్చే ఫైబర్ గ్యాస్, ఉబ్బరం, పేగు కదలికల్లో మార్పులకు కారణమవుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. అందుకే క్రమంగా ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ప్యాక్ చేసిన సలాడ్ ఆరగిస్తున్నారా? జాగ్రత్త ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది
రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం
Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి
Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Apple: రాత్రి వేళల్లో ఆపిల్ పండ్లు తినకూడదా? తింటే ఏమవుతుంది?
విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్ మూసివేత
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్! టీమ్‌ఇండియాకు నెర్వస్ ఫీలింగ్!
/body>