అన్వేషించండి

Weight Loss: హఠాత్తుగా బరువు తగ్గడం వెనుక డేంజర్ బెల్స్ ఇవే

బరువు తగ్గితే సంతోషించాల్సిన విషయమే కానీ హఠాత్తుగా తగ్గితే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.

అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గడం మంచి విషయమే. ఎప్పుడూ కూడా హఠాత్తుగా బరువు తగ్గకూడదు. బరువు త్వరగా తగ్గుతున్నారంటే దానికి కచ్చితంగా కొన్ని కారణాలు ఉంటాయి.బరువు కోల్పోవడం అనేది స్థిరంగా సాగాలి తప్ప,హఠాత్తుగా జరగకూడదు. మీ బరువు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బరువు హఠాత్తుగా తగ్గుతూ, జుట్టు కూడా రాలుతోందంటే ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్టు అర్థం. సడెన్ గా బరువు తగ్గడం వెనుక దాగి ఉన్న ప్రమాద కారకాలు ఇవి కావచ్చు. 

థైరాయిడ్
థైరాయిడ్ సమస్యలు బరువు తగ్గడానికి, అలాగే పెరగడానికి కూడా కారణమవుతాయి. జీవక్రియలను నియంత్రించేది థైరాయిడ్ గ్రంథే. జీవక్రియల వేగం పెరిగినప్పుడు బరువు త్వరగా కోల్పోతారు. అలా వేగంగా ఉండడం హానికరం. అంటే థైరాయిడ్ అవసరమైనదాని కన్నా చురుకుగా పనిచేస్తుందన్నమాట. హృదయ స్పందన రేటు,ఎక్కువ ఆందోళన,వణుకు, నిద్రలేమి  వంటి సమస్యలు థైరాయిడ్ అతిగా పనిచేయడం వల్ల కలుగుతుంది. 

ఉదర వ్యాధులు
సెలియాక్ వ్యాధి, క్రోన్స్ వ్యాధి, లాక్టోజ్ ఇంటాలరెన్స్, పేగు సమస్యలు... ఇవన్నీ ఉదర వ్యాధుల కిందకి వస్తాయి. పేగు అవసరమైన పోషకాలను గ్రహించదు. ఇలాంటి వారు గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యాధుల వల్ల కూడా హఠాత్తుగా బరువు తగ్గిపోతారు. 

క్యాన్సర్
వేగంగా బరువు తగ్గడం అనేది క్యాన్సర్ సైడ్ ఎఫెక్టులలో ఒకటి. గ్యాస్ట్రిక్, పాంక్రియాటిక్, ఊపిరితిత్తులు, కొలెరెక్టర్ క్యాన్సర్లు సోకితే బరువు త్వరగా తగ్గి బలహీనంగా మారుతారు. అసహజంగా బరువు తగ్గినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

Also read: అన్నీ ఉన్నా ఆత్మహత్యలెందుకు? డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఉందా?

రుమటాయిడ్ ఆర్ధరైటిస్
శరీరంలో కీళ్లను ప్రభావిత దీర్ఘకాలిక రుగ్మత రుమటాయిడ్ ఆర్ధరైటిస్. ఇది సోకితే బరువు వేగంగా తగ్గిపోతారు. ప్రో ఇన్ ఫ్లమ్మేటరీ సైటోకిన్లు ఈ వ్యాధిలో మంటను, నొప్పిని పెంచుతాయి. శక్తిని అధికంగా ఖర్చయ్యేలా చేస్తాయి. ఎక్కువ కేలరీలు, కొవ్వును కాల్చేస్తాయి. దీంతో బరువు త్వరగా తగ్గిపోతారు. 

డ్రగ్స్ తీసుకునేవారిలో కూడా ఆకలి సరైన సమయానికి వేయదు. తినాలన్నా ఆసక్తి ఉండదు. దీని వల్ల వారు కూడా బరువు త్వరగా కోల్పోతారు. మద్యపానం, ధూమపానం అలవాటున్న వారు కూడా ఆహారాన్ని సరిగా తీసుకోరు. అలాగే ఈటింగ్ డిజార్డర్స్ కూడా బరువు తగ్గేందుకు కారణాలే. 

Also read: హైబీపీ ఉన్న వారికి కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా? వచ్చే ఛాన్స్ ఎంత?

Also read: ఏడాదికి ఒక్కసారి రక్తదానం చేయండి చాలు, ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు

టాప్ హెడ్ లైన్స్

Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
High Blood Pressure : హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే
హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే
HIV Prevention Injection : హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
Creatine and Hair Loss : క్రియేటిన్ వల్ల బట్టతల వస్తోందా? 20-30 ఏళ్లకే జుట్టు రాలడానికి డాక్టర్లు చెప్తోన్న కారణాలు ఇవే
క్రియేటిన్ వల్ల బట్టతల వస్తోందా? 20-30 ఏళ్లకే జుట్టు రాలడానికి డాక్టర్లు చెప్తోన్న కారణాలు ఇవే

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
Embed widget