Health Tips: ఈ పనులు చేస్తే, వ్యాయామం అవసరం లేకుండానే ఆరోగ్యం మీ సొంతం!
బరువు తగ్గించాలంటే కడుపు మాడ్చుకుని జిమ్ మీద పడిపోతారు. కానీ వ్యాయామం కంటే రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటే చాలా మంచిదని కొత్త పరిశోధనలు చెప్తున్నాయి.
కండలు పెంచుకోవడానికి కొవ్వుని కరిగించుకోడానికి గంటలు తరబడి వ్యాయామం చేయాల్సిన పని లేదని చెప్తున్నారు నిపుణులు. కేవలం రోజువారీ కార్యకాలపాలు సక్రమంగా నిర్వహించుకుంటే వ్యాయామ కంటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని కొత్తగా చేసిన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కండరాల బలానికి రోజువారీ కార్యకలాపాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటున్నాయి.
పరిశోధనల్లో ఏం తేలిందంటే..
జపాన్ కి చెందిన పరిశోధకులు వ్యాయామం చేసే వారిని మూడు గ్రూపులుగా విభజించి నాలుగు వారాల పాటు వాళ్ళు చేస్తున్న పనులను అధ్యయనం చేశారు. చేతులతో చేసే వ్యాయామం, కండరాల బలం, కండరాల్లో వచ్చే మార్పులని వాళ్ళు గమనించారు. జిమ్ లో వాళ్ళు ఎటువంటి వ్యాయామం చేస్తున్నారు, దాని వల్ల వాళ్ళ కండరాల్లో ఎటువంటి సంకోచాలు జరుగుతున్నాయనేది పరిశీలించారు. వ్యాయామం కంటే రోజువారీ పనులు చేసుకుంటున్న వారిలో కండరాలు మరింత బలంగా తయారవుతున్నాయి.
ఇంటి పనులే.. సో బెటర్!
చేతి కండరాలు బలంగా ఉండేందుకు డంబెల్స్ తో ఎక్సర్ సైజ్లు చేస్తారు. కానీ చేతులతో ఇంట్లో పనులు చెయ్యడం వల్ల ఇంక మంచి ఫలితాలను గుర్తించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండటానికి కండరాల బలం ఎంతో ముఖ్యం. రోజుకి కేవలం ఆరు సార్లు డంబెల్ తో వ్యాయామం చెయ్యడం వల్ల చేతి కండరాలు బలంగా మారతాయని సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం పెద్దలు ప్రతి రోజు చురుగ్గా ఉండేందుకు శారీరక శ్రమ చెయ్యాలని మార్గదర్శకాలు జారీ చేసిందట. వారానికి కనీసం 2.5 – 5 గంటల పాటు మితంగా వ్యాయామం చెయ్యాలని సూచించింది.
శరీరక శ్రమతోనే ఆరోగ్యం
బరువు తగ్గేందుకు వారానికి ఇంత లక్ష్యం అని పెట్టుకునే బదులుగా శారీరక శ్రమ ఉండే రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటూ ఉండటం మంచిదని పరిశోధకులు వెల్లడించారు. ఎక్కడికైనా తక్కువ దూరం వెళ్ళాలి అనుకున్నప్పుడు బైక్ వంటి వాటిని ఉపయోగించకుండా చక్కగా నడుచుకుంటూ లేదా సైక్లింగ్ చేసుకుని వెళ్ళడం ఉత్తమం. దీని వల్ల మీరు ఒకవేళ ఉదయం పూట వ్యాయామం చేయకపోతే ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇలా రోజూ చేస్తే బరువు పెరగరట!
ఆడవాళ్ళు ఇంట్లో తమ సొంత పనులు చేసుకుంటూ కూడా బరువుని నియంత్రించుకోవచ్చు. కిందకి వంగి పనులు చెయ్యడం వల్ల పొట్ట తగ్గుతుంది. ప్రతి రోజు కొద్ది సేపు కింద కూర్చుని లేదా వంగి పనులు చేసుకోవడం వల్ల నడుము, పొట్టకి మంచి ఎక్సర్ సైజ్ గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు వ్యాయామం మీదే కాదు తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కంటికి నచ్చినవి కదా అని నోటికి పని చెప్పకూడదు. అలా చెయ్యడం వల్ల మీరు అనుకున్న లక్ష్యం గాలికి వదిలేసినట్లే అయిపోతుంది. అందుకే తినే తిండి విషయంలో లిమిట్ పెట్టుకోవాలి. పోషకాలు సమృద్దిగా అందేవి తింటూనే మితంగా తినాలి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త తగినంత నీరు తాగడం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. త్వరగా బరువు తగ్గాలి కదా అని అతిగా జిమ్ మీద పడి వ్యాయామం చేస్తే ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే మనం చేసుకునే చిన్న చిన్న పనులకు తోడు కొద్దిగా వ్యాయామం చెయ్యడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Also Read: ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!