NewYear Food Resolution: కొత్త ఏడాదిలో వీటిని తినడం తగ్గించండి... ఏ అనారోగ్యాలు దరిచేరవు
కొత్త ఏడాదిలో ఆహారానికి సంబంధించి రిజల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆహారంలో మంచి, చెడూ రెండూ ఉన్నాయి. కొత్త ఏడాదిలో మంచి ఆహారాన్ని మాత్రమే తింటూ, చెడు తిండిని దూరంగా పెట్టాలి. మీరు ఇంకా కొత్త ఏడాదిలో ఏ రిజల్యూషన్ తీసుకోపోతే, ఆహారానికి సంబంధించి ఒక రిజల్యూషన్ తీసుకోవడం చాలా మంచిది. ఈ కింద చెప్పిన ఆహారాలు తినకుండా ఉంటామని నిర్ణయం తీసుకోండి. వీటిని తినడం మానేసినా లేదా తగ్గించినా కూడా మంచిదే.
మద్యం
దీర్ఘాయుష్షును, ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటున్నట్టు అయితే మీరు తాగే పానీయాల జాబితా నుంచి మద్యాన్ని తొలగించండి. దీనికి తరచూ తాగడం వల్ల హైబీపీ, గుండె వైఫల్యం, రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడడం వంటివి కలుగుతాయి. అలాగే దీనికి జతగా ఉండే స్మోకింగ్‌ను కూడా పూర్తిగా వదిలేయాలి.
జంక్ ఫుడ్
జంక్ ఫుడ్ తినే అలవాటు చాలా మందికి ఉంది. ఆరోగ్యం కోసం ఈ అలవాటును మీరు త్యాగం చేయాలి. ఇవి మీ చర్మాన్ని చాలా జిడ్డుగా మారుస్తాయి. అంతేకాదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. జంక్ ఫుడ్‌లో సంతృప్త మరియు మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి, ఇది ఊబకాయానికి దారితీస్తుంది.
శీతల పానీయాలు
మీ గుండె ఆరోగ్యం బాగుండాలంటే కార్బోనేటెడ్ పానీయాలైన కూల్ డ్రింక్స్‌ను దూరం పెట్టాలి. సోడా ఎక్కువగా ఉండే పానీయాలు తాగడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది. గుండెకు ఆరోగ్యపరంగా చాలా నష్టం కలుగుతుంది.
బేకరీ ఐటెమ్స్
కేకులు, కుకీలు, మఫిన్లు వంటి బేకరీ ఉత్పత్తులు తినడాన్ని తగ్గించాలి. వీటిని ఎక్కువగా తినడం వల్ల గుండెపై చెడు ప్రభావం పడుతుంది. వీటిలో అధిక చక్కెర ఉంటుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువే.
శుద్ధిచేసిన ఆహారం
మాంసంతో పాటూ ప్రాసెస్ చేసిన రకరకాల ఆహారాలు నిత్యం వాడుకలో ఉన్నాయి. అలాంటి ఆహారం తినడం వల్ల గుండెకు ప్రమాదం. ప్రాసెస్ చేయడానికి అధికంగా ఉప్పును వాడతారు. కాబట్టి అలా అధికస్థాయిలో ఉప్పును తీసుకోవడం గుండె దెబ్బతింటుంది. ఆహారంలో తక్కువ కొవ్వు ప్రోటీన్లను తినాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
Also read: యాంగ్జయిటీ లక్షణాలు తగ్గాలంటే వ్యాయామం చేయాల్సిందే... కొత్త అధ్యయన ఫలితం
Also read: బిడ్డకు తల్లి పాలే పడకపోవడం నిజంగా శాపమే, ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే...
Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?